కరణ్ నాయర్ ‘టెస్ట్’అరంగేట్రం
మొహాలీ: టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్ కల నిజమైంది. ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో భాగంగా మొహాలీలో ప్రారంభమైన మూడో టెస్టులో కరణ్ నాయర్ తుది 11 మందిలో ఒకడిగా ఎంపికయ్యాడు. మరో యువ బ్యాట్స్‌మన్ కేఎల్.రాహుల్ అనూహ్యంగా గాయపడటంతో నాయర్‌కు జట్టులో బెర్త్ దక్కింది.
శనివారం ఉదయం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. టాస్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లోకి దిగడానికి కొద్ది నిమిషాల ముందు కోచ్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తదితరులు కరణ్ నాయర్‌కు జాతీయ జట్టు టోపీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేయగల నాయర్.. నిజానికి గత జింబాబ్వే సిరీస్‌లోనే జట్టులో చోటు దక్కినప్పటికీ స్టాండ్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మొదటిసారి 11 మంది జాబితాలో చోటు దక్కడంపై సంతోషంగా ఉందని, టీమిండియా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని నాయర్ అన్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టు డ్రాగా ముగియగా, విశాఖ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇక మూడో టెస్టుకు వేదికైన పీసీఏ(మొహాలీ) మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. దీంతో మూడో టెస్టులోనైనా పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
నాయర్‌కు జాతీయ జట్టు టోపీ అందిస్తోన్న గవాస్కర్, కుంబ్లే..