కష్ట కాలంలోనూ... నవ్వుతూ బతకాలిరా... | Humour most important in getting through difficult situations | Sakshi
Sakshi News home page

కష్ట కాలంలోనూ... నవ్వుతూ బతకాలిరా...

Published Sat, Apr 18 2020 5:18 AM | Last Updated on Sat, Apr 18 2020 5:18 AM

Humour most important in getting through difficult situations - Sakshi

జిమ్మీ నీషమ్

హాస్యచతురతకు మారుపేరైన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ కరోనా సమయంలోనూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నాడు. ‘కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడే నేను సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తా. తాజా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాంటి క్షణాలను ఏదో రోజు అధిగమిస్తాం. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అన్నీ ముగిసిపోయిన తర్వాత మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయి’ అని నీషమ్‌ భావోద్వేగంతో చెప్పాడు. మరోవైపు గత ఏడాది ప్రపంచ కప్‌ ఫైనల్‌ పరాజయం తనను ఇంకా బాధిస్తోందని ఈ కివీస్‌ ఆల్‌రౌండర్‌ అన్నాడు. నాడు సూపర్‌ ఓవర్లో నీషమ్‌ 13 పరుగులు చేసినా బౌండరీ లెక్కతో జట్టు ఓడింది. ‘కాలం గడిచేకొద్దీ బాధ తగ్గుతుందని అంటారు. కానీ నాలో ఇప్పటికే ఆ బాధ మిగిలి ఉంది. అది తగ్గేందుకు మరికొన్నేళ్లు పడుతుందేమో’ అని నీషమ్‌ అన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement