కన్న పేగే కడతేర్చింది
ఇద్దరు కుమార్తెలకు పురుగుల
మందు తాగించిన మహిళ పెద్ద కుమార్తె మృతి
అపస్మారక స్థితిలో చిన్నకూతురు
అనంతరం తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం
సూదనపల్లిలో విషాద ఛాయలు
సూదనపల్లి(కురవి) : నవమాసాలు మోసి, పురిటినొప్పులు పడి జన్మనిచ్చిన తల్లే తన పేగు బంధాన్ని తెంచేసుకుంది. పరారుు పురుషుడి మోజులోపడి మాతృత్వాన్ని, మానవత్వాన్ని మరిచింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో కడుపున పుట్టిన బిడ్డలకు విషమిచ్చింది. వారిలో పెద్దకుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా, చిన్నకూతురు అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ తర్వాత సదరు మహిళ తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆస్పత్రి పాలైంది. నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ సంఘటన కురవి మండలంలోని సూదనపల్లిలో విషాదం మిగిల్చింది.
వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మట్టెగజపు లింగయ్య కుమార్తె కవితతో సూదనపల్లికి చెందిన తోట పాపయ్యకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు గీతిక(4), సాయి దీప్తి జన్మించారు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే వీరు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ కూలీ చేసుకుంటున్నారు. బ్యాం కు అకౌంట్ తీసేందుకని ఇటీవల స్వగ్రామం చేరుకున్నారు. 15వ తేదీన వారు మానుకోటలోని ఓ బ్యాం కులో అకౌంట్ తీసేందుకు వెళ్లి, ఖాతా తెరవకుండా నే తిరిగొచ్చారు. అదే రోజు కవిత తన భర్తకు తెలి యకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెప్పాపెట్టకుండా వెళ్లిపోరుుంది. భార్య పుట్టింటికి వెళ్లిందని భావించిన పాపయ్య హైదరాబాద్ వెళ్లేందుకు ఆది వారం బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడి మామ లింగయ్య ఫోన్‌చేసి పిల్లలకు కవిత పురుగులమందు తాగించిన విషయం చెప్పాడు. దీంతో అతడు హైదరాబాద్‌కు వెళ్లకుండ తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
ప్రియుడితో కలిసి వెళ్లి.. అఘారుుత్యం..
సూదనపల్లి నుంచి పిల్లలను తీసుకుని బయల్దేరిన కవిత నేరుగా తన మేనత్త ఊరైన నూతనకల్ మండలంలోని జి.కొత్తపల్లికి వెళ్లింది. అనంతరం తన మేనత్త కుమారుడు శ్రీపాల్‌తో కలిసి కూతుళ్లకు పురుగుల మందు తాగించి హత్య చేయూలని పథకం రచించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-చిట్యాల మధ్యలో ఉన్న గుట్ట వద్ద పిల్లలిద్దరికి వారు పురుగుల మందు తాగించారు. దీంతో పెద్దకుమార్తె గీతిక అక్కడికక్కడే మృతిచెందగా, సారుుదీప్తి పరిస్థితి విషమంగా మారింది. అనంతరం కవిత, శ్రీపాల్ కూడా పురుగుల మందు తాగి సారుుదీప్తిని తీసుకుని ప్రధాన రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీపాల్ తన తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, అతడు వెంటనే కవిత తండ్రి లింగయ్యకు సమాచారమిచ్చాడు. దీంతో లింగయ్య సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గీతిక మృతదేహం కనిపించింది. సాయిదీప్తి, కవిత, శ్రీపాల్ అంబులెన్స్‌లో హైదరాబాద్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్లు లింగయ్య చెప్పాడు.
ఇదిలా ఉండగా గీతిక మృతదేహాన్ని ఆదివారం సూదనపల్లికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యూరు. అయితే కేసు పెట్టకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడంతో వారు సీరోలు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఇక్కడ కేసు నమోదు చేయడం కుదరదని, సంఘటన జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయూలని సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారుు.