న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది.
శామ్యూల్స్ (50), దేవ్‌నారాయణ్ (11) క్రీజులో ఉన్నారు. ఎడ్వర్డ్స్ (55) రాణించినా... పావెల్ (21), డారెన్ బ్రేవో (4), చందర్‌పాల్ (6) నిరాశపర్చారు. అండర్సన్ 2, సౌతీ, బౌల్ట్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం విండీస్ ఇంకా 283 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 307/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 115.1 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటైంది. వాట్లింగ్ (65) అర్ధసెంచరీ సాధించగా, బౌల్ట్ (38 నాటౌట్), సోధి (27) ఫర్వాలేదనిపించారు. బెస్ట్ 4, గాబ్రియెల్, స్యామీ చెరో రెండు వికెట్లు తీశారు. వర్షం వల్ల రెండో రోజు కేవలం 63.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.