Courtesy: IPL Twitter
ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమ్మర్ సీజన్ అంటే ఎండలు మండిపోవడం సహజం. అందునా ఈసారి సీజన్ ముంబై, పుణే వేదికలుగా జరుగుతున్నాయి. సముద్రం ఒడ్డున ఈ ప్రాంతంలో దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. మ్యాచ్‌లు ఎలాగూ రాత్రుళ్లు జరుగుతున్నాయి కాబట్టి.. వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. అయితే ఎండ వేడిమిని ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు మ్యాచ్ కంటే ప్రాక్టీస్ సమయంలోనే ఎక్కువగా చెమటోడ్చాల్సి వస్తుంది. తాజాగా మ్యాక్స్‌వెల్ ప్రాక్టీస్ అనంతరం తన వెంట తెచ్చుకున్న కంటైనర్‌లో తల పెట్టి నీళ్లతో తడుపుకున్నాడు. ఎండలు భరించలేకనే మ్యాక్సీ ఇలా చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ 10 మ్యాచ్‌ల్లో 228 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గతేడాది సీజన్‌లో 500కు పైగా పరుగులు సాధించి సత్తా చాటిన మ్యాక్సీ అదే స్థాయి ప్రదర్శనను ఈసారి నమోదు చేయలేకపోయాడు. ఇక లీగ్‌లో మొదటి ఏడు మ్యాచ్‌ల్లో మంచి విజయాలు సాధించిన ఆర్‌సీబీ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎనిమిదో మ్యాచ్ నుంచి ఓటములు చవిచూస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములతో 14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ ఐదో స్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న ఆర్‌సీబీకి.. అది గెలిచినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ రన్‌రేట్ మైనస్‌లో ఉండడమే. అటు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌లు నాలుగో స్థానం కోసం పోటీపడడం.. ఆయా జట్ల రన్‌రేట్ ప్లస్‌లో ఉండడం వారికి కలిసొచ్చింది. ఒక రకంగా సీజన్‌లో ఆర్సీబీ చేజేతులా తమ ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయినట్లే. ఇక ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌ను పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
చదవండి: AB De Villiers-Chris Gayle: ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
How to cool off after an intense practice session, @Gmaxi_32 style. 😂🧊 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/MlEJpcGI80
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022
Comments
Please login to add a commentAdd a comment