సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్‌మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.
2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మూడు, బెంగళూరు, హైదరాబాద్‌లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.
హెచ్‌ఎన్‌ఐ, ప్రవాసుల డిమాండ్
గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్‌మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్‌పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment