Courtesy: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్‌లో మరో సెంచరీ సాధించాడు. అదేంటి ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బట్లర్ హాఫ్ సెంచరీ కదా చేశాడు అనే డౌట్ రావొచ్చు. కానీ బట్లర్ సెంచరీ పూర్తి చేసింది సిక్సర్ల విషయంలో. అవును ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనే బట్లర్ ఐపీఎల్‌లో వంద సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వంద సిక్సర్లు పూర్తి చేయడానికి ఐపీఎల్‌లో 69 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న 26వ ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
ఇక ఈ జాబితాలో క్రిస్ గేల్(357 సిక్సర్లు) తొలి స్థానంలో ఉండగా.. ఏబీ డివిలియర్స్(251 సిక్సర్లు), రోహిత్ శర్మ(232 సిక్సర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 222 సిక్సర్లతో ఎంఎస్ ధోని నాలుగు, పొలార్డ్ 215 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లి(212 సిక్సర్లు), సురేశ్ రైనా(203 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(201 సిక్సర్లు) వరుసగా ఉన్నారు.
ఇక బట్లర్ తన భీకర ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ చివరి వరకు నిలిచి ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో హెట్‌మైర్‌తో కలిసి 42 పరుగులు పిండుకున్న బట్లర్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం.
బట్లర్ 70 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి
చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు'
Comments
Please login to add a commentAdd a comment