IND vs SL 1st Test: Rohit Sharma Become 2nd Indian Captain Win His Maiden Test by an Innings - Sakshi
Sakshi News home page

Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు!

Published Sun, Mar 6 2022 6:15 PM | Last Updated on Sun, Mar 6 2022 6:32 PM

Ind Vs Sl: Rohit Sharma Become 2nd Indian Captain Win His Maiden Test By An innings - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇప్పటికే హిట్‌మ్యాన్‌ సారథ్యంలో స్వదేశంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా సంప్రదాయ క్రికెట్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించాడు రోహిత్‌ శర్మ. పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్‌ తేడాతో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన రెండో భారత సారథిగా నిలిచాడు. అంతకు ముందు పాలీ ఉమ్రిగర్‌ ఈ ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలో 1955/56లో న్యూజిలాండ్‌ మీద భారత్‌ ఇన్నింగ్స్‌ మీద 27 పరుగుల తేడాతో గెలుపొందింది.

కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(175 పరుగులు నాటౌట్‌, 9 వికెట్లు)గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 29 పరుగులు చేశాడు. 

ఇండియా వర్సెస్‌ శ్రీలంక తొలి టెస్టు స్కోర్లు:
ఇండియా తొలి ఇన్నింగ్స్‌ -  574/8 డిక్లేర్డ్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌- 174 పరుగులు ఆలౌట్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌-  178 పరుగులు ఆలౌట్‌
ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో భారత్‌ విజయం

చదవండి: Jasprit Bumrah: వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్‌ సూపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement