Guard of Honour
-
స్టువర్ట్ బ్రాడ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..
యాషెస్ సిరీస్ 2023 చివరి టెస్ట్ సందర్భంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు తన కెరీర్లో చివరిసారి బ్యాటింగ్‌కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్‌తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రాడ్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆసీస్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్‌ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్‌ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్, బ్రాడ్ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు. Who's cutting onions? 🥺🥺pic.twitter.com/6wEoLEpp9Q — CricTracker (@Cricketracker) July 30, 2023 బ్రాడ్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్ బౌలర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్ తరఫున సుదీర్ఘ టెస్ట్ కెరీర్ కలిగిన బ్రాడ్‌కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన బ్రాడ్.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ (8) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. -
IND VS SL 1st Test: కోహ్లిని గౌరవించుకున్న టీమిండియా
Team India Gives Guard Of Honour To Virat Kohli On His 100th Test: కెరీర్లో వందో టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత క్రికెట్ జట్టు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించింది. మొహాలీ టెస్ట్ రెండో రోజు టీమిండియా ఫీల్డింగ్‌కు దిగే ముందు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సూచన మేరకు జట్టు సభ్యులంతా రెండు వరుసలుగా నిలబడి కోహ్లిని గ్రౌండ్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విరాట్ తనదైన స్టైల్లో ఓ చేతిని పైకెత్తి అభివాదం చేస్తూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. The smile on @imVkohli's face says it all.#TeamIndia give him a Guard of Honour on his landmark Test.#VK100 @Paytm #INDvSL pic.twitter.com/Nwn8ReLNUV— BCCI (@BCCI) March 5, 2022 ఇదిలా ఉంటే, కెరీర్లో మైలురాయి టెస్ట్ ఆడుతున్న కోహ్లి, తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులే (76 బంతుల్లో 5 ఫోర్లు) చేసినప్పటికీ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయితో పాటు, సుదీర్ఘ ఫార్మాట్లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (154 ఇన్నింగ్స్), రాహుల్ ద్రవిడ్ (158 ఇన్నింగ్స్), సునీల్ గవాస్కర్ (166 ఇన్నింగ్స్), వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ (160 ఇన్నింగ్స్)లు మాత్రమే 8000 పరుగుల మార్కును దాటగా, కోహ్లి (169 ఇన్నింగ్స్) ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్‌లో తాను కొట్టిన ఐదు ఫోర్లతో టెస్ట్ కెరీర్లో 900 ఫోర్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక ఫోర్లు బాదిన ఆరో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సచిన్ కెరీర్ మొత్తంలో 2058 ఫోర్లు బాదగా, ద్రవిడ్ 1651, సెహ్వాగ్ 1219, లక్ష్మణ్ 1135, గవాస్కర్ 1016, గంగూలీ 900 ఫోర్లు కొట్టారు. ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా (175) అజేయమైన భారీ శతకంతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 26 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా! -
రాస్ టేలర్ ఉద్వేగ క్షణాలు.. వీడియో వైరల్
రెండో టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్.. తన కేరిర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7600కి పైగా పరుగులు చేశాడు. రెండో రోజు టేలర్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లో 28 పరుగులు చేసి అతడు పెవిలియన్ చేరాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ టేలర్ అరంగట్రేం చేశాడు. దాదాపు 16 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు అతడి సేవలను అందించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! A great gesture for a great of the game 🙌 Ross Taylor is given a guard of honour as he makes his way out to bat for possibly the final time in Test cricket for New Zealand 🥺#NZvBAN pic.twitter.com/ejJjTo5w4v — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా
-
అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా
సిడ్నీ : ప్రపంచంలో ఏ పిల్లాడైనా సరే తన తండ్రి గొప్పదనం తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా మురిసిపోతారో చెప్పనవసరం లేదు. అందులోనూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి విలువను అందరూ గుర్తించినప్పుడు ఆ పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కార్చిచ్చు ధాటికి అమరుడైన తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతని సాహసానికి గుర్తుగా తన 19 నెలల కూతురుకు వోడయ్యర్ వాడిన హెల్మట్‌తో పాటు మెడల్‌ను బహూకరించారు. వీటిని ఆ పాప ధరించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులు భావోద్వేగానికి గురవడం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చూసిన ప్రతీ వీక్షకుడి గుండె బరువెక్కుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసుత్తం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న ఫైర్ ఫైటర్స్ కార్చిచ్చు నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఇంజన్లో వెళ్లారు. అయితే ఒక్కసారి కార్చిచ్చు మంటలు మరింతగా వ్యాపించి వారు వెళుతున్న వాహనంపై పడడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. అందులో 36 ఏళ్ల వోడయ్యర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ నుంచి ఫైర్‌ఫైటర్‌గా తన సేవలందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీలో వోడయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా 12 మంది ఫైర్ ఫైటర్స్ వరుసగా నిలబడి వోడయ్యర్ మృతదేహానికి హార్డ్ ఆఫ్ గానర్తో గౌరవించారు. అనంతరం వోడయ్యర్ 19 నెలల కూతురైన చార్లెట్‌ను హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని అందించారు. ' చార్లెట్.. ఈరోజు నీ తండ్రి ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి, దేశకోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిజమైన హీరో అయ్యారు. అతని సేవను మేము ఎప్పటికి గుర్తుంచుకుంటాం' అంటూ అధికారి ఫిట్జ్‌సిమ్మన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. 19 నెలల చార్లెట్ తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని ధరించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ దంపతులు వోడయ్యర్ కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకొని వారిని ఓదార్చారు. రెండు నెలలుగా ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుకు ఇప్పటివరకు 26 మంది ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలు కోల్పోగా, వేలాది జంతువులు బలయ్యాయి. -
బీసీని కాబట్టే పట్టించుకోలేదు: బీజేపీ మంత్రి
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ నాయకులను దళితుల ఇళ్లను సందర్శించమని ఆదేశించగా, మరోవైపు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులకు కనీస గౌరవం దక్కడం లేదు. ఈ విషయాన్ని యోగి కేబినెట్లోని మంత్రే స్వయంగా వెల్లడించారు. మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ బహ్రైచ్ పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణం తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే అని ఆయన వాపోయారు. రెండు రోజుల క్రిత్రం బహ్రైచ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయిన ఓంప్రకాశ్ అనంతరం పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలు ఎవరైనా సర్క్యూట్ హౌజ్‌కు సందర్శించినప్పుడు అధికారులు వారిని ప్రొటోకాల్ ప్రకారం గౌరవంగా ఆహ్వానించాలి. అయితే ఓంప్రకాశ్ సర్క్యూట్ హౌజ్ వద్దకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. దీని గురించి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘మన సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా వెనకబడిన వర్గాల వారిని అవమానిస్తూనే ఉన్నారు. నేను వెనుకబడిన వర్గానికి చెందిన వాడిని కావడం వల్లే అధికారులు నన్ను పట్టించుకోలేదు. అదే ఏ ఉన్నత వర్గానికి చెందిన మంత్రో వస్తే వారు పరుగున వెళ్లి అతనికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికేవార’ని విమర్శించారు. -
వాట్సాప్‌లో రూమర్... రాజ్‌నాథ్‌కు అవమానం
సాక్షి, జైపూర్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఇది చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం 24 వేలుగా ఉన్న వారి జీతాలు 19 వేలకు పడిపోతుందని అందులో పేర్కొని ఉంది. దీంతో కానిస్టేబుళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం జోధ్ పూర్లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించగా.. నిరసనలో భాగంగా సుమారు 250 మంది కానిస్టేబుళ్లు సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో రాజ్‌నాథ్ గౌరవ వందనం స్వీకరించలేకపోయారు. అధికారులేం చెబుతున్నారు... కాగా, రాజ్‌నాథ్‌కు సైనిక వందనం దక్కకపోవటంపై అధికారులు స్పందించారు. ఆ 250 మందిలో గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నియమించిన కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఎలాంటి లీవులు మంజూరు చేయలేదు. పైగా ఖచ్ఛితంగా విధులకు హాజరుకావాల్సిందేనని ముందస్తుగా చెప్పాం కూడా. అయినా కావాలనే వారు రాలేదు అని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తెలిపారు. మరోవైపు కానిస్టేబుళ్లు మాత్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని.. తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఇలా చేశామంటున్నారు. ఏదిఏమైనా విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నామని రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ తేల్చి చెప్పారు. -
'అలా చేస్తే చూడాలనుకుంటున్నా'
లండన్: చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మైఖేల్ క్లార్క్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపిన ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. కొలంబో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కరకు భారత ఆటగాళ్లు ఇలాగే గౌరవించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. ఓవల్ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న క్లార్క్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు గురువారం ఊహించని విధంగా స్వాగతం పలికారు. అతను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో అభినందలు తెలిపారు. ఈ గౌరవానికి క్లార్క్ అన్నివిధాలా అర్హుడని వార్నర్ అన్నాడు. క్లార్క్ గొప్ప కెప్టెన్, నాయకుడు, జట్టు సభ్యుడని ప్రశంసించాడు. గత కొన్నేళ్లుగా క్లార్క్ క్రీడాజీవితంలో కెరీర్ లో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. సంగక్కరకు టీమిండియా ప్లేయర్స్ 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపితే చూడాలనుకుంటున్నామని వార్నర్ చెప్పాడు. -
అధికార లాంఛనాలతో ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు
పుణే: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పుణేలోని వైకుంఠ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన కుమారుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో అభిమానులు ఆర్కే లక్ష్మణ్ కు అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణవీస్, విద్యాశాఖ మంత్రి వినోద్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరే తదితర ప్రముఖులు ఆర్కే లక్ష్మణ్ భౌతిక కాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా నివాళి అర్పించారు. ఆర్కే లక్ష్మణ్ స్మారక స్థూపం నిర్మిస్తామని ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. -
ఒబామాకు ఘన స్వాగతం
న్యూఢిల్లీ: భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అపూర్వంగా కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా... రాష్ట్రపతి భవన్లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’ గౌరవంతో.. రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. ‘సైనిక వందనం (గార్డ్ ఆఫ్ హానర్)’తోనూ గౌరవించారు. ఇంతకు ముందు 2010లో ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ దంపతులు కూడా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. అయితే ఈ సారి దేశ గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో మరింత ప్రాధాన్యత దక్కుతోంది. తొలుత విమానాశ్రయంలో ఒబామాకు ప్రధాని మోదీ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా, మోదీ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒబామా దంపతులను మోదీ స్వయంగా తోడ్కొని విమానాశ్రయంలోకి వెళ్లారు. అక్కడి నుంచి తాము బస చేసే హోటల్‌కు వెళ్లిన ఒబామా దంపతులు అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఒబామా రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణను అత్యంత సుందరంగా అలంకరించారు. అక్కడి వేదికను కూడా అలంకరించి సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్ గేటు వద్ద నుంచే ఒబామాకు ఘన స్వాగతం లభించింది. ఎరుపురంగు డ్రెస్, నీలిరంగు తలపాగాలు చుట్టుకున్న రాష్ట్రపతి బాడీగార్డుల అశ్విక దళం ఒబామా వాహనం ‘ది బీస్ట్’కు ముందు వెనుక నిలిచి లోపలికి తోడ్కొని వెళ్లింది. భవనం ప్రాంగణంలోకి వారు చేరుకోగానే... అప్పటికే అక్కడకి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఒబామా దంపతులకు చిరునవ్వుతో స్వాగతం పలికారు. పలకరింపులు, కుశల ప్రశ్నల అనంతరం.. ఒబామాను రాష్ట్రపతి గార్డులు వేదికపైకి తోడ్కొని వెళ్లారు. భారత, అమెరికా జాతీయ గీతాల నేపథ్య సంగీతం వినిపిస్తుండగా.. మిలటరీ బ్యాండ్ వాయించారు. అనంతరం వింగ్ కమాండర్ పూజా ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రివిధ దళాల సైనిక వందనాన్ని ఒబామా స్వీకరించారు. తర్వాత ఒబామాకు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు, పీయూష్‌గోయల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఒబామా దంపతులు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. చాలా సంతోషం..! తమకు లభించిన ఘన స్వాగతం, ఆతిథ్యం ఎంతో అపూర్వమని అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతోషం వ్యక్తం చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఉన్న చోటికి వచ్చిన ఆయన భారతీయ సాంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. భారత్‌కు మరోసారి వచ్చిన తమకు ఇంత గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మిషెల్ డ్రెస్ జిగేల్! న్యూఢిల్లీ: నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో ఒబామా సతీమణి మిషెల్ మెరిసిపోయారు! మోకాల్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నట్టూ.. మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు రూ.1.5 లక్షలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకెళ్లారు. మిషెల్ ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కశ్మీరీ శాలువ బహూకరించారు. భర్త ఒబామాతో కలిసి ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ఆమెకు ప్రత్యేక ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ కూడా.. రాజస్థాన్ కళాకారుడు సుకుమార్ బోస్ రూపొందించిన ‘టీ సెట్’ను మిషెల్‌కు బహూకరించారు. ఒబామా రావడం శుభపరిణామం: తొగాడియా జైపూర్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు రావడం శుభ పరిణామమని విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఒబామా పర్యటనను అడ్డుకుండామన్న వార్తలను ఆదివారం ఆయన తోసి పుచ్చారు. ‘భారత్ ఎల్లప్పుడూ వ్యాపారవేత్తలకు స్వాగతం పలుకుతుంది. భవిష్యత్తులో ఇండియా కూడా అమెరికా సరసన నిలుస్తుంది.’ అని అన్నారు. మోదీ.. అదరహో! ఒబామాకు ఉదయం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ గోధుమ రంగు కుర్తా పైజామా ధరించి, దానిపై నెహ్రూ జాకెట్ వేసుకుని వచ్చారు. భుజంపై ఎరుపు రంగు శాలువా ధరించారు. రాష్ట్రపతిభవన్‌లో కార్యక్రమానికి వచ్చినప్పుడు నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించి వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ కూడా నలుపు రంగు బంద్‌గల్లా సూట్ ధరించారు. పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’ త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది.. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు.