Test debut
-
అరంగేట్రంలోనే శతక్కొట్టిన ఆసీస్ బ్యాటర్
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ (Josh Inglis) సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే గడిచిన పదేళ్లలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడమ్ వోగ్స్ 2015లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇంగ్లిస్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఫవాద్ ఆలం (పాకిస్తాన్, 2009), సురేశ్ రైనా (భారత్, 2010), షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా, 2011), మొహమ్మద్ అష్రాఫుల్ (బంగ్లాదేశ్, 2001), బెన్ ఫోక్స్ (ఇంగ్లండ్, 2018) శ్రీలంక గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లిస్‌కు ముందు ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ కూడా సెంచరీలు చేశారు. ఖ్వాజా సెంచరీతో ఆగకుంగా డబుల్ సెంచరీతో (232) కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ 141 పరుగులు చేసి ఔటయ్యాడు. 90 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్న ఇంగ్లిస్ 102 పరుగుల (10 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. It's a century on Test debut for Josh Inglis!From just 90 balls, with 10 fours and a six, Inglis is the first Australian to make a century on Test debut since Adam Voges in 2015 #SLvAUS pic.twitter.com/yFCXF74UK9— 7Cricket (@7Cricket) January 30, 2025ఇంగ్లిస్ సెంచరీ చేయగానే అతని తల్లిదండ్రులు ఫ్లైయింగ్ కిస్‌లతో అభినందించారు. ఖ్వాజా, స్మిత్, ఇంగ్లిస్ సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగుల మార్కును తాకింది. శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్‌ల్లో పరుగులు చేసింది.రెండో వేగవంతమైన శతకంఈ మ్యాచ్‌లో 90 బంతుల్లో శతక్కొట్టిన ఇంగ్లిస్ టెస్ట్ అరంగేట్రంలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు శిఖర్ ధనవ్ పేరిట ఉంది. ధవన్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 85 బంతుల్లోనే శతక్కొట్టాడు. ధవన్, ఇంగ్లిస్ తర్వాత టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ 2003లో సౌతాఫ్రికాపై 93 బంతుల్లో సెంచరీ చేశాడు.ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ 20 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ (39), బ్యూ వెబ్‌స్టర్ (23) తమ ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. 148 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 627/5గా ఉంది. -
ఈరోజు దాదాకెంతో ప్రత్యేకం..!
కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సౌరవ్ గంగూలీకి ఈ రోజెంతో ప్రత్యేకం. 1996 జూన్ 22న టెస్టుల్లో అరంగేట్రం చేసిన సౌరవ్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతను 131 పరుగులు సాధించాడు. టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ సౌరవ్ 310 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు. వాటిలో 20 బౌండరీలు ఉండటం విశేషం. (చదవండి: దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా) రాహుల్ ద్రవిడ్‌తో కలిసి 94 పరుగులు జోడించిన అనంతరం జట్టు స్కోరు 296 పరుగుల వద్ద సౌరవ్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికీ ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇక ద్రవిడ్‌కు కూడా ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. అయితే, 95 పరుగుల వద్ద ఔటైన ద్రవిడ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొత్తం మీద 429 పరుగుల చేసిన టీమిండియా 85 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 278 పరుగుల చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2019 అక్టోబర్‌లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘అది గంగూలీకి గుర్తుందో లేదో’) -
టీమిండియా ఆశాకిరణం అతడే
అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో రెండో బంతికే సిక్స్ బాది అందరినీ ఆశ్యర్యపరిచిన టీమిండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్లో అదరగొట్టి.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆకట్టుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మన్ ఆటతీరును మాజీ దిగ్గజ ఆటగాళ్లు మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్ చేరాడు. పంత్ ఆటను చూస్తుంటే తన ఆటను అద్దంలో చూసుకున్నట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో టీమిండియా విజయాల్లో పంత్ పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి బ్యాటింగ్ విధానంలో, క్రీడాస్పూర్తిని చూపించటంలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్లను గుర్తుచేస్తున్నాడని పేర్కొన్నాడు. పంత్‌ను ఇంకా ఏమన్నాడంటే.. ‘నేను అరంగేట్రం మ్యాచ్‌లో ఒత్తిడికి గురై తొలి మూడు బంతులను ఫోర్లుగా మలిచా.. అప్పుడు నాకేం తెలియదు బంతిని బాదాలని మాత్రమే అనుకున్నా. కానీ పంత్ అరంగేట్రం మ్యాచ్‌లో అతడిని చూస్తుంటే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో రెండో బంతిని సిక్స్ కోట్టడంతో పాటు, ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ను అవుట్ (క్యాచ్‌లు, స్టంపౌట్) చేయడంతో అతడి ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపయింది. ఇలాగే కష్టపడితే టీమిండియా భవిష్యత్ కిరణం అతడే కావడంలో సందేహమే లేదు. ప్రస్తుత కీపర్లలో ఎంఎస్ ధోని తర్వాత నాకు పంత్ కీపింగ్ స్టైల్ చాలా నచ్చింది.’ అంటూ ఫరూఖ్ ఇంజనీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఐర్లాండ్ టెస్టు అరంగేట్రానికి వేళాయె...
డబ్లిన్: ఇప్పుడిప్పుడే టి 20లు, వన్డేల్లో నిలదొక్కుకుంటున్న ఐర్లాండ్... టెస్టుల్లోకి అడుగిడుతోంది. శుక్రవారం నుంచి ఆ జట్టు సంప్రదాయ క్రికెట్లో పాకిస్తాన్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గతేడాది అఫ్గానిస్తాన్, ఐర్లాండ్‌లకు టెస్టు హోదా ఇచ్చింది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్ ఆడేందుకు అనుమతి దక్కిన 11వ దేశంగా ఐర్లాండ్ జట్టు నిలిచింది. డబ్లిన్ శివారులోని మాలాహైడ్‌లో జరగనున్న ఈ చరిత్రాత్మక టెస్టులో పసికూనగా బరిలో దిగుతున్న ఐర్లాండ్‌కు... గతంలో పాకిస్తాన్‌కు వన్డేల్లో భారీ షాక్ ఇచ్చిన చరిత్ర ఉంది. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ పరాజయం మరుసటి రోజే అప్పటి పాక్ కోచ్ బాబ్ ఊమర్ హోటల్ గదిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం మరింత కలకలం రేపింది. నాటి ఐర్లాండ్ జట్టులోని పలువురు ఆటగాళ్లు... ప్రస్తుత టెస్టు జట్టులోనూ ఉండటం గమనార్హం. చరిత్రాత్మక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న కొందరు జట్టు సభ్యులు... తమ భావోద్వేగ ఆనందభాష్పాలను కళ్లద్దాల వెనుక దాచుకుంటామంటూ ప్రకటించారు. ఐర్లాండ్ టెస్టు జట్టు: విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (కెప్టెన్), ఎడ్ జాయ్స్, ఆండీ మెక్‌బ్రైన్, కెవిన్ ఒబ్రియెన్, నీల్ ఒబ్రియెన్, బాయ్డ్ రాన్‌కిన్, స్టిర్లింగ్, గ్యారీ విల్సన్, క్రెయిగ్ యంగ్, స్టువర్ట్ థాంప్సన్, జేమ్స్ షానన్, టిమ్ ముర్తాగ్, టైరన్ కేన్, ఆండీ బాల్బిర్నీ. ►ఐర్లాండ్ పురుషుల జట్టుకంటే ముందుగానే మహిళల జట్టు టెస్టు అరంగేట్రం చేసింది. 2000 ఆగస్టులో పాకిస్తాన్ మహిళల జట్టుతో ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్టు ఆడింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఆ టెస్టులో ఐర్లాండ్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో గెలిచింది. ►ఈ మ్యాచ్‌లో బాయ్డ్ రాన్‌కిన్ బరిలోకి దిగితే రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 15వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రాన్‌కిన్ ఇంగ్లండ్ తరఫున ఆడాడు. -
కరణ్ నాయర్ ‘టెస్ట్’అరంగేట్రం
మొహాలీ: టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్ కల నిజమైంది. ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో భాగంగా మొహాలీలో ప్రారంభమైన మూడో టెస్టులో కరణ్ నాయర్ తుది 11 మందిలో ఒకడిగా ఎంపికయ్యాడు. మరో యువ బ్యాట్స్‌మన్ కేఎల్.రాహుల్ అనూహ్యంగా గాయపడటంతో నాయర్‌కు జట్టులో బెర్త్ దక్కింది. శనివారం ఉదయం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. టాస్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లోకి దిగడానికి కొద్ది నిమిషాల ముందు కోచ్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తదితరులు కరణ్ నాయర్‌కు జాతీయ జట్టు టోపీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేయగల నాయర్.. నిజానికి గత జింబాబ్వే సిరీస్‌లోనే జట్టులో చోటు దక్కినప్పటికీ స్టాండ్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మొదటిసారి 11 మంది జాబితాలో చోటు దక్కడంపై సంతోషంగా ఉందని, టీమిండియా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని నాయర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టు డ్రాగా ముగియగా, విశాఖ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇక మూడో టెస్టుకు వేదికైన పీసీఏ(మొహాలీ) మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. దీంతో మూడో టెస్టులోనైనా పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నాయర్‌కు జాతీయ జట్టు టోపీ అందిస్తోన్న గవాస్కర్, కుంబ్లే.. -
సచిన్ కు మరపురాని రోజు
-
సచిన్ కు మరపురాని రోజు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు మరపురాని జ్ఞాపకం. 1989 నవంబర్ 15న ‘లిటిల్ మాస్టర్’ టెస్టు కెరీర్ ప్రారంభమైంది. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సచిన్ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 15 పరుగులు చేసి వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ యూనిస్ కూడా ఇదే మొదటి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోల, పాక్ ప్లేయర్ షాహిద్ సయీద్ కూడా ఇదే మ్యాచ్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. 16 ఏళ్ల 205 రోజుల చిన్న వయసులో సచిన్ టెస్టు కెరీర్ ప్రారంభించాడు. తన విశేష ప్రతిభతో టెండూల్కర్ తర్వాత తిరుగులేని క్రికెటర్ గా ఎదిగాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేశాడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగిన సచిన్ ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 200 టెస్టులు ఆడి 53.78 సగటుతో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో సచిన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్. 46 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. అత్యుత్తమ ఆటతీరు, ఒద్దికైన వ్యక్తిత్వంతో సచిన్ ‘క్రికెట్ దేవుడి’గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. -
రోహిత్ శర్మకు సచిన్ టెస్టు క్యాప్
కోల్‌కతా: వన్డేల్లో సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్గెన్‌లో బుధవారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భుజం నొప్పి కారణంగా వైదొలడంతో రోహిత్‌కు లైన్ క్లియరయింది. ఫేర్ వెల్ టెస్టు ఆడుతున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నుంచి టెస్టు క్యాప్ అందుకుని రోహిత్ మైదానంలో అడుగుపెట్టాడు. అలాగే సొంత మైదానంలో తొలి టెస్టు ఆడుతున్న మీడియం పేసర్ మహ్మద్ షమీ కూడా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ నుంచి క్యాప్ అందుకుని ఆరంగ్రేటం చేశాడు. ఫామ్ కోల్పోవడంతో ఇషాంత్ శర్మకు ఈ టెస్టులో చోటు దక్కలేదు. ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, అజింకా రహానేకు కూడా తుది జట్టులో స్థానం లభించలేదు. ఓపెనర్ మురళీ విజయ్ మరోసారి అవకాశం దక్కింది.