భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ఆరంభమైంది.
మొహాలీ: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ఆరంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 78/4తో మంగళవారం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. రూట్ (36), బ్యాటీ (0) బ్యాటింగ్‌కు దిగారు. మ్యాచ్ మొదలైన తర్వాత రెండో ఓవర్లోనే భారత ఆల్ రౌండర్ జడేజా.. బ్యాటీని అవుట్ చేశాడు. జడేజా వేసిన రెండో బంతికి బ్యాటీ వికెట్ల ముందు దొరికిపోయాడు. బట్లర్ బ్యాటింగ్‌కు దిగాడు.
తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 283, భారత్ 417 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజే టీమిండియా ఛేజింగ్‌కు దిగే అవకాశముంది.