runout
-
Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు
జైపూర్: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్ ప్రపంచకప్ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ తీరును క్రికెట్ టీమ్‌తో పోల్చారు. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు. వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్‌లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం.. రాజస్తాన్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్‌కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్‌కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేపర్ లీక్ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్‌మెన్: ప్రధాని మోదీ
Rajasthan Elections: క్రికెట్‌కు ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విమర్శలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్.. తమను తామే రనౌట్ చేసుకునే క్రికెట్ జట్టు లాంటిదని, తమ బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు రనౌట్ చేసుకోవడానికి ఐదేళ్లు ప్రయత్నించారని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ చురు జిల్లా తారానగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అనేవి పరస్పర శత్రవులని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉన్న సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉన్న సంబంధం లాంటిదన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విషయంలో కాంగ్రెస్ మాజీ సైనికులను దశాబ్దాలుగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాజస్థాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అదుపుతప్పాయని విమర్శించారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు -
రన్ అవుట్ చేయకుండా గొడవ చూస్తున్నాడు వీడు ఎవడు రా బాబు ....
-
వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్
క్రైస్ట్‌చర్చి: న్యూజిల్యాండ్-బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ ఓ విచిత్రమైన రనౌట్‌కు బలయ్యాడు. అప్పటికే 78 పరుగులతో ఊపుమీదున్న తమిమ్ అనవసర రన్‌కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 31వ ఓవర్ వేస్తున్న కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్ బౌలింగ్‌లో స్టైకింగ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేసి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమిమ్ కూడా క్రీజు వదిలి ముందుకు పరిగెత్తాడు. ఇంతలో నీషమ్ చాకచక్యంగా బంతిని వికెట్లవైపు తన్నాడు. అది నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేసింది. క్రీజులోకి చేరుకోవడం దేవుడెరుగు.. కనీసం వెనక్కి తిరిగేందుకు కూడా తమిమ్‌కు అవకాశం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. తమిమ్ తరువాత మిథున్(72) తప్ప మరో బ్యాట్స్‌మన్ ఎవరూ చెప్పుకొదగ్గ స్కోరు చేయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Krunal Pandya: కృనాల్ ఖాతాలో పలు రికార్డులు దుమ్మురేపిన షఫాలీ వర్మ.. Neesham through on goal! It's out. @JimmyNeesh with some fine footwork to break the @BCBtigers partnership. 133/3 now in thee 31st over as the players have a drink. Tamim Iqbal out for 78. Follow play LIVE with @sparknzsport #NZvBAN pic.twitter.com/0mmjguWNYd — BLACKCAPS (@BLACKCAPS) March 23, 2021 -
ఊహించని రికార్డు
సెంచూరియన్: టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిరాశపరిచాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడు అవుటైన విధానం అభిమానులకు మింగుడుపడటం లేదు. నిలకడకు చిరునామాగా పేరుగాంచిన పుజారా రెండు ఇన్నింగ్స్‌లోనూ అనూహ్యంగా రనౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో ఊహించని రికార్డు అతని పేరిట నమోదైంది. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ రనౌటైన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు 25 మంది ఈవిధంగా అవుటయ్యారు. ఎంతో సంయమనంతో ఆచితూచి ఆడే పుజారా రెండుసార్లు కీలక సమయంలో అవుట్ కావడంతో ఆ ప్రభావం జట్టుపై పడింది. అడ్డుగోడగా నిలబడే ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ తొందరగా పెవిలియన్ చేరడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ పుజారా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 30 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టెస్టులోనైనా అతడు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించిన పుజారా రనౌట్‌గా నిష్ర్కమించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్ వేసిన తొమ్మిదో ఓవర్ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్ మీదుగా ఆడాడు. అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు. -
రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే...
బెంగళూరు: టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది. ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్ చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.