Fashion: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్‌ ధర తెలిస్తే షాక్‌! మరీ అంత ఖరీదు ఎందుకంటే! | Actress Sreeleela In Geethika Kanumilli White Anarkali Costs Leaves Shock | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర 68 వేలు! స్పెషాలిటీ ఏమిటి?

Published Mon, Sep 19 2022 2:04 PM | Last Updated on Mon, Sep 19 2022 2:58 PM

Actress Sreeleela In Geethika Kanumilli White Anarkali Costs Leaves Shock - Sakshi

నటన.. తను అలవోకగా అభినయించే కళ అని నిరూపించింది నటి శ్రీలీల! ఫ్యాషన్‌ విషయంలోనూ ఎలాంటి ట్రెండ్‌ను అయినా అంతే అవలీలగా తన స్టయిల్‌గా మార్చుకోగలదు అనీ అర్థమవుతోంది ఆమె అనుసరించే బ్రాండ్స్‌ను చూస్తుంటే.. 

గీతిక కానుమిల్లి.. 
హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి గొప్ప ఫ్యాషన్‌  డిజైనర్‌ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌  డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో  ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది.

అనతికాలంలోనే ఆమె డిజైన్స్‌ పాపులరై, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్‌ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌  చేస్తుంటుంది. ధర కూడా డిజైన్‌ను బట్టే  వేల నుంచి లక్షల్లో పలుకుతుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌  స్టోర్స్‌ అన్నిటిలోనూ ఈ డిజైన్స్‌ లభిస్తాయి.

ద ట్రింక్‌ హాలిక్‌..
ఇదొక ఇన్‌స్టాగ్రామ్‌ షాపింగ్‌ సైట్‌. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్‌.. తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ. అందుకే, సామాన్యులూ..  సెలబ్రిటీలకూ ఇది ఫేవరెట్‌ బ్రాండ్‌.  ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా  వాట్సాప్‌ ద్వారా  కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ బ్రాండ్‌: గీతిక కానుమిల్లి
ధర: రూ. 68,000

జ్యూయెలరీ బ్రాండ్‌: ద ట్రింక్‌ హాలిక్‌
ధర:రూ. 850
మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా  మనసును నియంత్రించుకోవచ్చు.– శ్రీలీల 
- దీపిక కొండి 

చదవండి: Evening Sandals: ఈవెనింగ్‌ శాండల్స్‌.. నడకలో రాజసం.. పార్టీవేర్‌ ఫుట్‌వేర్‌!
Ketika Sharma: కేతిక శర్మ ధరించిన చీర ధరెంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement