ఘనంగా సమాజ్‌ వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం | Samajwadi Party Formation Day Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా సమాజ్‌ వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Published Sat, Oct 5 2024 8:04 AM | Last Updated on Sat, Oct 5 2024 8:05 AM

Samajwadi Party Formation Day Celebrations

సాక్షి, హైదరాబాద్‌: సమాజ్‌ వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఘనంగా జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆ పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ డివిజన్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5 దుర్గా భవాని నగర్‌ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కళ్యాణ్‌ యాదవ్‌ మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని.. తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

త్వరలోనే నగరవ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ ఏ విధంగా అయితే విజయదుందిబి మోగించారో.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహాలో విజయాన్ని నమోదు చేసి సీఎంగా అఖిలేష్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేస్తారని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ నర్సింగ్‌ రావు, బస్తీ నేత శ్రీను నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement