'ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌' నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ | Girl proposes boy during IPL 2022 match between RCB and CSK Viral | Sakshi
Sakshi News home page

RCB Vs CSK: 'ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌' నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌

Published Wed, May 4 2022 11:25 PM | Last Updated on Wed, May 4 2022 11:33 PM

Girl proposes boy during IPL 2022 match between RCB and CSK Viral - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఒక యువతి అందరూ తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. అందుకు సదరు యువకుడు అంగీకారం తెలపడంతో వెంటనే అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది. ఆ తర్వాత వారిద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకొని సంతోషంలో మునిగిపోయారు. ఈ ఇద్దరు ప్రేమికులను చూస్తుంటే ఆర్‌సీబీకి పెద్ద ఫ్యాన్స్‌లా కనిపించారు.

మ్యాచ్‌ మధ్యలోనే ఈ తతంగమంతా జరగడంతో కెమెరాను అటువైపు తిప్పగా.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా లవ్‌ ప్రపోజల్‌ ఐపీఎల్‌లో కొత్తేం కాదు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే చోటుచేసుకున్నాయి. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో లైవ్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక జంట ముద్దుల్లో మునిగిపోయింది. ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చహర్‌ స్టేడియంలో ఉన్న తన ప్రేయసి వద్దకు లవ్‌ ప్రపోజల్‌ చేయడం అప్పట్లో తెగ వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement