Wellington
-
హాస్టల్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం!
ఓ నాలుగు అంతస్తుల హాస్టల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్టల్లో మొత్తం 92 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భయంతో వీరంతా బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు 52 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. (SENSITIVE) At least 6 people have died, and 20 others are injured in Wellington, NZ, after a fire broke out in a hostel. #nz #newzealand #wellington #hostel #fire #fires #hostelfire #loaferslodge #hostels #nzpol #chrishipkins #torywhanau pic.twitter.com/j9TxuhyKcs — Empact News (@EmpactNews) May 16, 2023 కాగా.. అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సంఖ్య 10 దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్లో స్ప్రింక్లర్స్ లేవని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన ఇదే అని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్.. -
ఇదేం బంతిరా బాబు.. బ్యాటర్ అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్
వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయ భేరి మోగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక, తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్ రెండు, డాగ్ బ్రెస్‌వేల్ , హెన్రీ తలా వికెట్ సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 121 ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఓ బంతి.. భారీ గాలుల కారణంగా ఆనూహ్యంగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. అతడు బౌలింగ్ వేసే సమయంలో ఒక్క సారిగా గాలి రావడంతో.. బంతి పిచ్‌కు చాలా దూరంగా పడింది. ఇది చూసిన శ్రీలంక బ్యాటర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని రోజులగా న్యూజిలాండ్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చదవండి: SL vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్ Just when you think you’ve seen it all in cricket. High winds so single end coverage in Wellington. Here’s the supporting evidence… pic.twitter.com/AzQerm4h9b — Rob Williams (@robwilliams_tv) March 20, 2023 -
బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్‌కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
Viral Video: సిక్స్ ప్యాక్ బాడీలతో టీమిండియా క్రికెటర్లు..!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాభవం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా, రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్.. వరల్డ్‌కప్ తాలూకా చేదు అనుభవాలను అధిగమించి, కివీస్‌పై అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలో రేపు (నవంబర్ 18) జరుగబోయే తొలి టీ20కి వేదిక అయిన వెల్లింగ్టన్కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. View this post on Instagram A post shared by Washington Sundar (@washisundar555) ప్రాక్టీస్‌లో పాల్గొన్న యువ భారత ఆటగాళ్లు ఎంతో హుషారుగా, ఆత్మ విశ్వాసంతో కనిపించారు. మధ్యలో దొరికిన కొద్దిపాటి ఖాళీ సమయంలో బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ సేద తీరారు. హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్‌లు సిక్స్ ప్యాక్ బాడీలతో బీచ్ నుంచి బయటికి వస్తున్న వీడియోను వాషింగ్టన్ సుందర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో రాక్షసానందం పొందుతున్నారు. ఇంకొందరేమో.. ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకునే భారత క్రికెటర్లు.. న్యూజిలాండ్‌పై గెలిచేందుకు కూడా అంతే శ్రద్ధతో కృషి చేయాలని సూచిస్తున్నారు. కాగా, రేపు జరుగబోయే తొలి టీ20 భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్యా.. వన్డే టీమ్‌కు శిఖర్ ధవన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. వన్డే సిరీస్‌కు టీమిండియా.. శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) టీ20 సిరీస్ షెడ్యూల్.. ►మొదటి టీ20: నవంబరు 18, శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్టన్ ►రెండో టీ20: నవంబరు 20, ఆదివారం- బే ఓవల్, మౌంట్ మాంగనీ ►మూడో టీ20: నవంబరు 22, మంగళవారం- మెక్లీన్ పార్క్, నేపియర్ ►మ్యాచ్‌ల ఆరంభ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం) వన్డే సిరీస్ షెడ్యూల్.. ►మొదటి వన్డే: నవంబరు 25, శుక్రవారం- ఈడెన్ పార్క్, ఆక్లాండ్ ►రెండో వన్డే: నవంబరు 27, ఆదివారం- సెడాన్ పార్క్, హామిల్టన్ ►మూడో వన్డే: నవంబరు 30, బుధవారం- హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్ ►మ్యాచ్‌ల ఆరంభ సమయం: ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం) చదవండి: కెప్టెన్ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..! చదవండి: కివీస్‌తో తొలి టి20.. ప్రాక్టీస్‌లో మునిగిన టీమిండియా ఆటగాళ్లు (ఫొటోలు) -
World Cup 2022: వారెవ్వా.. కష్టమనుకున్న మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన కెప్టెన్!
Women's World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ చేరిన మెగ్ లానింగ్ బృందం తాజాగా మరో విజయం నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆరూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుపుకొంది. View this post on Instagram A post shared by ICC (@icc) బౌలింగ్ ఎంచుకుని టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లీ(36), వొల్వార్ట్(90) శుభారంభం అందించారు. కెప్టెన్ సునే లాస్ 52 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా జట్టు 271 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) మొదట తడబడినా.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును ముందుకు నడిపింది. లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన లానింగ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఆమెకు వన్డేల్లో ఇది 15వ సెంచరీ కావడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) -
CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి
సాక్షి, చెన్నై: భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. దేశ తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ బుధవారం ఛాపర్ ప్రమాదంలో అసువులు బాశారు. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదం నుంచే రావత్ తృటిలో బయటపడ్డారు. కానీ ఈసారి దురదృష్టం వెన్నాడింది. దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. సూలూరు ఎయిర్ బేస్నుండి వెల్లింగ్టన్ వెళ్తూ ఛాపర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం) మరణించినవారిలో ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో బాధితులను రక్షించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలిలో దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. దుర్ఘటనపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. రావత్ మరణవార్త వినగానే సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశమైంది. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి పార్థివ దేహాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకువెళ్తారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేరి 2019లో దేశ భద్రతాదళాల ఉమ్మడి అధిపతిగా ఎదిగే క్రమంలో ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారైన ఈ ఫోర్స్టార్ జనరల్ సేవలను, తెచ్చినన రక్షణ సంస్కరణలను త్రివిధ దళాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి. శుక్రవారం రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్లో ప్రమాదంపై ప్రకటన చేశారు. 1.ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి రావత్ బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరారు. 2.11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. 3.మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కూనూర్ వద్ద ప్రమాదం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ -
రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
తొలిసారి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ పదవిని అధిరోహించిన తరువాత తొలిసారి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. వ్యాపార అవసరాల కోసం కాదు సుమా! వైట్ హౌస్‌లోని ఇంటికి కావాల్సిన జాబితా తయారు చేయడంలో తన భార్యకు సహకరించేందుకు డెలావర్‌లోని తన ఇంటికి బైడెన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో వెళ్ళారు. అధ్యక్షుడిగా తానీ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించడం తనకొచ్చిన గొప్ప అవకాశమని బైడెన్ వ్యాఖ్యానించారు. సహచరికి తోడ్పడేందుకే ‘‘నా మనవలు, మనవరాళ్ళను చూసేందుకు, అలాగే కొత్త ఇంటికి కావాల్సినవి కొనుగోలు చేయడంలో నా భార్య జిల్కి తోడ్పడేందుకు విల్మింగ్టన్కి దగ్గర్లోని నా ఇంటికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్ళాను’’అని బైడెన్ అన్నారు. మరోవైపు బైడెన్ కొడుకు హంటర్‌కి గురువారానికి 51 ఏళ్ళు నిండాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ప్రత్యేక ఏంటి? అమెరికా అధ్యక్షులంతా వాడేది ఎయిర్‌ఫోర్స్ వన్నే. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ‘‘అమెరికాకి చెందిన ఏ అధ్యక్షుడైనా, డెమొక్రాట్ కానీ, రిపబ్లికన్ కానీ ప్రయాణించేటప్పుడు ఎయిర్‌ఫోర్స్ వన్ నే ఉపయోగిస్తారు’’అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు. ఇంకాస్త బాగుంది కూడా.. డెలావర్‌లో లాండ్ అయిన వెంటనే బైడెన్ రిపోర్టర్లతో మాట్లాడుతూ చాలావరకు ఈ విమానం, తాను 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్ మాదిరిగానే ఉన్నదని చెప్పారు. కాకపోతే ఇది ఇంకాస్త బాగా ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేర్వేరుగా ప్రయాణం నిజానికి అమెరికాలో అధ్యక్షుడి భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సైతం ఒకే విమానంలో ప్రయాణించరు. వేర్వేరుగా ప్రయాణిస్తారు. అందుకు కారణం భద్రత దృష్ట్య ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు వారాల క్రితమే.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్‌లైన్స్ ప్రకారం ప్రయాణాలు కోవిడ్–19 వ్యాప్తిని ఉధృతం చేస్తాయని, ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెప్పిం ది. అయితే ఎవరైనా ప్రయాణాలు చేయదల్చుకుంటే మీ వంతు వచ్చాక, కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న తరువాతే ప్రయాణించాలని సీడీసీ స్పష్టం చేసింది. సెకండ్ డోస్ తీసుకున్న తరువాత కూడా ప్రయాణించడానికి రెండు వారాలు వేచి ఉండాలని సీడీసీ సూచించింది. అయితే బైడెన్ మూడు వారాల క్రితమే తన సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బైడెన్‌కి 78 ఏళ్ళ వయస్సు కావడం వల్ల ఆయన హైరిస్క్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం వల్ల ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రజలు మాత్రం బయటకు రాకుండా ఉండాలని వైట్ హౌస్ ప్రజలను అభ్యర్థించింది. తొలిసారి దశాబ్దకాలం పాటు సెనేట్‌లోనూ, 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్గానూ పనిచేసిన జోబైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. 2000 సంవత్సరంలో తొలిసారి బిల్‌క్లింటన్‌తో పాటు బైడెన్ దక్షిణాఫ్రికాకి ఈ విమానంలో ప్రయాణించారు. అప్పుడు మాదకద్రవ్యాల సరఫరాని అడ్డుకునే విషయంలో, కొలంబియాకి సహాయపడేందుకు 1.3 బిలియన్ డాలర్ల నిధులను బిల్‌క్లింటన్ ఆ సందర్భంగా ప్రకటించారు. -
బిగ్ హిట్టర్ ఎడ్వర్డ్స్ కన్నుమూత
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్లో బిగ్ హిట్టర్‌గా ఖ్యాతిగాంచిన మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాక్ ఎడ్వర్డ్స్(64) కన్నుమూశారు.ఎడ్వర్డ్స్ మరణించిన విషయాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కివీస్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానుల్ని అలరించిన ఎడ్వర్డ్స్ ఇక లేరని విషయం తమకు తీరని లోటని పేర్కొంది. 1974-85 మధ్య కాలంలో క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఎడ్వర్డ్స్.. ఆరు టెస్టు మ్యాచ్‌లు, ఎనిమిది అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. ఇక 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఎడ్వర్డ్స్ ఆడారు. 1978లో ఆక్లాండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం అతని కెరీర్లో అత్యుత్తమంగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌ను కేవలం నాలుగేళ్లు మాత్రమే ఆస్వాదించిన ఎడ్వర్డ్స్ తన ఆటతో పించ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్‌కు అచ్చం సరిపోయే ఎడ్వర్డ్స్.. 2011లో స్థానిక న్యూస్ పేపర్ నెల్సన్ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన బ్యాటింగ్ స్టైల్ టీ20 క్రికెట్‌కు సరిపోతుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. తన దూకుడైన ఆటను అడ్డుకట్ట వేసేందుకు కోచ్‌లు ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే వారని ఈ మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు. తనకు హిట్టింగ్ అంటే ఇష్టమనే విషయాన్ని కూడా ఆ ఇంటర్యూలో తెలిపాడు. తన చివరి టెస్టు మ్యాచ్‌ను, వన్డే మ్యాచ్‌ను భారత్‌పైనే ఆడటం గమనార్హం. -
వంద పరుగులకే సగం జట్టు పెవిలియన్‌లో
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్మెన్లు తడబడుతున్నారు. ప్రసుత్తం టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అజింక్యా రహానే 36 పరుగులు, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజలో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఏంచుకోగా.. పిచ్‌పై ఉన్న తేమను కివీస్ బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లు కివీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా 16 పరుగుల వద్ద పృథ్వీ షాను టిమ్ సౌథీ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు వచ్చిన చటేశ్వర్ పుజార (11) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. (ఇక్కడ 320 మంచి స్కోరు: రహానే) ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి జేమిసన్ బౌలింగ్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 40 పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. దీంతో 79 పరుగుల వద్ద టీమిండియా లంచ్‌కు వెళ్లింది. లంచ్ విరామం అనంతరం జట్టు స్కారు 88 పరుగుల వద్ద ఉన్నప్పుడు మయాంక్ బౌల్ట్ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానే, అగర్వాల్ మధ్య 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజలోకి హనుమ విహారి 7 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కాగా కివీస్ బౌలర్లలో జేమిసన్ 3, బౌల్ట్ , సౌథీ చెరో వికెట్ తీశారు. -
‘వైట్ వాష్’ చేయాల్సిందే..
వెల్లింగ్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఇరు జట్లు తలో సిరీస్ గెలిచి ఇప్పుడు టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు బుధవారం మీడియాతో మాట్లాడటంతో పాటు ప్రి-సిరీస్ ఫొటో షూట్లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా షేర్ చేసింది. (ఇక్కడ చదవండి: ‘టెస్టు’ సమయం) దీనికి‘తొలి టెస్ట్ నేపథ్యంలో కెప్టెన్ల ఫొటో సమయం' అని క్యాప్షన్‌లో పేర్కొంది. అయితే దీనిపై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. ఇందుకు ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లి, విలియమ్సన్‌లు వేసిన జర్సీలే కారణమయ్యాయి. ఇరు జట్ల జెర్సీల రంగుల్లో తేడా ఉండటంతో ఇది టైడ్ బట్టల సబ్బు ప్రకటనలో ఉందని ఒకరంటే.. ఉజాల వేసి ఉతకమని మరొకరు కామెంట్ చేశారు. న్యూజిలాండ్‌లో టైడ్ అందుబాటులో లేనట్లు ఉందని మరొకరు ట్వీట్ చేశారు. ‘న్యూజిలాండ్‌ను టీమిండియా ‘వైట్ వాష్’ చేయాల్సిందే’ అని మరొక అభిమాని సెటైర్ వేశాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను కోహ్లి గ్యాంగ్ 5-0తో క్లీన్ స్వీప్ చేయగా, మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కివీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. -
టీ20 క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు
వెల్లింగ్టన్: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. బ్రెండన్ మెకల్లమ్, క్రిస్ గేల్, కోహ్లి, రోహిత్ శర్మలకు సాధ్యం కాని ఘనతను న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ సాధించారు. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో టీ20లో 69 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్ మహిళలు సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకున్నారు. ఇంకా మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో సోఫీ డివైన్ కీలక పాత్ర పోషించారు. వరుసగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20ల్లోనూ యాభైకి పరుగులు సాధించారు. దాంతో కివీస్ సునాయాసంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయితే వరుసగా యాభైకి పైగా పరుగుల్ని సాధించడం డివైన్‌కు ఐదోసారి. ఫలితంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా(పురుషులు, మహిళల కేటగిరీల్లో) ఆమె రికార్డు నెలకొల్పారు. తాజా మ్యాచ్‌లో 105 పరుగులు సాధించిన డివైన్.. ఈ సిరీస్‌లో 54 నాటౌట్, 61, 77 పరుగులు నమోదు చేశారు. ఇక మిథాలీ రాజ్, బ్రెండన్ మెకల్లమ్‌లు వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలను మాత్రమే సాధించగా, ఆ రికార్డునే డివైన్ బ్రేక్ చేశారు. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాల్గో మ్యాచ్‌లో కివీస్ మహిళలు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా మహిళలు 17 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటై పరాజయం చవిచూశారు. -
వారికి విశ్రాంతి..ఈ ముగ్గురికీ అవకాశం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాల్గో టీ20లో కూడా జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్.. భారత్‌ను తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. కాగా, తాజా మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా విలియమ్సన్ తప్పుకున్నాడు. దాంతో కివీస్ కెప్టెన్‌గా టిమ్ సౌతీ వ్యవహరించనున్నాడు. కాగా, భారత్ జట్టు పలు కీలక మార్పులు చేసింది. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, సైనీలు తుది జట్టులోకి వచ్చారు. అదే సమయంలో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతి ఇచ్చారు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా.. అదే ఊపును కొనసాగించి ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సన్నద్ధమైంది. తాజా ఫామ్ ప్రకారం చూస్తే మన జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్ చెలగాటం...మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రాణసంకటంగా తయారైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో కివీస్ బృందం ఉంది. (ఇక్కడ చదవండి: మ్యాచ్ తర్వాత కోహ్లి అచ్చం..) గత మ్యాచ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే కివీస్ మ్యాచ్ చేజార్చుకుంది. చివరి 4 బంతుల్లో విజయానికి 2 పరుగులు కావాల్సిన తరుణంలో దాన్ని ఛేదించలేకపోయింది. చివరకు మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ సూపర్ ఓవర్ భారత్ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ పొరపాట్లను మళ్లీ రిపీట్ చేయకుండా సత్తా చాటాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే. తుది జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, సంజూ శాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ. న్యూజిలాండ్: టిమ్ సౌతీ(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, టామ్ బ్రూస్, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్లీన్, సోధి, బెన్నెట్. -
సూపర్ స్మాష్‌లో ‘సూపర్ మ్యాన్’ క్యాచ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వేదికగా ముగిసిన సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో వెల్లింగ్టన్ విజేతగా నిలిచింది. ఆక్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వెల్లింగ్టన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, ఆక్లాండ్ ఫీల్డర్ కాచోపా పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ముందుగా వెల్లింగ్టన్ బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో ఓపెనర్ డెవాన్ కాన్వే(49) మిడ్ ఆఫ్ మీదుగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కాచోపా గాల్లోకి ఎగిరిమరీ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. మెక్లీన్గన్ బౌలింగ్‌లో పవర్ ఫుల్ డ్రైవ్ కొట్టాడు. అంతే వేగంగా స్పందించిన కాచోపా కాస్త ఎడంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఆక్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. Craig Cachopa's 'flying' catch in the #SuperSmashNZ final is 🤯pic.twitter.com/Zd9XhtHsWT — T20 World Cup (@T20WorldCup) January 19, 2020 -
ఈ క్రికెట్ షాట్‌ను ఎప్పుడైనా చూశారా?
వెల్లింగ్టన్: ప్రపంచ క్రికెట్లో స్కూప్ షాట్లు కొత్తమే కాదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొట్టిన తాజా స్కూప్ షాట్ ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పెద్దగా శ్రమించకుండానే ఆడిన స్కూప్ షాట్ హైలైట్ అయ్యింది.శుక్రవారం న్యూజిలాండ్ లిస్ట్-ఎ క్రికెట్లో భాగంగా ఒటాగో-వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఒటాగో తరఫున ఆడుతున్న నీల్ బ్రూమ్.. వెల్లింగ్టన్ కెప్టెన్ హమిస్ బెన్నిట్ వేసిన స్లో బౌన్సర్‌ను వికెట్ కీపర్ తలపై నుంచి ఫోర్కు పంపాడు. తన టైమింగ్‌లో ఎటువంటి పొరపాటు చేయకుండా వికెట్ కీపర్ పైనుంచి కచ్చితమైన షాట్ ఆడాడు. ఈ షాట్‌ను చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు, అభిమానులు వాటే షాట్ అనుకోవడం తమ వంతైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒటాగో ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. నీల్ బ్రూమ్(112) సెంచరీ చేయగా, మిచ్ రెన్విక్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఒటాగో 262 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వెల్లింగ్టన్.. 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మాల్కమ్ నోపాల్(87), డేవాన్ కాన్వే(70)లు ఆదుకోవడంతో వెల్లింగ్టన్ గాడిలో పడింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. ఐదో వికెట్‌గా కాన్వే ఔటైన తర్వాత వెల్లింగ్టన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరి మూడు బంతులకు మూడు పరుగులు చేయాల్సిన తరుణంలో వెల్లింగ్టన్ తడబడింది. నోఫాల్ క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. రెన్విక్ చేసిన రనౌట్‌తో నోఫాల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒటాగో రెండు పరుగుల తేడాతో గెలిచింది. అయితే నీల్ బ్రూమ్ ఆడిన స్కూప్ షాట్‌ను ఒటాగో తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ షాట్‌ను ఎప్పుడైనా చూశారా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. -
స్టోక్స్‌కు న్యూజిలాండ్ అత్యున్నత పురస్కారం?
వెల్లింగ్టన్ : ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యాడు. స్టోక్స్‌తో పాటు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా నామినేట్ అవడం విశేషం. న్యూజిలాండర్ ఆఫ్ ఇయర్ అవార్డు కోసం మొత్తం పది మందిని ఫైనల్ లిస్టుకు నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి విన్నర్‌ను ఎంపిక చేస్తారు. ఆ అవార్డును 2020 ఫిబ్రవరిలో అందజేస్తారు. ఇక ఈ అవార్డుకు నామినేట్ చేసిన చీఫ్ జడ్జి కామెరున్ బెన్నెట్ స్పందించాడు. స్టోక్స్ న్యూజిలాండ్ తరపున ఆడకపోయినా అతని తల్లిదండ్రులు ఇక్కడి వారవడంతో ఈ అవార్డ్‌కు నామినేట్ చేశామని తెలిపాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఒంటిచేత్తో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన విలియమ్సన్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనా, అతని తెగువ, ధైర్యమే ఈ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసిందన్నాడు. స్టోక్స్ పుట్టింది కివీస్‌లోనే అయినా, తన 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ న్యూజిలాండ్ తరపున రగ్బీ లీగ్ ఆడేవాడు. కొంతకాలం ఇంగ్లండ్‌లో రగ్బీ కోచ్‌గా పనిచేసిన గెరార్డ్ కుటుంబంతో సహా తిరిగి స్వదేశానికి తిరిగివచ్చినా, స్టోక్స్ మాత్రం ఇంగ్లండ్‌లోనే ఉండిపోయాడు. ఇక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టైగా నిలవడంలో స్టోక్స్ చేసిన 84 పరుగులను ఎప్పటికీ మరచిపోలేనిది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలకపోవడంతో ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ జట్టు జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఫైనల్లో పరాజితులు లేరు
వెల్లింగ్టన్: ప్రపంచ కప్ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్ విలియమ్సన్ సహా కోచ్, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఆరు పరుగుల (2+4) ఓవర్ త్రోపై విలియమ్సన్ తమ దేశ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన ఈ క్లిష్టమైన పొరపాటును తెలుసుకుని తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ‘నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం తప్ప భిన్నమైనదని అనుకోలేదు’ అని అతడు తెలిపాడు. తీవ్ర ఉత్కంఠగా సాగిన తుది సమరంలో పరాజితులు ఎవరూ లేరని విలియమ్సన్ వివరించాడు. ఫలితాన్ని చూస్తే ఒక్క కిరీటం (ప్రపంచ కప్ ట్రోపీ) దక్కడం తప్ప రెండు జట్ల మధ్య తేడా ఏదీ లేదని అతడు విశ్లేషించాడు. కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ... ప్రపంచ కప్ నిబంధనలను తప్పనిసరిగా సమీక్షించాలని కోరాడు. ఆటలో సమఉజ్జీలుగా నిలిచినప్పటికీ సాంకేతిక అంశాలతో ఓటమి పాలవడం బాధాకరంగా ఉందని అతడు అన్నాడు. ఎన్నో అంశాలు ఉండగా... ప్రపంచ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనలు వర్తింప చేయాల్సి వస్తుందని వాటిని రూపొందించినవారు సైతం ఊహించి ఉండరని స్టీడ్ పేర్కొన్నాడు. ‘ఆరు పరుగుల ఓవర్ త్రో’ నిర్ణయంపై స్పందిస్తూ అంపైర్లూ మనుషులేనని వారూ పొరపాట్లు చేస్తారని, అయినా వారు మ్యాచ్ అధికారులు కాబట్టి వాటిని అంగీకరించాల్సిందేనని అన్నాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచ కప్‌నకు తమ జట్టు మరింత దృఢంగా తయారవుతుందని, టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తుందని కివీస్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్ ఓటమిని అతడు తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఆటగాళ్లు విడివిడిగా స్వదేశం చేరుకుంటుండటంతో న్యూజిలాండ్ జట్టుకు స్వదేశంలో స్వాగత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే, వారి అద్వితీయ ప్రదర్శనకు తగిన రీతిలో స్వాగతం పలకాలని బోర్డు భావిస్తోంది. దీనికోసం దేశ ప్రధాని జెసిండా అర్డెమ్, క్రీడా మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్తో సంప్రదింపులు జరుపుతోంది. -
టేలర్ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ డబుల్ సెంచరీ సాధించాడు. 211 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్న టేలర్‌కు ఇది టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ. అయితే డబుల్ సెంచరీ మార్కును చేరిన తర్వాత బంతికే టేలర్ పెవిలియన్ చేరాడు. అతనికి జతగా హెన్రీ నికోలస్(107), కేన్ విలియమ్సన్(74) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌కు విలియమ్సన్-టేలర్ జోడి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై నికోలస్-టేలర్‌ల జోడి నాల్గో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ 141 పరుగుల వెనుకబడి ఉంది. ఇక్కడ చదవండి: కివీస్ ఇన్నింగ్స్ విజయం -
దీవులను చేరువ చేసిన భూకంపం!
వెల్లింగ్టన్: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపంతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉత్తర, దక్షిణ దీవుల మధ్య దూరం 35 సెంటీమీటర్లు తగ్గగా, దక్షిణ దీవికి పైభాగాన ఉన్న నెల్సన్ పట్టణం 20 మిల్లీ మీటర్లు కుంగిందని తెలిపారు. 2016 నవంబర్ 14వ తేదీన 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావానికి లోనై ఈ రెండు ప్రధాన దీవులు ఒకదానికొకటి చేరువగా వచ్చాయని, చీలికలు దక్షిణ దీవిని ఉత్తరం వైపునకు నెట్టివేశాయని వివరించారు. మరోవైపు, దక్షిణ దీవిలో ప్రధాన చీలిక సంభవించిన కేప్ క్యాంప్‌బెల్, ఉత్తర దీవికి దిగువన ఉన్న రాజధాని వెల్లింగ్టన్ మధ్య దూరం 50 కిలోమీటర్లకు పైగానే ఉందని వారు తెలిపారు. ఆనాటి భూకంపంలో సుమారు 25 చోట్ల చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. ప్రపంచంలో సంభవించిన అత్యంత సంక్లిష్టమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
చెరువులోకి విమానం
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : రన్ వే మీద ఆగాల్సిన విమానం కాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు పడుతూ.. లేస్తూ.. ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. దాంతో ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. ఈ లోపు ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. కానీ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
న్యూజిలాండ్
ప్రపంచ వీక్షణం ఖండం: యూరప్ వైశాల్యం: 2,68,021 చదరపు కిలోమీటర్లు జనాభా: 45,70,038 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: వెల్లింగ్టన్ కరెన్సీ: న్యూజీలాండ్ డాలర్ భాషలు: ఇంగ్లిష్, మావోరీ, ఇతర పాలినేసియన్ భాషలు ప్రభుత్వం : యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ మొనార్చీ మతం: 81% క్రైస్తవులు వాతావరణం: జులైలో 6 నుండి 12 డిగ్రీలు, జనవరిలో 13-21 డిగ్రీలు. పంటలు: పప్పు దినుసులు, పళ్లు, కూరగాయలు పరిశ్రమలు: సహజ వాయువులు, పేపర్, ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్, గ్లాసు, రవాణా పరికరాలు, యంత్రాలు, దుస్తులు, పాలు, మాంస ఉత్పత్తులు, బీరు. ఎగుమతులు: మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని, కలప, కాగితం, చేపలు, పళ్లు, కూరగాయలు, జంతు చర్మం. స్వాతంత్య్రం: 1947, డిసెంబర్ 10 సరిహద్దులు: నలువైపులా పసిఫిక్ మహా సముద్రం చరిత్ర న్యూజిలాండ్ దీవులను క్రీ.శ. 1642లో డచ్చి దేశపు సముద్ర యాత్రీకుడు అబెల్ టాస్మాన్, అతని అనుచరులు కనిపెట్టారు. అతడు ఆ దీవులలో అడుగు పెట్టినపుడు ఆ దీవులలో నివసిస్తున్న మావోరీ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తరువాత 1769 వరకు ఎవరూ ఆ దీవులకు వె ళ్లలేదు. 1769లో బ్రిటిష్ నావికుడు జేమ్స్‌కుక్ ఆ దీవులకు వెళ్లాడు. అప్పటినుండి ఆ దీవులపై బ్రిటిష్ ప్రభువుల ఆధిపత్యం కొనసాగింది. దీవులలో నివసిస్తున్న మావోరీ తెగల ప్రజలను బ్రిటిష్ వాళ్లు క్రమంగా క్రిస్టియన్లుగా మార్చడం ఆరంభించారు. 19వ శతాబ్దం నాటికి దేశంలో అంతర్యుద్ధాల కారణంగా వేలాది మావోరీలు చనిపోయారు. క్రిస్టియన్ మిషినరీలు క్రమంగా దేశంలో పెరిగిపోయాయి. 1835లో ఫ్రెంచి రాజులు దండయాత్ర చేసినపుడు బ్రిటిష్ ప్రభువులు ఫ్రెంచి వాళ్లను తరిమేశారు. 1840లో న్యూజిలాండ్‌లో కొంత భాగానికి స్వాతంత్య్రం ప్రకటించారు. 1854లో స్వతంత్ర పార్లమెంటు ఏర్పాటయింది. 1891లో రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. 1907లో డొమినియన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పడింది. ఇప్పటికీ ఇంగ్లాండ్ దేశపు రాణి న్యూజిలాండ్‌కు కూడా రాణిగా వ్యవహరిస్తోంది. పంటలు - పరిశ్రమలు న్యూజిలాండ్ దేశం రెండు ప్రధానమైన దీవులుగా ఉంటుంది. ఉత్తర దీవులలో జనాభా అధికంగా ఉంటుంది. దక్షిణ దీవులలో అధికభాగం పర్వతాల మయం. దక్షిణ భాగం అంతా పర్వతాల మయం కావడం వల్ల వ్యవసాయానికి అనువైన భూమి తక్కువగా ఉంది. అనువైన ప్రదేశాలలో పప్పు దినుసులు, పళ్లు, కూరగాయల తోటలు, ద్రాక్ష తోటలు అధికంగా ఉన్నాయి. గొర్రెలు, ఆవుల పెంపకం చాలా అధికం. దేశంలో గొర్రె మాంసం, పాలు, పాల ఉత్పత్తులు దేశంలో అంతగా డిమాండ్ లేకపోవడం వల్ల ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ రెండింటి ఎగుమతులలో ఈ దేశంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇక ఉత్తర దీవులలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అడవుల శాతం అధికం కావడం వల్ల ఫర్, ఫైన్ వృక్షాలు అధికంగా పెరుగుతున్నాయి. వీటి నుండి గుజ్జు తీసి పేపరు తయారు చేస్తారు. దుస్తుల తయారీ, సారాయి ఉత్పత్తి, రసాయనాలు, ఎరువుల పరిశ్రమలు, గ్లాసు, సిమెంట్ పరిశ్రమలు, ఉన్ని, కలప ఉత్పత్తి పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. పరిపాలనా రీతులు న్యూజిలాండ్ దేశానికి ఇప్పటికీ ఒక రాజు ఉంటాడు. అలాగే దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. ఈ ఇద్దరూ పరిపాలనలో పాలు పంచుకుంటారు. పరిపాలనా సౌలభ్యం కోసం దేశం 11 రీజియన్ కౌన్సిల్లుగా 67 టెర్రిటోరియల్ అథారిటీలుగా విభజింపబడింది. దేశంలో మొత్తం 249 మున్సిపాలిటీలు ఉన్నాయి. దేశంలో ప్రధానమైన నగరాలు ఇవి. రాజధాని వెల్లింగ్టన్, ఆక్లాండ్, క్రైస్ట్చ ర్చ్, హామిల్టన్, నేపియర్-హాస్టింగ్స్, తౌరంగా, డునెడిన్, పాల్మర్‌స్టోన్ నార్తే, నెల్సన్, రోటోరువా, న్యూ ఫ్లైమత్, వంగారి, ఇన్వర్ కార్గిల్. ప్రజలు - సంస్కృతి దేశంలో ఉన్న జనాభాలో 75% మంది యూరోపియన్లు, 15% మంది మావోరీలు ఉన్నారు. దేశంలో భిన్నమైన సంస్కృతి దర్శనమిస్తుంది. దేశంలో 98% ప్రజలు ఇంగ్ల్లిషు భాష మాట్లాడుతారు. మావోరీ భాషను కూడా అధికారిక భాషగా గుర్తించారు. జనాభాలో దాదాపు 50% ప్రజలు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తే మిగిలిన వారు తటస్థులుగా ఉంటారు. గ్రామీణ ప్రజలు వ్యవసాయం చేస్తారు. చదువుకున్న వాళ్లంతా పట్టణాలకు వెళ్లిపోయి ఉద్యోగాలు, పరిశ్రమలలో కార్మికులుగా జీవనం కొనసాగించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు తక్కువగా కనిపిస్తాయి. పూర్వం నుండీ ఉన్న మావోరీ సంస్కృతిని ఇప్పటి ఆధునిక సంస్కృతి క్రమంగా నిర్మూలిస్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే మావోరీ సంస్కృతి కనబడుతుంది. వివిధ సందర్భాలకు తగిన పండుగలు జరుపుకొన్నప్పుడు మాత్రం అందరూ దానిలో పాల్గొంటారు. దేశంలో చూడదగిన ప్రదేశాలు న్యూజిలాండ్ ఒక అద్భుతమైన పర్యాటక దేశంగా పేరుగాంచింది. భారతదేశంతో సహా ఎన్నో దేశాల నుండి ప్రజలు లక్షలాదిగా ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. దేశంలో చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని వెల్లింగ్టన్, ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, క్వీన్స్ టౌన్, రోటోరువా, బే ఆఫ్ ఐలాండ్స్, వైటోమో గుహలు, ఆల్ఫ్స్ పర్వతాలు, మిల్ఫోర్డ్ సౌండ్, అబెల్ టాస్మాన్ నేషనల్ పార్కు... ఇలా ఎన్నో ఉన్నాయి. ఆక్లాండ్ దేశంలో ఆక్లాండ్ అతి పెద్ద నగరం. నగరం నడిబొడ్డున ఉన్న స్కై టవర్‌ను దర్శించడం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ టవర్ 360 డిగ్రీలుగా తిరుగుతోంది. ఈ టవర్ పై నుండి చూస్తే దాదాపు 80 కిలోమీటర్ల వరకు అన్నీ కనిపిస్తాయి. పై భాగంలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ టవర్ పైనుండి బంగీ జంప్ చేయవచ్చు. నగరంలో ఆక్లాండ్ మ్యూజియం, నావల్ మ్యూజియం, బ్రిడ్జిలు, జూ, సముద్రంలో వివిధ చిన్న చిన్న ద్వీపాలు, విక్టోరియా మార్కెట్ నగరం చుట్టూ దాదాపు 50కి పైగా సుప్తావస్థలో ఉన్న అగ్ని పర్వతాలు, అందమైన భవంతులు, రోడ్లు యాత్రికులను అబ్బుర పరుస్తాయి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ సెయిల్ అని పిలుస్తారు. నగరంలో నివసిస్తున్న వారికి ప్రతి ఒక్కరికీ ఒక సొంత పడవ ఉంటుంది. సముద్ర తీరంలో చూస్తే వేలాది పడవలతో నిండి ఉంటుంది. విక్టోరియా భవనం చూడదగ్గది. అత్యంత సురక్షిత నగరంగా దీనికి పేరుంది. అబెల్ టాస్మాన్ నేషనల్ పార్క్ నిజానికి దేశంలో మొత్తం 14 జాతీయ పార్కులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అబెల్ టాస్మాన్ పార్కు. ఇది నెల్సన్ నగరానికి సమీపంలో ఉంది. ఈ పార్కులో బీచ్‌లు, గ్రానైట్ కార్వింగ్‌లు, ట్రెక్కింగ్ కోసం పర్వతాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ పార్కులో కోస్ట్ట్రాక్, ఆంకోరేజ్ హట్లలో సేదదీరవచ్చు. ఈ పార్కు మొత్తం 22,530 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉంది. 1942లో ఈ పార్కును అభివృద్ధి చేశారు. పార్కులో రకరకాల జీవ జంతువులు నివాసం ఉన్నాయి. రకరకాల పక్షులు, చిన్న జంతువులు ఉన్నాయి. గ్రానైట్ రాక్స్ చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ మావోరీ సంస్కృతికి నిదర్శనంగా గ్రామాలు, అక్కడి ప్రజలు దర్శనమిస్తారు. దేశంలోని ఇతర పార్కులు ఆథర్స్పాస్ నేషనల్ పార్కు, ఎగ్మాంట్ నేషనల్ పార్కు, కహురంగి నేషనల్ పార్కు, మౌంట్కుక్ నేషనల్ పార్కు, నెల్సన్ లేక్స్ నేషనల్ పార్కు, పాపరోవా నేషనల్ పార్కు, రకియూర నేషనల్ పార్కు, టోంగారిలో నేషనల్ పార్కు, వంగనూయి నేషనల్ పార్కు ఇలా అన్నింటినీ దేశంలో దర్శించవచ్చు. వేడి నీటి చలమల రొటోరువా దేశ ఉత్తర ఐలాండ్‌లో నెలకొన్న రోటోరువా ప్రాంతం వేడి నీటి, బురద నీటి చలమలకు ప్రసిద్ధి. నిరంతరం వేడి నీరు భూమిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. వీటితో పాటు ఒక సమాధి అయిపోయిన గ్రామం కూడా ఈ రోటోరువా నగర సమీపంలో మనకు కనిపిస్తుంది. రోటోరువా సరస్సు, దాని చుట్టూ ఈ వేడినీటి, బురద చలమలు దర్శనమిస్తాయి. అందువల్ల ఈ నగరాన్ని సల్ఫర్ సిటీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇక్కడికి బురద స్నానం చేయడానికి వస్తుంటారు. భూమి లోపల ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ పైకి నీరు, బురదతో పాటు ఉబికి వస్తూ ఉంటుంది. ఇక్కడ బురద స్నానం చేయడం వల్ల నరాల బాధలు తగ్గుతాయని భావిస్తారు. ఈ ప్రాంతంలో మొత్తం 17 చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. ఇక్కడే బొటానికల్ గార్డెన్, రోటోరువా మ్యూజియంలు, పోస్టల్ క్లబ్, కైటునానది... ఇలా ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. క్రైస్ట్ చర్చ్ దేశ దక్షిణ ద్వీపంలో ఉన్న అతి పెద్ద నగరం క్రైస్ట్ చర్చ్. నగరానికి సమీపంలో తెల్లగా మంచుతో కప్పబడిన ఆల్ఫ్స్ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. 1856లో ఈ నగరం ప్రభువుల నగరంగా ఉత్తరంగా వైమాకారిణి నది ప్రవహిస్తూ ఉంటుంది. నగరంలో కాంటర్బరీ మ్యూజియం, క్రైస్ట్ చర్చ్ క్యాథడ్రల్, రైల్వేటన్నెల్, ఓడరేవు, హెగ్లే పార్కు, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, లింకన్ విశ్వవిద్యాలయ భవనం, బొటానికల్ గార్డెన్, వెస్ట్రన్ హౌస్, విక్టోరియా సరస్సు ఇలా ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉంటాయి. ఈ నగరంలో మావోరీ సంస్కృతి ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. నగరమంతా కూడా ఎంతో శుభ్రంగా, ఇంకెంతో సుందరంగా కనిపిస్తుంది. ఎక్కడా చెత్తా చెదారం కనిపించదు. నగరంలో అంతర్గత రవాణాకు బస్సులు, ట్రాక్ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. వెల్లింగ్టన్ వెల్లింగ్టన్ నగరానికి ప్రధాన ఆకర్షణ ఓడరేవు. మొత్తం ప్రపంచంలో అతి చల్లని ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. వివిధ దేశాల నుండి పర్యాటకులు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓరియంటల్ బే లో సేదదీరడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. బంగారు రంగులో ఉండే ఇసుక బీచులు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. నగరంలో టే పాప టోంగారేవ మ్యూజియం, న్యూజిలాండ్ నేషనల్ మ్యూజియంలు తప్పక చూడదగినవి. నగరంలో దాదాపు ఆరున్నర మిలియన్ల జనాభా ఉంటుంది. నగరం చుట్టూ ఎత్తై కొండలు, మరోవైపు సముద్రం ఉంటాయి. వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరంలో ఉన్న బీహైవ్ భవనం తప్పక చూడాలి. ఈ భవనమే ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిక భవనం. దీని నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నగరాన్ని ఆనుకొని సముద్రంలో రెండు చిన్న ద్వీపాలు ఉంటాయి. ఫెర్రీ బోట్లో వెళ్లి వాటిని చూడవచ్చు. నగరంలో పోలీస్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, వింటేజ్కార్ మ్యూజియం, డేసే ఆర్ట్ మ్యూజియం, మౌంట్ విక్టోరియా, మడ్ సైకి ల్స్, వాటర్ ఫ్రంట్, వెల్లింట న్ జూ మొదలైనవి చూడదగినవి. -
న్యూజిలాండ్ లో భూకంపం
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైంది. గిస్బోకు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. న్యూజిలాండ్ కాలమాన ప్రకారం ఉదయం 10.33 గంటలకు (22.33 జీఎంటీ ఆదివారం) భూమి కంపించింది. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అందుబాటులోకి రాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు సమాచారాన్ని అందించారు. -
న్యూజిలాండ్ లో భారత సంతతి వ్యక్తి అరెస్టు
వెల్టింగ్టన్: ఇద్దరు టీనేజ్ బాలికలపై దాడి చేసి కారణంగా ఒక భారత సంతతి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. ధావల్ కదామ్ అనే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలపై వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తొలుత ఆగస్టు 28 వ తేదీన ఆక్లాండ్ లో ఓ 16 ఏళ్ల బాలికపై దాడి చేశాడు. అనంతరం అదే రోజూ సాయంత్రం బాలికపై కెరికెరి నగరంలో 17 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ రెండు ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతనికి కోర్టులో బెయిల్ లభించగా, తదుపరి విచారణ డిసెంబర్ 4 వ తేదీన జరుగనుంది. -
ఫిక్సింగ్పై విచారణ తుది దశలో ఉంది: ఐసీసీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లపై కొనసాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ పూర్తి కావచ్చిందని ఐసీసీ తెలిపింది. దీంట్లో భాగంగా ఏసీఎస్‌యూ ముందు కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను ఇప్పటికే అంగీకరించాడు. ‘విచారణ చివరి దశలో ఉన్నాం. క్రిస్ కెయిన్స్ కూడా త్వరలోనే తన వాదనను వినిపిస్తాడని అనుకుంటున్నాను’ అని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. మరోవైపు కెయిన్స్... ఐసీసీ ఎసీఎస్‌యూ అధికారులను, మెట్రోపాలిటన్ పోలీసులను కలిసేందుకు వెళ్లినట్టు సమాచారం. -
బుకీలు నన్ను సంప్రదించారు
ఈ విషయాన్ని అధికారులకు చెప్పలేదు అంగీకరించిన కివీస్ ఆటగాడు వెల్లింగ్టన్: గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సందర్భంగా కొంత మంది బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని అధికారులకు వెల్లడించలేకపోయానని న్యూజిలాండ్ ఆటగాడు లూ విన్సెంట్ అంగీకరించాడు. అయితే ఫిక్సింగ్‌కు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. ఏదేమైనా ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను తాను ఉల్లంఘించానని ఒప్పుకున్నాడు. ‘బుకీలు నన్ను సంప్రదించినా నేను మాత్రం ఫిక్సింగ్‌కు అంగీకరించలేదు. వాళ్లు సంప్రదించడం వెనుక ఉన్న ఆంతర్యం నాకు అర్థం కాలేదు. అందుకే దాని గురించి ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదు. అక్కడ జరిగిన మ్యాచ్ల్లోగానీ, ఇటీవల జరిగిన విచారణలోగానీ నేను భాగం పంచుకోలేదు’ అని విన్సెంట్ వెల్లడించాడు. మరోవైపు విన్సెంట్‌కు ఎలాంటి శిక్ష పడుతుందన్న విషయాన్ని వెల్లడించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) ఎగ్జిక్యూటివ్ చీఫ్ డేవిడ్ వైట్ నిరాకరించారు.