Photo Courtesy: Twitter
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది కింగ్స్ పంజాబ్(పంజాబ్ కింగ్స్) తరఫున ఆడిన నీషమ్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. దాంతో వేలంలో నీషమ్‌ను ముంబై తీసుకుంది. ఇంకా ముంబై ఇండియన్స్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని నీషమ్‌కు సరైన హార్డ్ హిట్టింగ్ సామర్థ్యం లేనికారణంగానే ఇంకా అతని అవకాశం రాలేదని ఒక ట్వీటర్ యూజర్ ఎద్దేవా చేశాడు.
‘నీషమ్.. నువ్వు నీ హార్డ్ హిట్టింగ్ సామర్థ్యం పెంచుకో. దానిపై ఫోకస్ పెట్టు. నువ్వు వన్డేలకు పెర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్‌వి. టీ20ల్లో నీస్థానాన్ని పదిలం చేసుకోవాలంటే హార్డ్ హిట్టింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. నిన్ను రిజర్వ్ బెంచ్‌లో చూడలేకపోతున్నాం. అది నిరాశపరుస్తోంది’ అని అన్నాడు. దానికి నీషమ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. టీ20 క్రికెట్‌లో తన యావరేజ్, స్టైక్‌రేట్ ఎలా ఉందో ఇమేజ్ పోస్ట్ చేసి మరీ సదరు యూజర్‌కు సమాధానమిచ్చాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన రిథమ్‌ను అందుకోవడానికి తంటాలు పడుతోంది., డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ గ్యాంగ్.. తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఇక్కడ చదవండి:
అందుకే ఆఖరి ఓవర్ స్టోయినిస్ చేతికి: పంత్
Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను
Lol. https://t.co/8KGpADwQ2W pic.twitter.com/Fan2I1ECDh
— Jimmy Neesham (@JimmyNeesh) April 28, 2021
Comments
Please login to add a commentAdd a comment