వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాల్గో టీ20లో కూడా జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్.. భారత్‌ను తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. కాగా, తాజా మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా విలియమ్సన్ తప్పుకున్నాడు. దాంతో కివీస్ కెప్టెన్‌గా టిమ్ సౌతీ వ్యవహరించనున్నాడు. కాగా, భారత్ జట్టు పలు కీలక మార్పులు చేసింది. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, సైనీలు తుది జట్టులోకి వచ్చారు. అదే సమయంలో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతి ఇచ్చారు.
హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా.. అదే ఊపును కొనసాగించి ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సన్నద్ధమైంది. తాజా ఫామ్ ప్రకారం చూస్తే మన జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్ చెలగాటం...మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రాణసంకటంగా తయారైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో కివీస్ బృందం ఉంది. (ఇక్కడ చదవండి: మ్యాచ్ తర్వాత కోహ్లి అచ్చం..)
గత మ్యాచ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే కివీస్ మ్యాచ్ చేజార్చుకుంది. చివరి 4 బంతుల్లో విజయానికి 2 పరుగులు కావాల్సిన తరుణంలో దాన్ని ఛేదించలేకపోయింది. చివరకు మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ సూపర్ ఓవర్ భారత్ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ పొరపాట్లను మళ్లీ రిపీట్ చేయకుండా సత్తా చాటాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, సంజూ శాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: టిమ్ సౌతీ(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, టామ్ బ్రూస్, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, సోధి, బెన్నెట్.
Comments
Please login to add a commentAdd a comment