ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్- ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్‌స్టోరీ అందరికి తెలిసిందే. క్యూట్ లవ్‌కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఆసీస్ జట్టులో అన్ని ఫార్మాట్లలోనూ కీలకబౌలర్‌గా సేవలందింస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి స్టార్క్ ఇప్పటివరకు 529 వికెట్లు తీశాడు. మరోవైపు అలీసా హేలీ ఆస్ట్రేలియన్ వుమెన్స్ టీమ్‌లో ప్రధాన బ్యాటర్‌గా రాణిస్తుంది. టి20ల్లో 2,136 పరుగులు, వన్డేల్లో 2039 పరుగులు, ఆరు టెస్టుల్లో 236 పరుగులు చేసింది.
చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం
ఇక ఆస్ట్రేలియా మెన్స్ టీమ్‌కు ప్రస్తుతం ఏ సిరీస్‌లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియన్ వుమెన్స్ యాషెస్ టెస్టు మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మ్యాచ్ చివరిరోజు ఆటలో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో మిచెల్ స్టార్క్, అలీసా హేలీల రొమాంటిక్ యాంగిల్ కెమెరాలకు చిక్కింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హేలీ.. డోనట్‌ను స్టార్క్‌కు ఇచ్చింది. స్టార్క్ ఆ డోనట్‌ను సగం చేసి తన భార్యకు ప్రేమతో తినిపించాడు. ఈ సమయంలో మైదానంలోని కెమెరాలన్నీ వీరిద్దరిపై ఫోకస్ చేశాయి. ఇది చూసిన సహచర మహిళ ప్లేయర్స్ వారిద్దరి క్యూట్‌లవ్‌కు తెగ ముచ్చటపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఇంగ్లండ్‌తో వుమెన్స్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. 48 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులతో విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ వుమెన్స్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి కేవలం 26 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను పడగొట్టారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంగ్లండ్ పరిస్థితి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ కష్టతరంగా డ్రా చేసుకుంది. 48 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ వుమెన్స్‌లో అన్నాబెల్ సుథర్‌లాండ్ 3, అల్నా కింగ్ 2, ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: Akhtar Vs Brett Lee: ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు
Cute 🥰#Ashes pic.twitter.com/WlAMXUXzoy
— 7Cricket (@7Cricket) January 30, 2022
Comments
Please login to add a commentAdd a comment