వైరల్‌: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌‌‌‌ | Brilliant Footwork By Jimmy Neesham To Run Out Tamim Iqbal Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌‌‌‌‌

Published Wed, Mar 24 2021 10:18 AM | Last Updated on Wed, Mar 24 2021 11:49 AM

Brilliant Footwork By Jimmy Neesham To Run Out Tamim Iqbal Became Viral - Sakshi

క్రైస్ట్‌చర్చి: న్యూజిల్యాండ్-బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఓ విచిత్రమైన రనౌట్‌కు బలయ్యాడు. అప్పటికే 78 పరుగులతో ఊపుమీదున్న తమిమ్ అనవసర రన్‌కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 31వ ఓవర్ వేస్తున్న కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్ బౌలింగ్‌లో స్టైకింగ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేసి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమిమ్ కూడా క్రీజు వదిలి ముందుకు పరిగెత్తాడు.

ఇంతలో నీషమ్ చాకచక్యంగా బంతిని వికెట్లవైపు తన్నాడు. అది నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేసింది. క్రీజులోకి చేరుకోవడం దేవుడెరుగు.. కనీసం వెనక్కి తిరిగేందుకు కూడా తమిమ్‌కు అవకాశం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. తమిమ్ తరువాత మిథున్(72) తప్ప మరో బ్యాట్స్‌మన్ ఎవరూ చెప్పుకొదగ్గ స్కోరు చేయలేదు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసి గెలిచింది.
చదవండి:
Krunal Pandya: కృనాల్‌ ఖాతాలో పలు రికార్డులు
దుమ్మురేపిన షఫాలీ వర్మ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement