టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
వెస్టిండీస్ బ్యాటర్లలో రూథర్‌ఫర్డ్(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో సత్తాచాటగా.. సౌథీ, ఫెర్గూసన్ తలా రెండు వికెట్లు, నీషమ్, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.
నిప్పులు చేరిగిన జోషఫ్..
అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. విండీస్ పేసర్ అల్జారీ జోషఫ్ 4 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశాడు. జోషఫ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతడితో పాటు స్పిన్నర్ మోటీ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సూపర్-8కు విండీస్.. ఇంటికి కివీస్
ఇక ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూపు-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించగా.. ఓటమిపాలైన కివీస్ తమ సూపర్-8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ దాదాపుగా ఇంటిముఖం పట్టినట్లే. రెండు ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.
ఇప్పటికే గ్రూపు-సి నుంచి విండీస్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. మరో బెర్త్ కోసం అఫ్గానిస్తాన్ అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. గ్రూప్-సి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అఫ్గాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు నేరుగా సూపర్-8కు అఫ్గానిస్తాన్ నేరుగా క్వాలిఫై అవుతోంది.
చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే
Comments
Please login to add a commentAdd a comment