బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో న్యూజిలాండ్ ముగించింది. మౌంట్ మంగ్‌నూయ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో(డీఎల్‌ఎస్) కివీస్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో న్యూజిలాండ్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ బౌలర్ల దాటికి 110 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సౌథీ, మిల్నే, సీర్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ ఇన్నింగ్స్ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు.
న్యూజిలాండ్ కూడా స్వల్ప లక్ష్య చేధనలో కాస్త తడబడింది. 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫిన్ అలెన్(38), నీషమ్(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోర్‌ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో
Comments
Please login to add a commentAdd a comment