వెల్లింగ్టన్: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపంతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉత్తర, దక్షిణ దీవుల మధ్య దూరం 35 సెంటీమీటర్లు తగ్గగా, దక్షిణ దీవికి పైభాగాన ఉన్న నెల్సన్ పట్టణం 20 మిల్లీ మీటర్లు కుంగిందని తెలిపారు. 2016 నవంబర్ 14వ తేదీన 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావానికి లోనై ఈ రెండు ప్రధాన దీవులు ఒకదానికొకటి చేరువగా వచ్చాయని, చీలికలు దక్షిణ దీవిని ఉత్తరం వైపునకు నెట్టివేశాయని వివరించారు. మరోవైపు, దక్షిణ దీవిలో ప్రధాన చీలిక సంభవించిన కేప్ క్యాంప్‌బెల్, ఉత్తర దీవికి దిగువన ఉన్న రాజధాని వెల్లింగ్టన్ మధ్య దూరం 50 కిలోమీటర్లకు పైగానే ఉందని వారు తెలిపారు. ఆనాటి భూకంపంలో సుమారు 25 చోట్ల చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. ప్రపంచంలో సంభవించిన అత్యంత సంక్లిష్టమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment