పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తడబడుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి రోజు రోహిత్ శర్మ (0) వికెట్ కోల్పోయిన భారత్.. రెండో రోజు తొలి సెషన్‌లోనే శుభ్‌మన్ గిల్ (30), విరాట్ కోహ్లి (1) వికెట్లు కోల్పోయింది.
గిల్, కోహ్లి వికెట్లు స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఖాతాలోకి వెళ్లాయి. ఇవాళ ఆట మొదలైనప్పటి నుంచి సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 191 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
— ViratKingdom (@kingdom_virat1) October 25, 2024
చీప్‌గా ఔటైన కోహ్లి
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన స్థాయికి తగ్గ ఆట ఆడలేక చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లోయర్ ఫుల్ టాస్ బాల్‌ను తప్పుగా అర్దం చేసుకున్న కోహ్లి రాంగ్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కోహ్లి ఔటైన విధానం చూస్తే ఇది అతని స్థాయి కాదని ఖచ్చితంగా తెలుస్తుంది. కోహ్లి సైతం చాలా అసంతృప్తిగా పెవిలియన్ బాట పట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment