Mohali test
-
Ind Vs Sl 1st Test: అతడు నిస్వార్థపరుడు.. జడేజాపై రోహిత్ శర్మ ప్రశంసలు
Ind Vs Sl 1st Test: India Beat Sri Lanka- టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో టెస్టు మ్యాచ్ మొత్తంలో అతడే హైలెట్ అంటూ ఆకాశానికెత్తాడు. డబుల్ సెంచరీ చేసేందుకు వీలున్నా జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆలోచించాడని కొనియాడాడు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో జడ్డూ భాయ్‌దే కీలక పాత్ర. తొలుత బ్యాట్ ఝులిపించి 175 పరుగుల(17 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించిన జడేజా.. తర్వాత బంతితోనూ చెలరేగాడు. లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్‌లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే, 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. జడేజా డబుల్ సెంచరీకి మరో 25 పరుగుల దూరంలో ఉండగా భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగారు. ఇక ఈ విషయంపై జడేజా ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు వస్తే తాము వికెట్లు పడగొట్టేందుకు పిచ్ అనుకూలిస్తుందన్న నేపథ్యంలో డిక్లేర్ చేయమన్నట్లు వెల్లడించాడు. మ్యాచ్ విజయానంతరం రోహిత్ శర్మ సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్నపుడు జడేజానే ముందుకు వచ్చి డిక్లేర్ చేయమని చెప్పాడన్నాడు. తను నిస్వార్థపరుడంటూ కితాబిచ్చాడు. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 -
Ind Vs Sl: టీమిండియా భారీ విజయం.. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇప్పటికే హిట్‌మ్యాన్ సారథ్యంలో స్వదేశంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా సంప్రదాయ క్రికెట్లోనూ సరికొత్త రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్ తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన రెండో భారత సారథిగా నిలిచాడు. అంతకు ముందు పాలీ ఉమ్రిగర్ ఈ ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలో 1955/56లో న్యూజిలాండ్ మీద భారత్ ఇన్నింగ్స్ మీద 27 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ మీద 222 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(175 పరుగులు నాటౌట్, 9 వికెట్లు)గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 పరుగులు చేశాడు. ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు స్కోర్లు: ఇండియా తొలి ఇన్నింగ్స్ - 574/8 డిక్లేర్డ్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్- 174 పరుగులు ఆలౌట్ శ్రీలంక రెండో ఇన్నింగ్స్- 178 పరుగులు ఆలౌట్ ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో భారత్ విజయం చదవండి: Jasprit Bumrah: వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్ సూపర్ 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 -
Ind Vs Sl 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
-
Ind Vs Sl 1st Test: జడ్డూ భాయ్ అద్భుతం.. టీమిండియా ఘన విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేసింది. భారత బౌలర్లు అశ్విన్, మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ జడేజా చెలరేగడంతో పర్యాటక జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కాగా మొహాలీ వేదికగా శుక్రవారం టీమిండియా- శ్రీలంక మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. రవీంద్ర జడేజా అద్భుత, అజేయ సెంచరీ(175 పరుగులు)తో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక బ్యాట్‌తో మెరిసిన జడేజా బంతితోనూ అద్వితీయ ఆట తీరు కనబరచడంతో శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన కరుణరత్నే బృందానికి మూడో రోజు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ధనుంజయ డి సిల్వ(30), నిరోషన్ డిక్వెల్లా(51) మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 178 పరుగులకే లంక చాప చుట్టేసింది. ఈ నేపథ్యంలో భారీ విజయం టీమిండియా సొంతమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో 175 పరుగులు(నాటౌట్) సాధించడంతో పాటుగా.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు స్కోర్లు: ఇండియా తొలి ఇన్నింగ్స్ - 574/8 డిక్లేర్డ్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్- 174 పరుగులు ఆలౌట్ శ్రీలంక రెండో ఇన్నింగ్స్- 178 పరుగులు ఆలౌట్ ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో భారత్ విజయం 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 -
IND VS SL 1st Test: కోహ్లిని గౌరవించుకున్న టీమిండియా
Team India Gives Guard Of Honour To Virat Kohli On His 100th Test: కెరీర్లో వందో టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత క్రికెట్ జట్టు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించింది. మొహాలీ టెస్ట్ రెండో రోజు టీమిండియా ఫీల్డింగ్‌కు దిగే ముందు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సూచన మేరకు జట్టు సభ్యులంతా రెండు వరుసలుగా నిలబడి కోహ్లిని గ్రౌండ్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విరాట్ తనదైన స్టైల్లో ఓ చేతిని పైకెత్తి అభివాదం చేస్తూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. The smile on @imVkohli's face says it all.#TeamIndia give him a Guard of Honour on his landmark Test.#VK100 @Paytm #INDvSL pic.twitter.com/Nwn8ReLNUV— BCCI (@BCCI) March 5, 2022 ఇదిలా ఉంటే, కెరీర్లో మైలురాయి టెస్ట్ ఆడుతున్న కోహ్లి, తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులే (76 బంతుల్లో 5 ఫోర్లు) చేసినప్పటికీ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయితో పాటు, సుదీర్ఘ ఫార్మాట్లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (154 ఇన్నింగ్స్), రాహుల్ ద్రవిడ్ (158 ఇన్నింగ్స్), సునీల్ గవాస్కర్ (166 ఇన్నింగ్స్), వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ (160 ఇన్నింగ్స్)లు మాత్రమే 8000 పరుగుల మార్కును దాటగా, కోహ్లి (169 ఇన్నింగ్స్) ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో తాను కొట్టిన ఐదు ఫోర్లతో టెస్ట్ కెరీర్లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక ఫోర్లు బాదిన ఆరో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సచిన్ కెరీర్ మొత్తంలో 2058 ఫోర్లు బాదగా, ద్రవిడ్ 1651, సెహ్వాగ్ 1219, లక్ష్మణ్ 1135, గవాస్కర్ 1016, గంగూలీ 900 ఫోర్లు కొట్టారు. ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా (175) అజేయమైన భారీ శతకంతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 26 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా! -
శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. తొలి రోజు మనదే..
భారత బ్యాటర్స్ గర్జనకు తొలి రోజే శ్రీలంక డీలా పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఇచ్చిన చక్కని ఆరంభంతో తొలి టెస్టు ఆట పరుగుల బాట పట్టింది. తుది జట్టులోకి తీసుకోగానే హనుమ విహారి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కోహ్లి కుదురుగా ఆడాడు. వీళ్లంతా టెస్టు ఆడితే రిషభ్ పంత్ ఒక్కడు మెరుపులతో టి20 ఆడుకున్నాడు. దీంతో రోజంతా ప్రత్యర్థి బౌలర్లకు అలసట తప్పలేదు. ఓవరాల్‌గా తొలి రోజును భారత పరుగులు, మెరుపులు శాసించాయి. మొహాలి: పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్... అదే జోరుతో సంప్రదాయ ఆటను సాధికారంగా ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను సులువుగా ఎదుర్కొంది. ప్రత్యేకమైన ‘100వ’ టెస్టులో కోహ్లి (45; 5 ఫోర్లు) మెరుగైన స్కోరు చేయగా, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి (58; 5 ఫోర్లు) తన విలువేంటో బ్యాట్‌తోనే చెప్పాడు. వీరందరికీ భిన్నంగా రిషభ్ పంత్ (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ టెస్టు మొదటి రోజును మెరుపులతో మురిపించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా (45 బ్యాటింగ్), అశ్విన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, మయాంక్ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి చక్కని ఆరంభమే ఇచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో వన్డేలాగే 9.3 ఓవర్లలోనే భారత్ స్కోరు 50కి చేరింది. మరుసటి బంతికే రోహిత్ (29; 6 ఫోర్లు) కాసేపయ్యాక మయాంక్ (33; 5 ఫోర్లు) పెవిలియన్ చేరారు. తర్వాత విహారి, కోహ్లిల భాగస్వామ్యం భారీస్కోరుకు బాటవేసింది. ఫిఫ్టీకి సమీపించిన కోహ్లిని ఎంబుల్దెనియా బౌల్డ్ చేశాడు. విహరిని ఫెర్నాండో అవుట్ చేశాడు. పంత్ అంతే! ఫార్మాట్ ఏదైనా పంత్ తన ఆట మారదని బ్యాట్‌తో మళ్లీ చాటాడు. 44వ ఓవర్లో కోహ్లి అవుటయ్యాక పంత్ క్రీజులోకి వచ్చాడు. రెండు కీలక వికెట్లు స్వల్ప వ్యవధిలోనే పడిపోయినా... పంత్ ఎప్పట్లాగే తనశైలి ఆట ఆడుకున్నాడు. అతనికి అయ్యర్ జతకాగా, 2 వికెట్లు తీసిన ఉత్సాహంతో ఉన్న ఎంబుల్దెనియాకు పంత్ తన సిక్సర్ రుచి చూపాడు. కాసేపు నెమ్మదించిన ఈ డాషింగ్ వికెట్ కీపర్ అడపాదడపా బౌండరీలతో ఫిఫ్టీ (73 బంతుల్లో; 4 ఫోర్లు, 1 సిక్స్) చేరుకున్నాడు. అప్పటిదాకా వన్డే ఆడిన పంత్ ఒక్కసారిగా టి20కి మారిపోయాడు. ఎంబుల్దెనియా వేసిన 76వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 0, 2, 4లతో 22 పరుగులు పిండేశాడు. దెబ్బకు ఓవర్ వ్యవధిలోనే అతని స్కోరు 72 అయ్యింది. ధనంజయ డిసిల్వా వేసిన మరుసటి ఓవర్లోనూ 4, 6 కొట్టి 80 దాటాడు. జట్టు స్కోరు కూడా 300 అధిగమించింది. ఇక స్వల్పవ్యవధిలోనే పంత్ మరో రెండు బౌండరీలు కొట్టడంతో సెంచరీ ఖాయమ నుకున్నారంతా! కానీ లక్మల్ నేరుగా సంధించిన బంతిని సరిగా అంచనా వేయలేక పంత్ బౌల్డయ్యాడు. 4 పరుగుల దూరంలో శతకావకాశాన్ని కోల్పోయినప్పటికీ చివరి 46 పరుగుల్ని కేవలం 24 బంతుల్లోనే బాదడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎంబుల్దెనియా 33; రోహిత్ శర్మ (సి) లక్మల్ (బి) కుమార 29; హనుమ విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్దెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) డిసిల్వా 27; రవీంద్ర జడేజా (బ్యాటింగ్) 45; అశ్విన్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (85 ఓవర్లలో 6 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–52; 2–80, 3–170, 4–175, 5–228, 6–332. బౌలింగ్: లక్మల్ 16–1–63–1, విశ్వ ఫెర్నాండో 16–1–69–1, లహిరు కుమార 10.5–1–52–1, ఎంబుల్దెనియా 28–2–107–2, ధనంజయ డిసిల్వా 11–1–47–1, అసలంక 3.1–0–14–0. -
హైదరాబాద్‌లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం (మార్చి 3) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత క్రికెట్లో నడుస్తున్న పలు అంశాలపై స్పందించాడు. బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కి ఒక వైపే చూడకూడదని, సమస్యను అలాగే చూస్తూ పోతే అద్భుతాలు సాధించలేమని కోహ్లికి పరోక్షంగా మద్దతు పలికాడు. విరాట్ చాలా గొప్ప ఆటగాడని, అతనితో సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి వందో టెస్ట్ కోసం యావత్ భారతంతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 100 టెస్ట్‌లు ఆడటం ఆషామాషీ విషయం కాదని, కోహ్లికి మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, ఈ క్రమంలో అతను మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టంగా ఉందని, వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి హనుమ విహారి, మహ్మద్ సిరాజ్‌లకు మంచి భవిష్యత్తు ఉందని, వారిరువురు ఇదివరకే వారి మార్కు ప్రభావం జట్టుపై చూపారని కొనియాడాడు. ఎంతటి ఆటగాడైనా టీమిండియాలో కొనసాగలంటే మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిందేనని, యువ క్రికెటర్లు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించాడు. చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..! -
శ్రీలంకతో తొలి టెస్టు.. యువ ఓపెనర్‌కు నో ఛాన్స్..!
స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పడు టెస్ట్ సిరీస్‌కు సిద్దమైంది. మొహాలీ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక సిరీస్‌కు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా, సీనియర్ బ్యాటర్లు రహానే,పుజారాలపై వేటుపడింది. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. తన ప్రకటించిన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడు, నాలుగు స్ధానాల్లో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లికు అవకాశం ఇచ్చాడు. ఐదో స్ధానంలో హనుమా విహారిను ఎంపిక చేశాడు. తన జట్టులో ఆరో స్ధానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్‌లకు చోటు ఇచ్చాడు. ఇక చోప్రా ప్రకటించిన జట్టులో యువ ఆటగాడు శుభమన్ గిల్‌కు చోటు దక్కలేదు. ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ సిరాజ్ చదవండి: IND vs SA: భారత పర్యటనకు దక్షిణాఫ్రికా .. రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా..? -
ష్... మాటల్లేవ్!
మొహాలీ టెస్టులో వరుసగా మూడో రోజు కూడా కోహ్లి, స్టోక్స్ మధ్య ఘర్షణ కొనసాగింది. తొలి రోజు ఇద్దరూ మాటలతో కత్తులు దూస్తే... ఆ తర్వాత ఇద్దరూ సైగలతోనే తమ ‘భావాన్ని’ ప్రదర్శించారు! టెస్టు మొదటి రోజు స్టోక్స్ అవుటై వెళుతూ కోహ్లిని ఏదో అనడంతో అతను తిరిగి జవాబివ్వడం, ఆ తర్వాత స్టోక్స్‌ని తప్పు పట్టి ఐసీసీ హెచ్చరించడం తెలిసిందే. రెండో రోజు స్టోక్స్ బౌలింగ్‌లోనే కోహ్లి అవుటయ్యాడు. జట్టు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ‘నేను మాత్రం ఏమీ మాట్లాడను’ అన్నట్లుగా స్టోక్స్ తన నోటిపై చేరుు పెట్టి చూపించాడు. సోమవారం కోహ్లి మళ్లీ అదే తరహాలో బదులిచ్చాడు. అశ్విన్ వేసిన చివరి ఓవర్లో బంతి స్టోక్స్ ప్యాడ్‌కు తగలడంతో అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించారు. అరుుతే కోహ్లి దీనిపై రివ్యూ కోరాడు. ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడంతో స్టోక్స్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సమయంలో కోహ్లి తన పెదాలను వేలితో మూసి అతడిని సాగనంపడం విశేషం! 2002లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, నాటి కెప్టెన్ గంగూలీ మధ్య వివాదాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. నాడు ముంబైలో వన్డే గెలిచాక ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి సంబరాలు చేసుకోగా, ఐదు నెలల తర్వాత లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ అదే చేసి చూపించాడు. -
రెండో బంతికే జడేజా వికెట్ తీశాడు
మొహాలీ: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ఆరంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 78/4తో మంగళవారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. రూట్ (36), బ్యాటీ (0) బ్యాటింగ్‌కు దిగారు. మ్యాచ్ మొదలైన తర్వాత రెండో ఓవర్లోనే భారత ఆల్ రౌండర్ జడేజా.. బ్యాటీని అవుట్ చేశాడు. జడేజా వేసిన రెండో బంతికి బ్యాటీ వికెట్ల ముందు దొరికిపోయాడు. బట్లర్ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 283, భారత్ 417 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజే టీమిండియా ఛేజింగ్‌కు దిగే అవకాశముంది. -
మొహాలీ టెస్టులో విజయంపై భారత్ గురి
-
మన చేతుల్లోకి...
మొహాలీ టెస్టులో విజయంపై భారత్ గురి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 78/4 బ్యాటింగ్‌లో సత్తా చాటిన జడేజా, జయంత్ భారత టెస్టు చరిత్రలో తొలిసారి ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వచ్చిన బ్యాట్స్మెన్లు ఒకే ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలు చేసిన వేళ... చివరి నలుగురు ఆటగాళ్లు కలిపి ఏకంగా 213 పరుగులు జోడించిన చోట... మన స్పిన్నర్లు వేసిన ఒక్కో బంతి ప్రత్యర్థికి ఒక్కో గండంలా కనిపిస్తున్న క్షణాన... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మరో టెస్టు విజయానికి కోహ్లి సేన రంగం సిద్ధం చేసుకుంది. 134 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్సలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కనీసం దానికి చేరువ కూడా కాకుండానే నాలుగు వికెట్లు కోల్పోరుు ఓటమిని ఆహ్వానిస్తోంది. మ్యాచ్ గెలిచేందుకు టాస్ గెలవడం మాత్రమే సరిపోదని ఇంగ్లండ్‌కు మొహాలీలో తెలిసొచ్చింది. భారత లోయర్ ఆర్డర్ అద్భుత బ్యాటింగ్‌ను అడ్డుకోలేక భారీ ఆధిక్యం సమర్పించుకున్న ఆ జట్టు, ఆ తర్వాత మన బౌలింగ్ ముందు నిలబడలేక మూడో రోజే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకునే స్థితిలో నిలిచింది. ఒకవేళ ప్రత్యర్థి కొంత పోరాడి చిన్నపాటి లక్ష్యం విధించినా... భారత్ అలవోకగా గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, జయంత్ బ్యాటింగ్, అశ్విన్ బౌలింగ్ ఆటలో హైలైట్‌గా నిలిచారుు. మొహాలీ: టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్ హోదాకు తగిన రీతిలో భారత జట్టు సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ప్రతీ ఇన్నింగ్స్ కూ మెరుగు పడుతూ వచ్చిన మన ఆట మరింత పదునెక్కింది. జట్టులోని ముగ్గురు ఆల్‌రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేయడంతో మూడో టెస్టులో జట్టు విజయావకాశాలను మెరుగుపర్చుకుంది. మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలింది. జో రూట్ (36 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 56 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ఇంగ్లండ్ దానిని అధిగమించి అదనంగా ఎన్ని పరుగులు జోడించగలదో చూడాలి. అంతకుముందు 271/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 417 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (170 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించగా... స్పిన్నర్ జయంత్ యాదవ్ (141 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. సెషన్-1: జడేజా జోరు వోక్స్ వేసిన తొలి బంతికే అశ్విన్ (113 బంతుల్లో 72; 11 ఫోర్లు) కొట్టిన బౌండరీతో మూడో రోజు ఆట మొదలైంది. మొదటి అర్ధ గంటలో కొన్ని బంతులు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి కాస్త ఉత్కంఠకు గురి చేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అశ్విన్, జడేజా జాగ్రత్తగా ఆడి నిలదొక్కుకోవడంతో వీరి భాగస్వామ్యం 97 పరుగులకు చేరింది. చివరకు స్టోక్స్ తాను వేసిన తొలి ఓవర్లో అశ్విన్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. తన సహజశైలికి భిన్నంగా క్రీజ్‌లో నిలదొక్కుకుపోరుు కెరీర్లో తొలిసారి ఒకే ఇన్నింగ్సలో వంద బంతులు ఎదుర్కొన్న జడేజా, ఈ క్రమంలో 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 30, పరుగులు: 83, వికెట్లు: 1 సెషన్-2: రాణించిన జయంత్ లంచ్ తర్వాత కూడా జడేజా దూకుడు కొనసాగగా, మరోవైపు నుంచి జయంత్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్ తరహాలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వోక్స్ వేసిన ఒక ఓవర్లో జడేజా ఏకంగా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. అరుుతే కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చినా, దానిని అతను చేజార్చుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. జడేజా, జయంత్ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం జయంత్ మరింత బాధ్యతాయుతంగా ఆడి 132 బంతుల్లో తన తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. స్టోక్స్ వేసిన ఒక ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు సునాయాస క్యాచ్‌లు వదిలేసినా, అదే ఓవర్ చివరి బంతికి జయంత్ వెనుదిరిగాడు. స్టోక్స్ తన తర్వాతి ఓవర్లో ఉమేశ్‌ను కూడా అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స ముగిసింది. ఓవర్లు: 24.2, పరుగులు: 63, వికెట్లు: 3 సెషన్-3: అశ్విన్ మాయ తొలి ఇన్నింగ్సలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ పరిస్థితి రెండో ఇన్నింగ్సలోనూ మారలేదు. ఈసారి అశ్విన్ దెబ్బ వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. గాయంతో హమీద్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో కుక్, రూట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. నాలుగు బంతుల వ్యవధిలో కుక్ రెండుసార్లు (ఎల్బీడబ్ల్యూ) డీఆర్ఎస్ మద్దతుతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ తీర్పుపై కుక్ అప్పీల్‌కు వెళ్లాడు. అరుుతే ఆ తర్వాత చక్కటి బంతితో కుక్ (12)ను బౌల్డ్ చేసిన అశ్విన్, కొద్ది సేపటికే అలీ (5)ని కూడా పెవిలియన్ పంపించాడు. పార్థివ్ అద్భుత క్యాచ్‌కు బెరుుర్‌స్టో (15) వెనుదిరగ్గా... చివరి ఓవర్లో స్టోక్స్ (5)ను కూడా అవుట్ చేసి భారత్ మూడో రోజును విజయవంతంగా ముగించింది. ఓవర్లు: 38, పరుగులు: 78, వికెట్లు: 4 నన్ను నేను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఊహించుకుంటూ పరుగులు చేయాల్సిన అవసరం లేదు. నేను అసలైన బ్యాట్స్‌మన్‌నే. ఇందులో కొత్తగా చెప్పేదేముంది. ఈసారి నెట్స్‌లో కాస్త ఎక్కువగా సాధన చేశాను. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దాదాపు యాభై సగటుతో పరుగులు చేస్తూ వచ్చాను. నేను 90 పరుగులు చేయడం తొలిసారి కావచ్చేమో కానీ నేను బ్యాటింగ్ బాగా చేయగలనని నాకు తెలుసు. అందుకే తొందరపడకుండా జాగ్రత్తగా ఆడాను. భారత్ తరఫున ఆడిన ప్రతీ కీలక ఇన్నింగ్స గుర్తుంచుకోదగిందే. లార్డ్స్‌లో కూడా జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి అర్ధ సెంచరీ చేశాను. సెంచరీ కోల్పోవడం నిరాశ కలిగించలేదు. అదే షాట్‌తో నేను ఎప్పుడైనా సిక్సర్ కొట్టగలను కాబట్టి ఆ షాట్ ఆడటాన్ని తప్పు పట్టను. -రవీంద్ర జడేజా జడేజా ‘బ్యాట్’సాము... మూడో రోజు చక్కటి ఇన్నింగ్స ఆడిన రాజపుత్రుడు రవీంద్ర జడేజా మరోసారి తనదైన శైలిలో కత్తిసామును ప్రదర్శించాడు. అర్ధ సెంచరీ చేయగానే బ్యాట్‌ను కత్తి తరహాలో తిప్పుతూ అభివాదం చేశాడు. తొలి సారి రెండేళ్ల క్రితం లార్డ్స్ లో ఇలా చేసిన అతను ఇటీవల కాన్పూర్ టెస్టులోనూ దానిని చూపించాడు. ‘అది రాజ పుత్రుల ట్రేడ్‌మార్క్ స్టరుుల్. గ్రౌండ్లోకి నేను కత్తిని తీసుకురాలేను కాబట్టి అలా చేస్తాను’ అని వ్యాఖ్యానించిన ‘సర్’ జడేజా కాలి షూస్‌పై కూడా రాజ్‌పుత్ అని ముద్రించి ఉండటం విశేషం. -
జడేజా ఫోర్‌తో.. టీమిండియా ఆధిక్యం
మొహాలీ: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు సోమవారం.. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. నిన్న కీలక సమయంలో జట్టును ఆదుకున్న అశ్విన్, జడేజా ఈ రోజు కూడా నిలకడగా ఆడుతున్నారు. మొయిన్ అలీ బౌలింగ్‌లో జడేజా ఫోర్ బాదడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం భారత స్కోరు 291/6. అశ్విన్ (64), జడేజా (44) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
కరణ్ నాయర్ ‘టెస్ట్’అరంగేట్రం
మొహాలీ: టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్ కల నిజమైంది. ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో భాగంగా మొహాలీలో ప్రారంభమైన మూడో టెస్టులో కరణ్ నాయర్ తుది 11 మందిలో ఒకడిగా ఎంపికయ్యాడు. మరో యువ బ్యాట్స్‌మన్ కేఎల్.రాహుల్ అనూహ్యంగా గాయపడటంతో నాయర్‌కు జట్టులో బెర్త్ దక్కింది. శనివారం ఉదయం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. టాస్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లోకి దిగడానికి కొద్ది నిమిషాల ముందు కోచ్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తదితరులు కరణ్ నాయర్‌కు జాతీయ జట్టు టోపీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేయగల నాయర్.. నిజానికి గత జింబాబ్వే సిరీస్‌లోనే జట్టులో చోటు దక్కినప్పటికీ స్టాండ్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. మొదటిసారి 11 మంది జాబితాలో చోటు దక్కడంపై సంతోషంగా ఉందని, టీమిండియా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని నాయర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టు డ్రాగా ముగియగా, విశాఖ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇక మూడో టెస్టుకు వేదికైన పీసీఏ(మొహాలీ) మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. దీంతో మూడో టెస్టులోనైనా పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. నాయర్‌కు జాతీయ జట్టు టోపీ అందిస్తోన్న గవాస్కర్, కుంబ్లే..