జడేజా ఫోర్‌తో.. టీమిండియా ఆధిక్యం | India takes lead over England in Mohali test | Sakshi
Sakshi News home page

జడేజా ఫోర్‌తో.. టీమిండియా ఆధిక్యం

Published Mon, Nov 28 2016 10:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

జడేజా ఫోర్‌తో.. టీమిండియా ఆధిక్యం

జడేజా ఫోర్‌తో.. టీమిండియా ఆధిక్యం

మొహాలీ: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు సోమవారం.. 271/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. నిన్న కీలక సమయంలో జట్టును ఆదుకున్న అశ్విన్‌, జడేజా ఈ రోజు కూడా నిలకడగా ఆడుతున్నారు.

మొయిన్‌ అలీ బౌలింగ్‌లో జడేజా ఫోర్‌ బాదడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం భారత స్కోరు 291/6. అశ్విన్‌ (64), జడేజా (44) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement