''క్యాచెస్ విన్ మ్యాచెస్'' అనే సామెత క్రికెట్‌లో సుపరిచితమే. ఎంత తక్కువ స్కోరు చేసినప్పటికి మెరుగైన ఫీల్డింగ్, క్యాచ్‌లతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయొచ్చు. అయితే ఆ అవకాశాన్ని ఆర్‌సీబీ మిస్ చేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో హర్షల్ పటేల్ వేసిన బంతిని బట్లర్ షాట్ ఆడబోయే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బట్లర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి కీపర్ కార్తిక్ వైపు వెళ్లింది. కార్తిక్ క్యాచ్ తీసుకున్నట్లే తీసుకొని మిస్ చేశాడు. జాస్ బట్లర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అతను వదిలేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు.
ఆ సమయంలో 66 పరుగులు చేసిన బట్లర్.. ఔట్ నుంచి తప్పించుకొని ఏకంగా సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. కార్తిక్ ఒకవేళ ఆ క్యాచ్‌ను అందుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరొలా ఉండేది. ఎందుకంటే రాజస్తాన్ బ్యాటింగ్‌కు బట్లర్ పెద్ద బలం.. బలహీనత. అతను తక్కువ స్కోరుకు వెనుదిరిగిన సందర్బాల్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి చవిచూసింది. ఉదాహరణకు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1లో బట్లర్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి చవిచూసి క్వాలిఫయర్-2 ఆడాల్సి వచ్చింది. క్వాలిఫయర్-2లో ఆర్‌సీబీపై గెలిచిన రాజస్తాన్ ఫైనల్లో ప్రవేశించింది. కార్తిక్ క్యాచ్ వదిలేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''జట్టు గ్రహచారమే బాగాలేదు.. ఎవర్ని నిందించినా వ్యర్థమే అవుతుంది''.. ''ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే కార్తిక్ క్యాచ్ పట్టినా లాభం లేదు..''అంటూ పేర్కొన్నారు.
కాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్సీబీ కథ క్వాలిఫయర్-2లో ముగిసింది. ఎలిమినేటర్ గండం దాటి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టిన ఆర్సీబీకి రాజస్తాన్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుంది అనుకుంటే ఆర్‌సీబీ మరోసారి అభిమానులను నిరాశలో ముంచెత్తింది. ఇక క్వాలిఫయర్-2లో నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ మే29న(ఆదివారం) గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది.
చదవండి: Trent Boult: అడగ్గానే ఇచ్చేశాడు.. వైరల్‌గా మారిన రాజస్తాన్ బౌలర్ చర్య
— Cricsphere (@Cricsphere) May 27, 2022
Comments
Please login to add a commentAdd a comment