టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ 9000 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) టెస్ట్‌ల్లో 9000 పరుగుల మార్కును దాటారు.
ఓవరాల్‌గా 18వ క్రికెటర్‌గా..
టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 18 మంది (విరాట్‌తో కలుపుకుని) 9000 పరుగుల మార్కును తాకారు. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921) అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్, కల్లిస్, ద్రవిడ్, రూట్, కుక్, సంగక్కర, లారా, చంద్రపాల్, జయవర్దనే, బోర్డర్, స్టీవ్ వా, గవాస్కర్, యూనిస్ ఖాన్, స్టీవ్ స్మిత్, హషిమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్, కోహ్లి వరుస స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కే దిశగా పయనిస్తుంది. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడుతూ న్యూజిలాండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తుంది. 45 ఓవర్ల అనంతరం భారత్ 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) ఔట్ కాగా.. విరాట్ (68), సర్ఫరాజ్ (68) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్) డకౌట్ కాగా.. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 పరుగులు చేశారు.
అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: IND VS NZ 1st Test: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్
Comments
Please login to add a commentAdd a comment