ఫిక్సింగ్‌పై విచారణ తుది దశలో ఉంది: ఐసీసీ | Match-fixing: ICC Chief Says Corruption Inquiry Nears End | Sakshi
Sakshi News home page

ఫిక్సింగ్‌పై విచారణ తుది దశలో ఉంది: ఐసీసీ

Published Sun, May 25 2014 1:17 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Match-fixing: ICC Chief Says Corruption Inquiry Nears End

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లపై కొనసాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ పూర్తి కావచ్చిందని ఐసీసీ తెలిపింది. దీంట్లో భాగంగా ఏసీఎస్‌యూ ముందు కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 
 మరోవైపు మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను ఇప్పటికే అంగీకరించాడు. ‘విచారణ చివరి దశలో ఉన్నాం. క్రిస్ కెయిన్స్ కూడా త్వరలోనే తన వాదనను వినిపిస్తాడని అనుకుంటున్నాను’ అని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. మరోవైపు కెయిన్స్... ఐసీసీ ఎసీఎస్‌యూ అధికారులను, మెట్రోపాలిటన్ పోలీసులను కలిసేందుకు వెళ్లినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement