
PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ రజత్ పాటిధార్ కొట్టిన సిక్స్ ముసలాయన తల పగిలేలా చేసింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ హర్‌ప్రీత్ బార్ వేశాడు. అప్పటికే రన్‌రేట్ పెరిగిపోతుడడంతో రజత్ పాటిధార్ భారీ షాట్లకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదో ఓవర్‌లో పాటిధార్ 102 మీటర్ల భారీ సిక్సర్ సంధించాడు. ఈ సిక్సర్ నేరుగా వెళ్లి, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ ముసలాయన తలపైకి బంతి దూసుకొచ్చింది.
దీంతో ఆయనకు గాయమై రక్తం కారడంతో వెంటనే పక్కనున్నవాళ్లు సేద తీర్చే ప్రయత్నం చేశారు. అయితే మొదట బంతి రూఫ్ టాప్‌ను తాకడంతో బంతిలో వేగం తగ్గినప్పటికి ఎత్తు నుంచి రావడంతో అతనికి కాస్త గట్టిగానే తగిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రజత్ పాటిధార్ మ్యాచ్‌లో 21 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కొట్టిన ఓ భారీ సిక్సర్, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ముసలాయన తల పగలకొట్టింది. ఆ మ్యాచ్‌లో దాదా కొట్టిన సిక్సర్ దెబ్బకు ఆ ఇంగ్లండ్ వృద్ధుడి తల నుంచి రక్తం కారడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్ల వరకు పటిష్టంగానే కనిపించింది. వికెట్లు పడినప్పటికి ఓవర్‌కు 10 పరుగులు చొప్పున రాబట్టారు. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. హర్‌ప్రీత్ బార్, రబాడలు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆర్సీబీపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..!
Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య
— Addicric (@addicric) May 13, 2022
Comments
Please login to add a commentAdd a comment