న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్‌ | Kane Williamson, Kyle Jamieson withdrawn from T20I series owing to fitness concerns | Sakshi
Sakshi News home page

BAN vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్‌

Published Fri, Dec 22 2023 11:18 AM | Last Updated on Fri, Dec 22 2023 12:24 PM

Kane Williamson, Kyle Jamieson withdrawn from T20I series owing to fitness concerns - Sakshi

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, స్టార్‌ పేసర్‌ కైల్ జేమీసన్ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని శుక్రవారం న్యూజిలాండ్ క్రికెట్ దృవీకరించింది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ క్రికెట్‌ తొలుత ప్రకటించిన జట్టులో విలియమ్సన్‌, జేమీసన్‌ ఇద్దరూ ఉన్నారు. అయితే మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్‌కు మరి కొన్ని రోజులు విశ్రాంతి అవరసమని వైద్యులు సూచించారు.

ఈ క్రమంలోనే బంగ్లాతో సిరీస్‌ నుంచి కేన్‌ మామ తప్పుకున్నాడు. జేమీసన్‌ కూడా తన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇక విలియమ్సన్‌ స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ భర్తీ చేసిది. అదే విధంగా జమీసన్‌ స్ధానంలో పేసర్‌ ఢఫీ జట్టులో వచ్చాడు. కాగా విలయమ్సన్‌ తప్పుకోవడంతో మిచెల్‌ శాంట్నర్‌కు జట్టు పగ్గాలను కివీస్‌ సెలక్టర్లు అప్పగించారు. డిసెంబర్‌ 27న నేపియర్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్‌ టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement