వెల్లింగ్టన్ : న్యూజిలాండ్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదైంది. గిస్బోకు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. న్యూజిలాండ్ కాలమాన ప్రకారం ఉదయం 10.33 గంటలకు (22.33 జీఎంటీ ఆదివారం) భూమి కంపించింది. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అందుబాటులోకి రాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు సమాచారాన్ని అందించారు.