Team India Gives Guard Of Honour To Virat Kohli On His 100th Test: కెరీర్‌లో వందో టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత క్రికెట్ జట్టు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించింది. మొహాలీ టెస్ట్ రెండో రోజు టీమిండియా ఫీల్డింగ్‌కు దిగే ముందు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సూచన మేరకు జట్టు సభ్యులంతా రెండు వరుసలుగా నిలబడి కోహ్లిని గ్రౌండ్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విరాట్ తనదైన స్టైల్‌లో ఓ చేతిని పైకెత్తి అభివాదం చేస్తూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే.
The smile on @imVkohli's face says it all.#TeamIndia give him a Guard of Honour on his landmark Test.#VK100 @Paytm #INDvSL pic.twitter.com/Nwn8ReLNUV
— BCCI (@BCCI) March 5, 2022
ఇదిలా ఉంటే, కెరీర్‌లో మైలురాయి టెస్ట్ ఆడుతున్న కోహ్లి, తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులే (76 బంతుల్లో 5 ఫోర్లు) చేసినప్పటికీ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయితో పాటు, సుదీర్ఘ ఫార్మాట్‌లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (154 ఇన్నింగ్స్), రాహుల్ ద్రవిడ్ (158 ఇన్నింగ్స్), సునీల్ గవాస్కర్ (166 ఇన్నింగ్స్), వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ (160 ఇన్నింగ్స్)లు మాత్రమే 8000 పరుగుల మార్కును దాటగా, కోహ్లి (169 ఇన్నింగ్స్) ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో తాను కొట్టిన ఐదు ఫోర్లతో టెస్ట్ కెరీర్‌లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఈ ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక ఫోర్లు బాదిన ఆరో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సచిన్ కెరీర్ మొత్తంలో 2058 ఫోర్లు బాదగా, ద్రవిడ్ 1651, సెహ్వాగ్ 1219, లక్ష్మణ్ 1135, గవాస్కర్ 1016, గంగూలీ 900 ఫోర్లు కొట్టారు. ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా (175) అజేయమైన భారీ శతకంతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 26 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment