England- India series
-
ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్.. ప్లేయర్స్, ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసిన ధోని
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. బట్లర్ సేనకు రెండు సార్టు అలౌట్ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా, నేడు(ఆదివారం) మూడో టీ20 జరుగనుంది. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. శనివారం మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు బీసీసీఐ సైతం ఈ ఫొటోలను అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు అంటూ ఈ ఫొటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. Always all ears when the great @msdhoni talks! 👍 👍#TeamIndia | #ENGvIND pic.twitter.com/YKQS8taVcH — BCCI (@BCCI) July 9, 2022 ఇక, టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ధోనితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన తన 41 పుట్టినరోజు సందర్భంగా ధోని వింబుల్డన్ మ్యాచ్‌ను కూడా చూశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. Got goosebumps after watching this. Beautiful heart touching moment for Indian fans.Past, present and future of Indian cricket team. #indvseng pic.twitter.com/6PTtGQ6Ek6 — Rohit.Bishnoi (@The_kafir_boy_2) July 9, 2022 ఇది కూడా చదవండి: టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్.. తొలి భారత ఆటగాడిగా..! -
పంత్‌కు సపోర్టు.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దినేశ్ కార్తీక్ కౌంటర్
భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. దీంతో, టీం ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లాండ్- టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, భారత జట్టు 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. భారత జట్టు స్కోర్ బోర్డును జడేజాతో కలిసి ముందుకు తీసుకెళ్లాడు. కాగా, పంత్ 146 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక, మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్‌లో పెట్టింది. కానీ, దానికి టైటిల్.. మాత్రం ఇంగ్లాండ్ జట్టును పొడుగుతున్నట్టుగా రాసుకొచ్చింది. రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్‌ను చూసిన దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు. కార్తీక్ ట్విట్టర్ వేదికగా.. ‘‘రిషబ్ పంత్ అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ, రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది” అని రాసుకొచ్చాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనంతరం.. ఎవరు మంచి ప్రదర్శ చేస్తారో వార పేరునే టైటిల్స్ పెడతారు. కానీ, ఈసీబీ మాత్రం అలా చేయకపోవడంతో దినేశ్ కార్తీక్ ఇలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. After such an engrossing, enthralling days play, I'm sure the headline can be much better and apt than this @ECB_cricket That knock by @RishabhPant17 land the quality of test cricket played by both sides were as good as it can be and this is how you sum up a day 🤔#ENGvIND pic.twitter.com/T51tBycL6W — DK (@DineshKarthik) July 2, 2022 ఇది కూడా చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..! -
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
-
కరణ్ నాయర్ ‘టెస్ట్’అరంగేట్రం
మొహాలీ: టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్ కల నిజమైంది. ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో భాగంగా మొహాలీలో ప్రారంభమైన మూడో టెస్టులో కరణ్ నాయర్ తుది 11 మందిలో ఒకడిగా ఎంపికయ్యాడు. మరో యువ బ్యాట్స్‌మన్ కేఎల్.రాహుల్ అనూహ్యంగా గాయపడటంతో నాయర్‌కు జట్టులో బెర్త్ దక్కింది. శనివారం ఉదయం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. టాస్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లోకి దిగడానికి కొద్ది నిమిషాల ముందు కోచ్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తదితరులు కరణ్ నాయర్‌కు జాతీయ జట్టు టోపీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేయగల నాయర్.. నిజానికి గత జింబాబ్వే సిరీస్‌లోనే జట్టులో చోటు దక్కినప్పటికీ స్టాండ్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మొదటిసారి 11 మంది జాబితాలో చోటు దక్కడంపై సంతోషంగా ఉందని, టీమిండియా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని నాయర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టు డ్రాగా ముగియగా, విశాఖ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇక మూడో టెస్టుకు వేదికైన పీసీఏ(మొహాలీ) మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. దీంతో మూడో టెస్టులోనైనా పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నాయర్‌కు జాతీయ జట్టు టోపీ అందిస్తోన్న గవాస్కర్, కుంబ్లే.. -
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
మొహాలీ: తనపై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇండియా- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ కోసం మొహాలీ వచ్చిన కోహ్లీ.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నిజానికి నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్(మొదటి) టెస్ట్‌లో నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని కోహ్లీ మీడియాతో అన్నారు. న్యూస్ పేపర్లో కథనం ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థి జట్టు (ఇంగ్లాండ్) ఆటగాళ్లుకానీ, మ్యాచ్ అంపైర్లుగానీ కనీసం ఫిర్యాదు చేయని విషయాన్ని హైలైట్ చేస్తూ బ్రిటీష్ పత్రిక రాసిన కథనాన్ని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా కొందరు మాజీలు ఖండించారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్‌కి పాల్పడినా.. మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే ఫిర్యాదుచేయాల్సి ఉంటుంది. కాగా, బీసీసీఐ, ఐసీసీల మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో కోహ్లీ బలవుతాడా? అనే అనుమానాలూ లేకపోలేదు. పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్‌లు ఆడని కారణంగా టీమిండియా మహిళా జట్టు పాయింట్లను ఐసీసీ కోత విధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా కోహ్లీ పైనా నిబంధనలకు విరుద్ధంగా ఐసీసీ చర్యలకు దిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అనుమానం.