వెల్లింగ్టన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ డబుల్ సెంచరీ సాధించాడు. 211 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్న టేలర్‌కు ఇది టెస్టు కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ. అయితే డబుల్ సెంచరీ మార్కును చేరిన తర్వాత బంతికే టేలర్ పెవిలియన్ చేరాడు. అతనికి జతగా హెన్రీ నికోలస్(107), కేన్ విలియమ్సన్(74) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది.
38/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌కు విలియమ్సన్-టేలర్ జోడి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై నికోలస్-టేలర్‌ల జోడి నాల్గో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ 141 పరుగుల వెనుకబడి ఉంది.
ఇక్కడ చదవండి: కివీస్ ఇన్నింగ్స్ విజయం
Comments
Please login to add a commentAdd a comment