చహల్‌ చేసిన పనికి షాక్‌ తిన్న క్రికెటర్లు | IPL 2022: Buttler-Neesham Shocks After Chahal Says Come Open With-Me | Sakshi
Sakshi News home page

IPL 2022: చహల్‌ చేసిన పనికి షాక్‌ తిన్న క్రికెటర్లు

Published Fri, Mar 25 2022 3:40 PM | Last Updated on Fri, Mar 25 2022 3:52 PM

IPL 2022: Buttler-Neesham Shocks After Chahal Says Come Open With-Me - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆరంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలిఉంది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అభిమానులకు ఆనందాన్ని పెంచే పనిలో పడ్డారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అతను అన్న మాట రెండు అర్థాలకు దారి తీయడంతోనే ఇక్కడ ఫన్‌ జనరేట్‌ అయింది.

విషయంలోకి వెళితే.. గురువారం ప్రాక్టీస్‌ సమయంలో జాస్‌ బట్లర్‌, చహల్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. ఏదో విషయమై ఇద్దరు సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో చహల్‌.. జోషీ బాయ్‌ కమ్‌ ఓపెన్‌ విత్‌ మి అని పేర్కొన్నాడు. దీంతో షాకైన బట్లర్‌.. అరె చహల్‌ భయ్యా ఏంటిది అంటూ తలకు చేతులు పెట్టడం కెమెరాలకు చిక్కింది. వీరి పక్కనే ఉన్న జిమ్మీ నీషమ్‌ కూడా చహల్‌ వ్యాఖ్యలపై షాక్‌ తిన్నాడు.

అయితే బట్లర్‌ను చహల్‌ అడిగింది ఓపెనింగ్‌ గురించి. బట్లర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తానని చెప్పాడు.. దానినే ఇన్‌డైరెక్ట్‌గా ''ఓపెన్‌ విత్‌ మి'' అని అన్నాడు. కాగా చహల్‌ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు కూడా వినూత్న రీతిలో స్పందించారు. ఎంతైనా చహల్‌ కదా.. ఆ మాత్రం ఉండాలి.. ఒక 10వేల ట్వీట్స్‌ చేయ్‌.. అప్పుడు నీతో ఓపెన్‌ అవుతాడు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారైనా కప్పు కొడుతుందా అనేది చూడాలి. మొదటి సీజన్‌(2008లో) విజేత మినహా రాజస్తాన్‌ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేదు. సంజూ శాంసన్‌ నేతృత్వంలో ఈసారి జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. మార్చి 29న సన్‌రైజర్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు..?!

IPL 2022- Ravindra Jadeja: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement