వెల్లింగ్టన్ : భారత్‌తో రెండో టెస్టుకు ఆల్‌రౌండర్ జిమ్మీ నీషామ్, యువ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్‌లకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టుకు ముందు బార్‌లో తప్పతాగి కొట్టుకున్న రైడర్, బ్రేస్‌వెల్‌లకు సెలెక్టర్లు ఉద్వాసన పలికి జట్టులో రెండు మార్పులు చేశారు. వెల్లింగ్టన్‌లో ఈ నెల 14 నుంచి 18 వరకు రెండో టెస్ట్ జరగనుంది. సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. మరోవైపు రైడర్, బ్రేస్‌వెల్‌లకు న్యూజిలాండ్ బోర్డు భారీగా జరిమానా కూడా విధించింది.
‘పచ్చి’క సిద్ధం
భారత్‌తో రెండో టెస్టు కోసం వెల్లింగ్టన్‌లో పేసర్లకు సహకరించే వికెట్ తయారు చేశారు. ‘పచ్చికతో ఉన్న ఈ పిచ్‌ను చూస్తే భారత ఆటగాళ్లు ఏమాత్రం సంతోషించరు. టాస్ గెలిచిన జట్టులో పేసర్లకు పండగే’ అని క్యూరేటర్ చెప్పారు.
నీషామ్, లాథమ్‌లకు చోటు
Published Wed, Feb 12 2014 12:49 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement