రెండో టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించాడు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్.. తన కేరిర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్ 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7600కి పైగా పరుగులు చేశాడు. రెండో రోజు టేలర్ బ్యాటింగ్ వచ్చిన సమయంలో బంగ్లా ఆటగాళ్లు వరుస క్రమంలో నిలబడి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకలు కూడా ఒక్క సారిగా చప్పట్లు కొడుతూ అభినందించారు.
కాగా తొలి ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లో 28 పరుగులు చేసి అతడు పెవిలియన్ చేరాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ టేలర్ అరంగట్రేం చేశాడు. దాదాపు 16 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు అతడి సేవలను అందించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 521 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్‌లు గా నిలిచారు.
చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్!
A great gesture for a great of the game 🙌
— Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022
Ross Taylor is given a guard of honour as he makes his way out to bat for possibly the final time in Test cricket for New Zealand 🥺#NZvBAN pic.twitter.com/ejJjTo5w4v
Comments
Please login to add a commentAdd a comment