వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం చెప్పనక్కర్లేదు. ప్రతీ దానికి కాస్త వెటకారం జోడించి తన ట్వీట్‌లో రిప్లైలు ఇవ్వడం మనోడికి అలవాటు. గత కొంతకాలంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నీషమ్ కూడా తన ట్వీటర్ అకౌంట్‌లో సెటైరికల్ కామెంట్స్ కనిపించడం లేదు. అయితే తాజాగా మనోడికి పని కల్పించారు క్రికెట్ ఫ్యాన్స్. అసలేం జరిగిందంటే.. తమ దేశం కరోనా ఫ్రీ కంట్రీగా మారినందుకు కంగ్రాట్స్ చెప్పాడు నీషమ్. కివీస్ ప్రజలు మనో సంకల్పంతో లాక్‌డౌన్ నిబంధనలు పాటించడంతోనే కరోనా ఫ్రీగా కంట్రీ అయ్యామన్నాడు. ఇది ఒక గొప్ప ప్రణాళిక, సమష్టి కృషితోనే సాధ్యమైందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. (‘నన్ను, అంపైర్‌ను చంపుతామన్నారు’)
అయితే దీనికి ఒక క్రికెట్ అభిమాని స్పందించాడు. న్యూజిలాండ్ పాపులేషన్ 4 మిలియన్లే. మీకంటే ముంబై అత్యధిక జనాభాను కల్గిఉంది’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి నీషమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఒక వీడియో రూపంలో అంతేనని బదులిచ్చాడు. న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీగా మారితే, ముంబై ఇంకా కరోనాతో కొట్టుమిట్టాడుతుందనే అర్థం వచ్చేలా వీడియోను ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. కరోనా పుట్టిన చైనాలో నమోదైన కేసులు కంటే మహారాష్ట్రలోనే కరోనా కేసులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో సోమవారం నాటికి 85వేల కరోనా కేసులు ఉండగా, ఒక్క ముంబైలో 48వేలకు పైగా కేసులున్నాయి. ఇక న్యూజిలాండ్‌లో గత 17 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దాదాపు వారం రోజులుగా చూస్తే ఒకే ఒక్క కరోనా యాక్టివ్ కేసు ఉంది. దాంతో న్యూజిలాండ్ కరోనా ఫ్రీ కంట్రీ అయ్యింది. (‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’)
Coronavirus free NZ! Congratulations everyone 😁
— Jimmy Neesham (@JimmyNeesh) June 8, 2020
Once again those great kiwi attributes: planning, determination and teamwork do the job 🎉
https://t.co/66nm45M9Ao pic.twitter.com/5DldZqKS4M
— Jimmy Neesham (@JimmyNeesh) June 8, 2020
Comments
Please login to add a commentAdd a comment