Jimmy Neesham
-
NZ vs BAN 3rd T20: బంగ్లాపై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో న్యూజిలాండ్ ముగించింది. మౌంట్ మంగ్నూయ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో(డీఎల్ఎస్) కివీస్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో న్యూజిలాండ్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ బౌలర్ల దాటికి 110 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సౌథీ, మిల్నే, సీర్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ ఇన్నింగ్స్ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. న్యూజిలాండ్ కూడా స్వల్ప లక్ష్య చేధనలో కాస్త తడబడింది. 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫిన్ అలెన్(38), నీషమ్(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ సంచలనాలు: మొన్న అలా.. ఇప్పుడిలా!
New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్‌లో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్‌ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు. మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు. వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్ -
చితక్కొట్టిన కర్రన్.. హండ్రెడ్ లీగ్ 2023 విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్
హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ విజయవంతంగా పూర్తయ్యింది. పురుషుల విభాగంలో ఓవల్ ఇన్విన్సిబుల్స్, మహిళల విభాగంలో సథరన్ బ్రేవ్ ఛాంపియన్స్‌గా అవతరించాయి. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన పురుషుల ఫైనల్స్‌లో ఇన్విన్సిబుల్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను, మహిళల ఫైనల్స్‌లో సథరన్ బ్రేవ్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌ను ఓడించి, టైటిల్స్ చేజిక్కించుకున్నాయి. హండ్రెడ్ లీగ్‌లో ఇరు జట్లకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. Your 2023 champions! 👏 ✨ Oval Invincibles and Southern Brave! ✨#TheHundred pic.twitter.com/O2OPFMrJTi — The Hundred (@thehundred) August 27, 2023 Unbreakable. 🔒#TheHundred pic.twitter.com/DntFw2MthW — The Hundred (@thehundred) August 27, 2023 ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టామ్ కర్రన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన ఫైనల్స్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 14 పరుగుల తేడాతో గెలుపొంది, హండ్రెడ్ లీగ్ పురుషుల విభాగపు విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్.. జిమ్మీ నీషమ్ (33 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కర్రన్ (34 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 161 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాంచెస్టర్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, జాషువ లిటిల్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. What a special night! @TC59 🔥 pic.twitter.com/r0QU8HMsKO — Sam Curran (@CurranSM) August 28, 2023 బంతిలోనూ రాణించిన కర్రన్.. చేతులెత్తేసిన మాంచెస్టర్ 162 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మాంచెస్టర్ ఆటగాళ్లు ఆది నుంచే తడబడుతూ వచ్చి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఓవల్ బౌలర్లు విల్ జాక్స్ (2/11), టామ్ కర్రన్ (1/25), డానీ బ్రిగ్స్ (1/2), నాథన్ సౌటర్ (1/24), సామ్ కర్రన్ (1/31) మాంచెస్టర్ ఆటగాళ్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఫలితంగా మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ మాడ్సన్ (37), జేమీ ఓవర్టన్ (28 నాటౌట్), ఫిలిప్ సాల్ట్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. A fairytale finish ✨#TheHundred pic.twitter.com/1XhfiWsevw — The Hundred (@thehundred) August 27, 2023 ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్.. హండ్రెడ్ లీగ్ మహిళల విభాగపు ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్ అవతరించింది. ఫైనల్లో బ్రేవ్.. నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్‌ను 34 పరుగుల తేడాతో చిత్తు చేసి, రెండు ప్రయత్నాల తర్వాత తొలి హండ్రెడ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్.. డేనియల్ వ్యాట్ (59), ఫ్రేయా కెంప్ (31), ఆడమ్స్ (27) రాణించడంతో నిర్ణీత బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో కేట్ క్రాస్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ బల్లింజర్, లూసీ హిగమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. The moment Southern Brave women won #TheHundred! 🏆 pic.twitter.com/Nzn3madPTY — The Hundred (@thehundred) August 27, 2023 చెలరేగిన లారెన్ బెల్, మూర్.. 140 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే క్రమంలో బ్రేవ్ బౌలర్లు చెలరేగిపోయారు. లారెన్ బెల్ (3/21), కేలియా మూర్ (3/15), ట్రయాన్ (2/28), అన్య ష్రబ్సోల్ (1/18) అద్భుతంగా బౌలింగ్ చేసి, సూపర్ ఛార్జర్స్‌ను 105 పరుగులకు కుప్పకూల్చారు. బ్రేవ్ బౌలర్లు విజృంభించడంతో సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్ మరో 6 బంతులు మిగిలుండగానే ముగిసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెస్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
చహల్ చేసిన పనికి షాక్ తిన్న క్రికెటర్లు
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలిఉంది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అభిమానులకు ఆనందాన్ని పెంచే పనిలో పడ్డారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యజ్వేంద్ర చహల్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అతను అన్న మాట రెండు అర్థాలకు దారి తీయడంతోనే ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. విషయంలోకి వెళితే.. గురువారం ప్రాక్టీస్ సమయంలో జాస్ బట్లర్, చహల్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. ఏదో విషయమై ఇద్దరు సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో చహల్.. జోషీ బాయ్ కమ్ ఓపెన్ విత్ మి అని పేర్కొన్నాడు. దీంతో షాకైన బట్లర్.. అరె చహల్ భయ్యా ఏంటిది అంటూ తలకు చేతులు పెట్టడం కెమెరాలకు చిక్కింది. వీరి పక్కనే ఉన్న జిమ్మీ నీషమ్ కూడా చహల్ వ్యాఖ్యలపై షాక్ తిన్నాడు. అయితే బట్లర్‌ను చహల్ అడిగింది ఓపెనింగ్ గురించి. బట్లర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు.. దానినే ఇన్‌డైరెక్ట్‌గా ''ఓపెన్ విత్ మి'' అని అన్నాడు. కాగా చహల్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు కూడా వినూత్న రీతిలో స్పందించారు. ఎంతైనా చహల్ కదా.. ఆ మాత్రం ఉండాలి.. ఒక 10వేల ట్వీట్స్ చేయ్.. అప్పుడు నీతో ఓపెన్ అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు. ఇక సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ ఈసారైనా కప్పు కొడుతుందా అనేది చూడాలి. మొదటి సీజన్(2008లో) విజేత మినహా రాజస్తాన్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేదు. సంజూ శాంసన్ నేతృత్వంలో ఈసారి జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. మార్చి 29న సన్‌రైజర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?! IPL 2022- Ravindra Jadeja: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా? 🤷♂️🤷♀️ pic.twitter.com/yXPHiB4kvP — Rajasthan Royals (@rajasthanroyals) March 24, 2022 -
ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా.. రేపు వీల్‌చైర్‌లో ఉంటానేమో
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. కాస్త సమయం దొరికినా ఫన్నీ ట్వీట్స్‌తో రెచ్చొపోతాడు. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న నీషమ్ ఆంక్లాండ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. 336 గంటల క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని మంగళవారం తన ఇంటికి చేరుకున్న నీషమ్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. నాలుగు వారాల తర్వాత బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. అలాగే మూడు నెలల తర్వాత గోల్ప్ ఆడాడు. అలా తొలిరోజు గడిచిపోయింది. ఇక నేటి ప్లాన్స్ ఎంటో నీషమ్ ట్విటర్ ద్వారా రివీల్ చేశాడు. '' మూడు వారాల తర్వాత జిమ్ సెషన్లో అడుగుపెడుతున్నా.. కొన్ని రోజుల పాటు మంచి రెస్ట్ తీసుకున్న నేను ఇలా అన్ని ఒకేసారి మొదలుపెట్టేశా. ఒకవేళ నా శరీరంపై భారం పడితే మాత్రం రేపు కచ్చితంగా వీల్‌చైర్‌లో ఉంటానేమో'' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. అయితే నీషమ్ ట్వీట్‌పై ఒక అభిమాని స్పందించాడు. '' నీషమ్ వీల్‌చైర్‌కు పరిమితమైనా.. చేతులతో చేసే ఎక్సర్సైజులు చాలానే ఉన్నాయి.. వాటి సంగతేంటి'' అని అడిగాడు. దీనికి నీషమ్.. '' మనం ప్రశాంతంగా ఉన్నామన్న ఈ ట్విటర్ మనల్ని అలా ఉంచేలా లేదు'' అంటూ బదులిచ్చాడు. కాగా నీషమ్ ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతను ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. కరోనా మహమ్మారి సెగతో లీగ్ రద్దు కావడంతో నీషమ్ స్వదేశానికి వచ్చేశాడు. కాగా జూన్‌లో టీమిండియా, కివీస్ మధ్య ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నీషమ్ ఎంపిక కాలేదు. నీషమ్ కివీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడి నాలుగు సంవత్సరాలైంది. 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీషమ్ 12 టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ 12 టెస్టుల్లో 709 పరుగులు చేసిన నీషమ్ బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కొనసాగుతున్నాడు. 66 వన్డేలాడి 1320 పరుగులతో పాటు 68 వికెట్లు, 29 టీ20లు ఆడి 324 పరుగులు సాధించాడు. చదవండి: పిచ్చి ప్రశ్న.. జట్టులోనే లేను.. నేనెలా తీస్తాను వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్ Yesterday: First bat and bowl in 4 weeks, first round of golf in 3 months. Today: first gym session in 3 weeks. Tomorrow: Wheelchair 😬 — Jimmy Neesham (@JimmyNeesh) May 26, 2021 -
నీషమ్‌ను రిజర్వ్ బెంచ్‌లో చూడలేకపోతున్నాం..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది కింగ్స్ పంజాబ్(పంజాబ్ కింగ్స్) తరఫున ఆడిన నీషమ్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. దాంతో వేలంలో నీషమ్‌ను ముంబై తీసుకుంది. ఇంకా ముంబై ఇండియన్స్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని నీషమ్‌కు సరైన హార్డ్ హిట్టింగ్ సామర్థ్యం లేనికారణంగానే ఇంకా అతని అవకాశం రాలేదని ఒక ట్వీటర్ యూజర్ ఎద్దేవా చేశాడు. ‘నీషమ్.. నువ్వు నీ హార్డ్ హిట్టింగ్ సామర్థ్యం పెంచుకో. దానిపై ఫోకస్ పెట్టు. నువ్వు వన్డేలకు పెర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌వి. టీ20ల్లో నీస్థానాన్ని పదిలం చేసుకోవాలంటే హార్డ్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. నిన్ను రిజర్వ్ బెంచ్‌లో చూడలేకపోతున్నాం. అది నిరాశపరుస్తోంది’ అని అన్నాడు. దానికి నీషమ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. టీ20 క్రికెట్లో తన యావరేజ్, స్టైక్‌రేట్ ఎలా ఉందో ఇమేజ్ పోస్ట్ చేసి మరీ సదరు యూజర్‌కు సమాధానమిచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తన రిథమ్‌ను అందుకోవడానికి తంటాలు పడుతోంది., డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ గ్యాంగ్.. తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇక్కడ చదవండి: అందుకే ఆఖరి ఓవర్ స్టోయినిస్ చేతికి: పంత్ Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను Lol. https://t.co/8KGpADwQ2W pic.twitter.com/Fan2I1ECDh — Jimmy Neesham (@JimmyNeesh) April 28, 2021 -
ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ సుయాజ్‌లో చిక్కుకున్నా!
వెల్లింగ్టన్: ఐపీఎల్ 2021 సీజన్‌కు సిద్ధమవుతున్న వేళ విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్లో ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మి నీషమ్, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్లో నీషమ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ట్విటర్లో నీషమ్‌ను ఐపీఎల్ అభిమాని ఒక ప్రశ్న అడిగాడు. ''నీషమ్.. ఐపీఎల్ త్వరలో ప్రారంభమవుతుంది.. ముంబై జట్టుతో ఎప్పుడు వచ్చి చేరుతున్నావంటూ'' ప్రశ్నించాడు. దీనికి నీషమ్.. ''నేను ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ కార్గో షిప్ వల్ల ఇప్పుడు సుయాజ్ కాలువలో చిక్కుకుపోయా.. త్వరలోనే బయటపడుతా'' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. నీషమ్ ఇచ్చిన సమాధానానికి మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. చదవండి: ముంబై ఇండియన్స్ మ్యాచ్ షెడ్యూల్ నీషమ్..'' 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్‌లో మోస్తూనే ఉన్నావా.. అందుకే చిక్కుకుపోయావు'' అంటూ కామెంట్ చేశాడు. మొదట మ్యాక్స్‌వెల్ చెప్పింది ఎవరికి అర్థం కాలేదు.. మ్యాక్సీ అలా పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. కివీస్, ఆసీస్ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మూడో టీ20లో మ్యాక్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల నీషమ్‌ను ఉతికారేశాడు. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించగా.. ఓవరాల్‌గా మాత్రం న్యూజిలాండ్ 3-2 తేడాతో సిరీస్ దక్కించుకుంది. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత జిమ్మి నీషమ్, మ్యాక్స్‌వెల్‌లు తమ జెర్సీలను ఒకరికి ఒకరు ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. మ్యాక్సీ నీషమ్‌కు అందజేసిన జెర్సీపై 4,6,4,4,4,6 అని రాసి ఉండడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ ఏడాది మ్యాక్స్‌వెల్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది పంజాబ్ కింగ్స్ తరపున మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడిన అతను 108 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్ జట్టు అతన్ని రిలీజ్ చేసింది. అయితే మ్యాక్స్‌వెల్ బిగ్‌బాష్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శన చేయడంతో అతని క్రేజ్ మరింత పెరిగింది. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో మ్యాక్సీని రూ. 14.25 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోవడం విశేషం. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరగనుంది. చదవండి: 'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో' Must be hard carrying bags that are 46,44,46 😉 https://t.co/kA6CkNT2l8 — Glenn Maxwell (@Gmaxi_32) March 29, 2021 -
వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్
క్రైస్ట్‌చర్చి: న్యూజిల్యాండ్-బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఓ విచిత్రమైన రనౌట్‌కు బలయ్యాడు. అప్పటికే 78 పరుగులతో ఊపుమీదున్న తమిమ్ అనవసర రన్‌కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 31వ ఓవర్ వేస్తున్న కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్ బౌలింగ్‌లో స్టైకింగ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేసి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమిమ్ కూడా క్రీజు వదిలి ముందుకు పరిగెత్తాడు. ఇంతలో నీషమ్ చాకచక్యంగా బంతిని వికెట్లవైపు తన్నాడు. అది నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేసింది. క్రీజులోకి చేరుకోవడం దేవుడెరుగు.. కనీసం వెనక్కి తిరిగేందుకు కూడా తమిమ్‌కు అవకాశం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. తమిమ్ తరువాత మిథున్(72) తప్ప మరో బ్యాట్స్‌మన్ ఎవరూ చెప్పుకొదగ్గ స్కోరు చేయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Krunal Pandya: కృనాల్ ఖాతాలో పలు రికార్డులు దుమ్మురేపిన షఫాలీ వర్మ.. Neesham through on goal! It's out. @JimmyNeesh with some fine footwork to break the @BCBtigers partnership. 133/3 now in thee 31st over as the players have a drink. Tamim Iqbal out for 78. Follow play LIVE with @sparknzsport #NZvBAN pic.twitter.com/0mmjguWNYd — BLACKCAPS (@BLACKCAPS) March 23, 2021 -
'ఆకాశ్.. ముందు మీ స్ట్రైక్‌రేట్ చూసుకోండి'
దుబాయ్ : కివీస్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్.. భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్‌చోప్రా మధ్య మాటల యుద్దం ఆసక్తికరంగా సాగింది. నీషమ్ స్థానం గురించి ఆకాశ్ చోప్రా ప్రశ్నించడం పట్ల దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున జిమ్మీ నీషమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. నీషమ్ సెప్టెంబర్ 27న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. తరువాత అక్టోబర్ 1న ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడాడు. అయితే నీషమ్ ఆడిన రెండు మ్యాచ్‌లు కింగ్స్ ఓడిపోయింది.. దీంతో నీషమ్‌కు బ్యాడ్ ఎంట్రీగా మారింది. (చదవండి : చాలా కష్టంగా ఉంది.. ధోనీకేమైంది?) ఆర్ఆర్తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ దిగి 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు.. బ్యాటింగ్‌లోనూ 8 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఆకాశ్ చోప్రా నీషమ్ ఎంపికను తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీషమ్ స్థానంలో 2018 నుంచి కింగ్స్ జట్టుతో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను ఆడిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. 'జిమ్మీ నీషమ్‌ను ఒక విదేశీ ఆటగాడిగా.. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తాడని కింగ్స్ జట్టులోకి తీసుకుంది. కానీ ఒక బౌలర్‌గా నీషమ్ అటు పవర్‌ప్లేలో లేదా డెత్ ఓవర్లలో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. మంచి ఫినిషర్ అని పేరున్న నీషమ్ బ్యాటింగ్‌లోనూ టాప్ 5లోనూ కనిపించడు. మరి అలాంటప్పుడు కింగ్స్ పంజాబ్ జట్టు అతన్ని ఎందుకు ఆడిస్తున్నట్టు.. వాళ్లు మ్యాచ్ విన్నర్ అని భావించి ఆడిస్తున్న నీషమ్ సరైన ఆటగాడు కాదు. సరిగ్గా చెప్పాలంటే కింగ్స్ జట్టు సరైన టీమ్‌ను ఎంపిక చేసుకోవడం లేదు. ముజీబ్ లాంటి మిస్టరీ స్పిన్నర్‌ను తుది జట్టులో ఆడించకపోవడం పట్ల కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. అంటూ తెలిపాడు. అయితే చోప్రా వ్యాఖ్యలకు జిమ్మీ నీషమ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. చోప్రా టీ20 ప్రదర్శన.. అతని పూర్ స్ట్రైక్‌రేట్.. సగటును చూపిస్తూ ట్వీట్ చేశాడు. ఆకాశ్ చోప్రా తన కెరీర్లో మొత్తం 21 టీ20లు ఆడి 91 స్ట్రైక్‌రేట్‌తో 18.55 సగటుతో 334 పరుగులు చేశాడు.'90 స్ట్రైక్‌రేట్.. 18.5 సగటుతో ఎవరైనా మ్యాచ్‌లను గెలిపించగలరా.. ముందు మీ ఆటతీరు చూసుకొండి.. ఆ తర్వాత కామెంట్ చేయండి 'అంటూ కౌంటర్ ఇచ్చాడు. (చదవండి : ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా) అయితే ఆకాశ్ చోప్రా వెంటనే స్పందిస్తూ.. ' నీషమ్.. నువ్వు చెప్పింది నిజమే.. అందుకే ఆ తర్వాత నన్నెవరు కొనుగోలు చేయలేదు.. ఆడించలేదు. అందుకే వేరే రూపంలో డబ్బు సంపాదిస్తున్నాను. నా ఆటకు సంబంధించిన గణాంకాలను గుర్తించినా మీతో పోల్చనందుకు సంతోషమే. కనీసం ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లైనా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా. అంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 4న సీఎస్కేతో ఆడనుంది. -
పాక్ అభిమానికి దిమ్మతిరిగే రిప్లై
కరాచీ: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీటర్లో ఆసక్తికర పోస్ట్‌లే కాకుండా, అదే తరహాలో రిప్లైలు ఇవ్వడంలో నీషమ్‌ది వినూత్న శైలి. తాజాగా ఒక పాకిస్తాన్ క్రికెట్ అభిమానికి నీషమ్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. ట్వీటర్లో నీషమ్‌ను ట్రోల్ చేసిన అలీ హైదర్ అనే పాక్ అభిమాని.. ‘మీరు ఎందుకు ఐపీఎల్ మాత్రమే ఆడతారు.. పీఎస్ఎల్ ఎందుకు ఆడరు?’ అని ప్రశ్నించాడు. ఇంకో అడుగు ముందుకేసిన సదరు అభిమాని ‘మీకు ఐపీఎల్ డబ్బుతో పాటు ఫేమ్‌ను కూడా తెచ్చుపెడుతుంది కదా.. అందుకేనా ఐపీఎల్‌కు ప్రాధాన్యం’ అని చమత్కరించాడు.(చదవండి:సీఎస్కే చేసిన పొరపాటు అదేనా?) దీనికి నీషమ్ అవుననే సమాధానాన్ని చెప్పకనే చెప్పేస్తూ.. ‘ దాంతో పాటు పీఎస్ఎల్ అనేది మా సమ్మర్ సీజన్లోనే ఆరంభమవడం కూడా కారణం కావొచ్చు కదా బాస్’ అంటూ పాక్ అభిమానికి రిప్లై ఇచ్చాడు. అంటే పీఎస్ఎల్ జరిగే షెడ్యూల్ మారితే తాను ఆడటానికి ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చనే సమాధానాన్ని నీషమ్ ఇచ్చాడు. దాంతో ఆ అభిమాని చేసేది లేక ఇక తిరిగి ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున నీషమ్ ఆడుతున్నాడు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో నీషమ్‌ను 50 లక్షల రూపాయల కనీస ధరకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నీషమ్ ఆడగా, ఈ సీజన్లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. కాగా, ఈసారి పలువురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. నీషమ్ పంజాబ్‌కు లూకీ ఫెర్గ్యూసన్ కేకేఆర్‌కు ఆడుతుండగా, మెక్‌లాన్‌గెన్, ట్రెంట్ బౌల్ట్‌లు ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. మిచెల్ సాంత్నార్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి) -
‘ముంబై మోర్ పాపులేషన్‌పై’ నీషమ్ ఇలా..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం చెప్పనక్కర్లేదు. ప్రతీ దానికి కాస్త వెటకారం జోడించి తన ట్వీట్లో రిప్లైలు ఇవ్వడం మనోడికి అలవాటు. గత కొంతకాలంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నీషమ్ కూడా తన ట్వీటర్ అకౌంట్లో సెటైరికల్ కామెంట్స్ కనిపించడం లేదు. అయితే తాజాగా మనోడికి పని కల్పించారు క్రికెట్ ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే.. తమ దేశం కరోనా ఫ్రీ కంట్రీగా మారినందుకు కంగ్రాట్స్ చెప్పాడు నీషమ్. కివీస్ ప్రజలు మనో సంకల్పంతో లాక్డౌన్ నిబంధనలు పాటించడంతోనే కరోనా ఫ్రీగా కంట్రీ అయ్యామన్నాడు. ఇది ఒక గొప్ప ప్రణాళిక, సమష్టి కృషితోనే సాధ్యమైందని ట్వీట్లో పేర్కొన్నాడు. (‘నన్ను, అంపైర్‌ను చంపుతామన్నారు’) అయితే దీనికి ఒక క్రికెట్ అభిమాని స్పందించాడు. న్యూజిలాండ్ పాపులేషన్ 4 మిలియన్లే. మీకంటే ముంబై అత్యధిక జనాభాను కల్గిఉంది’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి నీషమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఒక వీడియో రూపంలో అంతేనని బదులిచ్చాడు. న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారితే, ముంబై ఇంకా కరోనాతో కొట్టుమిట్టాడుతుందనే అర్థం వచ్చేలా వీడియోను ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. కరోనా పుట్టిన చైనాలో నమోదైన కేసులు కంటే మహారాష్ట్రలోనే కరోనా కేసులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో సోమవారం నాటికి 85వేల కరోనా కేసులు ఉండగా, ఒక్క ముంబైలో 48వేలకు పైగా కేసులున్నాయి. ఇక న్యూజిలాండ్‌లో గత 17 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దాదాపు వారం రోజులుగా చూస్తే ఒకే ఒక్క కరోనా యాక్టివ్ కేసు ఉంది. దాంతో న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీ అయ్యింది. (‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’) Coronavirus free NZ! Congratulations everyone 😁 Once again those great kiwi attributes: planning, determination and teamwork do the job 🎉 — Jimmy Neesham (@JimmyNeesh) June 8, 2020 https://t.co/66nm45M9Ao pic.twitter.com/5DldZqKS4M — Jimmy Neesham (@JimmyNeesh) June 8, 2020 -
కష్ట కాలంలోనూ... నవ్వుతూ బతకాలిరా...
హాస్యచతురతకు మారుపేరైన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కరోనా సమయంలోనూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నాడు. ‘కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడే నేను సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తా. తాజా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాంటి క్షణాలను ఏదో రోజు అధిగమిస్తాం. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అన్నీ ముగిసిపోయిన తర్వాత మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయి’ అని నీషమ్ భావోద్వేగంతో చెప్పాడు. మరోవైపు గత ఏడాది ప్రపంచ కప్ ఫైనల్ పరాజయం తనను ఇంకా బాధిస్తోందని ఈ కివీస్ ఆల్‌రౌండర్ అన్నాడు. నాడు సూపర్ ఓవర్లో నీషమ్ 13 పరుగులు చేసినా బౌండరీ లెక్కతో జట్టు ఓడింది. ‘కాలం గడిచేకొద్దీ బాధ తగ్గుతుందని అంటారు. కానీ నాలో ఇప్పటికే ఆ బాధ మిగిలి ఉంది. అది తగ్గేందుకు మరికొన్నేళ్లు పడుతుందేమో’ అని నీషమ్ అన్నాడు. -
‘కాగితం, కత్తెర, బండ?’
మౌంట్ మాంగనీ : టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి వన్డేల్లో కేఎల్ రాహుల్-జిమ్మీ నీషమ్‌ల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. రాహుల్ బ్యాటింగ్ సందర్భంగా పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న నీషమ్ అడ్డుకున్నాడని రాహుల్ ఆరోపించాడు. అంతేకాకుండా ఇద్దరి మద్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎంటర్ అయి వివాదాన్ని చక్కదిద్దాడు. మ్యాచ్ అనంతరం ఈ సంఘటనకు సంబంధించి ఓ ఫోటోను నీషమ్ షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కామెంట్ పెట్టాడు. రాహుల్, నీషమ్, అంపైర్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కాగితం, కత్తెర, బండ? అంటూ క్యాప్షన్ జత చేశాడు. అంతేకాకుండా ఏప్రిల్ కోసం కొన్ని పరుగులు దాచి ఉంచడం మరువకు అంటూ రాహుల్‌ను ఉద్దేశించి నీషమ్ ట్వీట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాహుల్, నీషమ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే. ఈ తరుణంలోనే నీషమ్ పై విధంగా ట్వీట్ చేశాడు. ఇక అప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికీ పరువు కోసం ఆడిన మ్యాచ్‌లో టీమిండియా మరోసారి ఘోర ఓటమి చవిచూసింది. బౌలింగ్, పీల్డింగ్ వైఫల్యంతో టీమిండియా 31ఏళ్ల తర్వాత వన్డేల్లో వైట్ వాష్ అయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సేనపై ఐదు వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రాహుల్ సెంచరీతో ఆదుకున్నాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 112 పరుగులు సాధించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ సిరీస్ ఆద్యంతం తన పరుగుల ప్రవాహంతో కివీస్‌కు విజయాన్నందించిన రాస్ టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. Paper, scissors, rock? 😂 pic.twitter.com/PFrK8ZcF9k — Jimmy Neesham (@JimmyNeesh) February 11, 2020 Don’t forget to save some runs for April aye @klrahul11 ? 👏 — Jimmy Neesham (@JimmyNeesh) February 11, 2020 చదవండి: ‘క్రికెట్ దేవుడిని మరోసారి గెలిపించండి’ సెంచరీతో రాహుల్ రికార్డుల మోత..! -
సోథినే నా ఫేవరెట్ భారత క్రికెటర్!
వెల్లింగ్టన్: ఇటీవల సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉంటున్న క్రికెటర్లలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్ ఒకడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత నీషమ్.. ఎవ్వరూ క్రీడల్ని ఎంచుకోవద్దని యువతకు పిలుపినిచ్చి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఛలోక్తి విసిరి విమర్శల పాలయ్యాడు. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. తొలి యాషెస్ ఇన్నింగ్స్‌లో కోహ్లి కంటే బర్న్స్ ఎక్కువ పరుగులు చేశాడని చమత్కరించాడు. ఇది కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో విమర్శల ఎదుర్కొన్నాడు. తాజాగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు నీషమ్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నీషమ్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ నిర్వహించగా, అతనికి మీ ఫేవరెట్ భారత క్రికెటర్ ఎవరు’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కోహ్లిని కానీ, ధోనిని కానీ ఎంపిక చేసుకుంటాడని సదరు అభిమాని భావించాడు. ఇందుకు నీషమ్ కొంటెగా సమాధానమిస్తూ.. భారత్ సంతతికి చెందిన ఇష్ సోథీనే తన ఫేవరెట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. భారత మూలాలున్న ఇష్ సోథీ న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దాంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై అభిమానాన్ని చూపెడుతూ.. తన ఫేవరెట్ క్రికెటర్‌గా సోథీని ఎంచుకున్నాడు నీషమ్. అంతకుముందు యాషెస్ సిరీస్ మూడో టెస్టులో వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్‌ను ప్రశంసించాడు నీషమ్. ఇక్కడ కూడా స్టోక్స్ న్యూజిలాండ్ దేశస్తుడనే విషయాన్ని ప్రస్తావించాడు. తమ దేశానికి చెందిన స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడంటూ ట్వీట్ చేశాడు. -
‘డియర్ భారత్ ఫ్యాన్స్.. ఫైనల్ టికెట్లు అమ్మండి’
మాంచెస్టర్ : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొన్న భారత అభిమానులు వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఆదివారం జరిగే ఈ మెగా సంగ్రామంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు అమితుమీ తెల్చుకోనున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆధ్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టుకు ఫైనల్ బెర్త్ ఖాయమని ఇటు అభిమానులు, అటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావించారు. దీంతో భారీ ఎత్తున్న ఫైనల్ మ్యాచ్‌కు భారత అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. కానీ కోహ్లిసేన పోరాటం సెమీస్‌తోనే ముగియడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు రాని భారత అభిమానులు ఆ టికెట్లను తిరిగి అమ్మివేయాలని నిషమ్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ‘డియర్ భారత క్రికెట్ అభిమానులారా.. మీరు ఫైనల్ మ్యాచ్‌కు రాకపోతే దయచేసి ఆ టికెట్లను అధికారిక ఫ్లాట్‌ఫామ్ ద్వారా తిరిగి అమ్మండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికి అనిపిస్తుంది. కానీ దయచేసి సంపన్నులే కాకుండా నిజమైన అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి.’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ పోరులో భారత్ 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. Dear Indian cricket fans. If you don’t want to come to the final anymore then please be kind and resell your tickets via the official platform. I know it’s tempting to try to make a large profit but please give all genuine cricket fans a chance to go, not just the wealthy ❤️ 🏏 — Jimmy Neesham (@JimmyNeesh) July 12, 2019 -
ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్ తీసేశా!
వెల్లింగ్టన్: ఐపీఎల్-12వ సీజన్ ముగిసి నాలుగు రోజులు అయ్యింది. అయినప్పటికీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రనౌటైన తీరుపై అభిమానులు ఇంకా డైలమాలోనే ఉన్నారు. ఆ మ్యాచ్‌లో ధోనిని బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్‌గా ప్రకటించినట్లయితే సీఎస్కేనే కప్ సొంతం చేసుకునేదని, థర్డ్ అంపైర్ తప్పిదం వల్లే మిస్టర్ కూల్ రనౌట్ అయ్యాడనేది ఆ జట్టు అభిమానుల వాదన. కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదిలా ఉంచితే, అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషమ్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి సీఎస్కే అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐపీఎల్లో నీషమ్ పాల్గొనుకున్నా ఈ సీజన్ ను ఫాలో అయినట్టున్నాడు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోని రనౌట్ వివాదం అతని దృష్టికి వెళ్లింది. దీంతో ఈ రనౌట్ పై తన అభిప్రాయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. ‘అది కచ్చితంగా రనౌటే.. థర్డ్ అంపైర్ నిర్ణయం నన్ను ఏమీ విస్మయానికి గురి చేయలేదు. కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్ గా వుండటం తనకెంతో నచ్చింది. నాకు ధోని అంటే చాలా ఇష్టం. కానీ అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా వుంటోంది’ అంటూ ధోని రనౌట్ ఫొటోను ట్వీట్ చేశాడు. అది కాస్తా చెన్నై అభిమానులకు నచ్చకపోవడంతో అదే ట్విట్టర్ ద్వారా నిషమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు. (ఇక్కడ చదవండి: ‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్‌గా ప్రకటించారు’) 'నువ్వో అంతర్జాతీయ క్రికెటర్ అంటే మాకు నమ్మబుద్ది కావడం లేదు. అంపైర్లకే కాదు నిషమ్‌ను కూడా ఎవరో మేనేజ్ చేసినట్లున్నారు' అంటూ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ ట్వీట్ కు అత్యధికంగా నెగెటివ్ కామెంట్స్ వస్తుండటంతో నీషమ్ దాన్ని తొలగించాడు. ఆ ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందోకూడా వివరణ ఇచ్చుకున్నాడు. 'ఎంఎస్ ధోని రనౌట్ గురించి చేసిన ట్వీట్‌ను తొలిగించానని, తన అభిప్రాయాన్ని మార్చుకుని ఈ పని చేయలేదని తెలిపాడు. మరి ఎందుకలా చేశానంటే.. ‘రోజూ 200 పైగా అధికంగా చెత్త కామెంట్స్ రావడం...వాటిని చూసి నేను అనారోగ్యానికి గురవడం జరిగింది. నేను వాటిని అసలు కేర్ చేయలేదు. దయచేసి మళ్లీ నాకు ఈ విషయం గురించి ట్వీట్ చేయకండి. హేవ్ ఏ గుడ్ డే’ అంటూ ట్వీట్ చేశాడు. -
శతక్కొట్టిన గప్టిల్
మౌంట్ మాంగనీ: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (139 బంతుల్లో 138; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ జిమ్మీ నిషామ్ (13 బంతుల్లో 47; 6 సిక్సర్లు) సిక్సర్ల జడివాన కురిపించడంతో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 45 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (74 బంతుల్లో 76; 6 ఫోర్లు), రాస్ టేలర్ (37 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో 14 సిక్స్‌లు నమోదయ్యాయి. వన్డేల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్న గప్టిల్ 6000 పరుగుల మైలు రాయిని దాటాడు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 326 పరుగుల వద్ద ఆలౌటైంది. కుశాల్ పెరీరా (86 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఓపెనర్లు డిక్వెలా (50 బంతుల్లో 76; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (62 బంతుల్లో 43; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. గప్టిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. శనివారం రెండో వన్డే కూడా ఇక్కడే జరుగుతుంది. 6, 6, 6, 6, 2 (+నోబాల్), 6, 1 ఆరంభం నుంచి గప్టిల్ ధాటి కొనసాగగా... చివర్లో జిమ్మీ నిషామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47వ ఓవర్ చివరి బంతికి క్రీజ్‌లోకి దిగిన అతను ఒక్క ఓవర్లోనే 34 పరుగులు బాది జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. తిసార పెరీరా వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో నిషామ్ ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. వరుస 4 బంతుల్లో 4 సిక్సర్ల తర్వాత నోబాల్‌కు తోడు 2 పరుగులు తీయగా, మరుసటి బంతికి మళ్లీ సిక్స్ కొట్టాడు. పెరీరా లెంగ్త్ మార్చిన వేసిన చివరి బంతికి కూడా భారీ సిక్సర్‌కే ప్రయత్నించినా మిడ్ వికెట్ దిశగా ఒక పరుగే వచ్చింది. -
కివీస్‌కు మరో ఎదురుదెబ్బ
కాన్పూర్:ఇప్పటికే భారత్ తో టెస్టు సిరీస్‌కు టిమ్ సౌతీ దూరం కావడంతో సతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ట్రైనింగ్ సెషన్లో నీషామ్ పక్కటెముకలు పట్టేయడంతో గురువారం కాన్పూర్ లో ఆరంభమయ్యే మొదటి టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు న్యూజిలాండ్ కోచ్ హెస్సెన్ వెల్లడించాడు. 'గత కొన్ని రోజుల నుంచి నీషామ్ సౌకర్యవంతంగా లేడు. అతను పక్కటెముల గాయంతో సతమవుతున్నాడు. ఇది దీర్ఘకాలిక గాయం కాదు. అయినప్పటికీ తొలి టెస్టుకు అతన్ని తుది జట్టులో తీసుకోవడం లేదు. అతని స్థానంలో మరో ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు'అని హెస్సెన్ పేర్కొన్నాడు. అంతకుముందు న్యూజిలాండ్ ప్రధాన పేసర్ సౌతీ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్లో సౌతీ ఎడమ కాలికి గాయం కావడంతో అతను టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. -
నీషామ్, లాథమ్‌లకు చోటు
వెల్లింగ్టన్ : భారత్‌తో రెండో టెస్టుకు ఆల్‌రౌండర్ జిమ్మీ నీషామ్, యువ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్‌లకు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టుకు ముందు బార్లో తప్పతాగి కొట్టుకున్న రైడర్, బ్రేస్‌వెల్‌లకు సెలెక్టర్లు ఉద్వాసన పలికి జట్టులో రెండు మార్పులు చేశారు. వెల్లింగ్టన్లో ఈ నెల 14 నుంచి 18 వరకు రెండో టెస్ట్ జరగనుంది. సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. మరోవైపు రైడర్, బ్రేస్‌వెల్‌లకు న్యూజిలాండ్ బోర్డు భారీగా జరిమానా కూడా విధించింది. ‘పచ్చి’క సిద్ధం భారత్‌తో రెండో టెస్టు కోసం వెల్లింగ్టన్లో పేసర్లకు సహకరించే వికెట్ తయారు చేశారు. ‘పచ్చికతో ఉన్న ఈ పిచ్‌ను చూస్తే భారత ఆటగాళ్లు ఏమాత్రం సంతోషించరు. టాస్ గెలిచిన జట్టులో పేసర్లకు పండగే’ అని క్యూరేటర్ చెప్పారు.