MS Dhoni Visits Indian Dressing Room In Edgbaston - Sakshi
Sakshi News home page

టీ20 మ్యాచ్‌: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రత్యక్షమైన ధోని.. ప్లేయర్లకు సలహాలు!

Published Sun, Jul 10 2022 4:59 PM | Last Updated on Sun, Jul 10 2022 5:27 PM

MS Dhoni Visits Indian Dressing Room In Edgbaston - Sakshi

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. బట్లర్‌ సేనకు రెండు సార్టు అలౌట్‌ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా, నేడు(ఆదివారం) మూడో టీ20 జరుగనుంది. 

అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు, అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. శనివారం మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు బీసీసీఐ సైతం ఈ ఫొటోలను అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు అంటూ ఈ ఫొటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది.

ఇక, టీమిండియా డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కూడా ధోనితో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన తన 41 పుట్టినరోజు సందర్భంగా ధోని వింబుల్డన్ మ్యాచ్‌ను కూడా చూశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. 

ఇది కూడా చదవండి: టీ20ల్లో రోహిత్‌ శర్మ అరుదైన ఫీట్‌.. తొలి భారత ఆటగాడిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement