Islands
-
పర్యాటక పడవను ఢీకొట్టిన నేవీ బోట్
ముంబై: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయల్దేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్రజలాల్లో బుధవారం మధ్యాహ్నం నాలుగుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100మందికిపైగా పర్యాటకులతో ‘నీల్కమల్’ పర్యాటక పడవ ముంబైలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి బయల్దేరి ఎలఫెంటా ఐలాండ్‌కు వెళ్తోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోట్ ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. తప్పించుకునే వీలులేక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నీటలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావికా, తీర గస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయక బృందాలు కాపాడాయి. నాలుగు నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్‌లు, ఒక తీర గస్తీ బోటు, మూడు మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లు వార్తలొ చ్చాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక నేవీ అధికారి, ఇద్దరు నేవీక్రాఫ్ట్ కొత్త ఇంజన్ సంబంధిత నిపుణులు ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. కొత్త ఇంజన్‌ను నేవీక్రాఫ్ట్కు బిగించి పరీక్షిస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి మెరుపువేగంతో ప్రయాణించి అటుగా వెళ్తున్న పర్యాటక పడవను ఢీకొట్టిందని నేవీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.Mumbai boat accident VIDEO । बोटींच्या अपघाताचा EXCLUSIVE थरारक व्हिडीओ #NDTVMarathi #MumbaiBoatAccident #gatewayofindia pic.twitter.com/aQsaWhGRCs— NDTV Marathi (@NDTVMarathi) December 18, 2024VIDEO CREDITS: NDTV Marathi एलिफंटाकडे जाणारी प्रवासी बोट उलटली;बचावकार्य युद्धपातळीवर सुरु #gatewayofindia #eliphanta #Inframtb @TheMahaMTB pic.twitter.com/Oo3DtaKxp5— Gayatri Shrigondekar (@GShrigondekar) December 18, 2024 -
National Tourism Day: అందమైన, అద్భుతమైన ద్వీపాలు!
# National Tourism Day 2024 పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకుభారీ ఊతమిచ్చే పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన, చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈరోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు, అనేక రాష్ట్రాలు తమ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. థీమ్: ప్రతి సంవత్సరం, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని విభిన్న థీమ్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా జరుపుకుంటారు. 'సుస్థిర ప్రయాణాలు, కలకాలంనిలిచిపోయే జ్ఞాపకాలు అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించారు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం ఇండియాలో అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపధ్యంలో లక్షద్వీప్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ దీవులు: దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. బంగాళాఖాతంలోని 572 దీవుల సమూహం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలలో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపం ,బరాటాంగ్ ద్వీపం పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తాయి. లక్షద్వీప్ దీవులు: అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ భారతదేశంలోని మరొక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలు కవరత్తి, అగట్టి, మినీకాయ్ . మజులి ద్వీపం: అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులి ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. రామేశ్వరం ద్వీపం రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులో ఉన్న . దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్: కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని అబ్బురపరుస్తాయి. ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్లో ఉంది, ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం, రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. సుందర్ బన్స్: సాంప్రదాయ ద్వీపాలు కానప్పటికీ, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్‌లోని విస్తారమైన డెల్టా ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, జలమార్గాలు, ద్వీపాలు మడ అడవులు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. -
తంపులమారి చైనా..15 దేశాలతో కయ్యం
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి: చైనా పీపుల్స్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడిన నాటి నుంచి సరిహద్దుల విషయంలో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి అనేక చోట్ల వివాదాలు సృష్టిస్తోంది. మన దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అనేక భూభాగాలు తమవేనంటూ చైనా వాదిస్తోంది. 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అటుపిమ్మట భారత్‌లోని అనే భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. 1962లో భారత్‌తో జరిపిన యుద్ధం ఫలితంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని భాగమైన 37,244 చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అంతేకాదు జమ్మూకశీ్మర్ లోయలోని మరో 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తమదేనంటూ ఘర్షణలకు దిగుతూనే ఉంది. 2020 మే నెలాఖరులో చైనా సైన్యం గల్వాన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు మరణించారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం సరిహద్దుల వెంబడి అనేక చోట్ల భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తరువాత కూడా చైనా ఘర్షణలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశ అంతర్భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోంది. మొదట్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు.. అంటే మొత్తం అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని అని వాదించిన చైనా ఇప్పుడు తొలుత 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదాన్ని పరిష్కరించుకుందామని భారత్‌తో బేరాలాడుతోంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా భాష మాండరిన్‌లోకి మార్చేసింది. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్నన్గా సంబోధిస్తోంది. అర్థం లేని ఆధారాలు పొరుగు దేశాలతో నెలకొన్న వివాదాలకు చైనా ప్రత్యక్ష ఆధారాలు చూపడం లేదు. తన విస్తరణవాదానికి పూర్వకాలం నాటి రాజవంశçస్తుల పాలనా క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలంటూ ఇతర దేశాలతో సరిహద్దుల విషయంలో జగడానికి దిగుతోంది. అందుకోసం ఆయా ప్రాంతాల పేర్లను పూర్వకాలంలో పేర్కొన్న పేర్లుగా మార్చేస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. దక్షిణ చైనా సముద్ర జలాలపై, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం తమదేనంటూ తాను సృష్టించిన గీతల మ్యాప్‌లను చారిత్రక ఆధారాలుగా చూపుతోంది. ఆరు మహాయుద్ధాలు! 2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో గతంలో పేర్కొన్నట్లు యురేíÙన్ టైమ్స్ అనే ఆన్లైన్ పత్రిక వెల్లడించింది. దాని ప్రకారం 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వా«దీనం చేసుకోవడానికి యుద్ధా్దలు జరుగుతాయని పోర్టల్ చెబుతోంది. తంపులమారి చైనా మాదిరిగానే భారతదేశం కూడా మౌర్య, చోళ వంశçస్తుల పరిపాలనా క్షేత్రాన్ని ఆధారంగా చూపితే అనేక దేశాలను అఖండ్ భారత్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. మౌర్య, చోళ వంశస్థుల పరిపాలనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందరితోనూ తగువే భారత్ మాత్రమే కాకుండా 15 దేశాలతో చైనాకు సరిహద్దు తగాదాలు కొనసాగుతున్నాయి. వీటిలో తైవాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేíసియా, వియత్నాం, జపాన్, ద.కొరియా, కొరియా, సింగపూర్, బ్రూనై, నేపాల్, భూటాన్, లావోస్, మంగోలియా, మయన్మార్ తదితర దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఏలుబడిలోనే ఉండాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్ సవాలు చేస్తోంది. ► తైవాన్ విషయంలో ఆ దేశమంతా తమకు చెందినదేనన్నది చైనా వాదన. అయితే, ప్రస్తుతానికి మెకలిస్ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ► ఫిలిప్పైన్స్ విషయంలో కూడా స్కార్బరో కొండలు, మరికొన్ని దీవులపై చైనా వివాదం సృష్టించింది. వీటివిషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది. ► ఇండోనేసియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్ చైనా సముద్రంలో కొంతభాగం తమదేనంటూ చైనా తగువులు సృష్టిస్తోంది. ► వియత్నాం విషయానికి వస్తే అనేక భాగాలను తమకు అప్పగించాలని చైనా ఒత్తిడి పెంచుతోంది. పలు ద్వీపాలతోపాటు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం కాలుదువ్వుతోంది. చైనా నౌకాదళం ఇటీవల వియత్నాంకు చెందిన చేపల వేట పడవను సముద్రంలో ముంచేసింది. ► మలేíసియాతోనూ కొన్ని దీవులు, సముద్ర జల్లాల విషయంలో చైనా జగడం ఆడుతోంది. మలేíÙయా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవల అమెరికా, ఆ్రస్టేలియా యుద్దనౌకలు మలేíÙయాకు అండగా రావడంతో చైనా నౌకాదళం తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది. ► జపాన్‌కు చెందిన రెండు ద్వీప సముదాయాలపై చైనా కన్నుపడింది. అవి సెన్కాకు దీవులు, ర్యూక్యు దీవులు. ఈ దీవుల్లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి చైనా వీటి విషయంలో జపాన్‌తో తగువు పడుతోంది. ► దక్షిణ చైనా సముద్రంలో కొంతమేరకు మునిగిపోయిన సొకొట్రా రాక్‌పై దక్షిణ కొరియాతో వివాదానికి దిగింది చైనా. ఈ రాక్ కొరియాకు 149 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు 287 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► దాదాపు 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఉత్తర కొరియాతో సీ ఆఫ్ జపాన్ సముద్ర జలాల్లో హద్దుల అంశంపై చైనా వివాదం సృష్టించింది. ► దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా తగువులాడుతోంది. ► అతిచిన్న ఇస్లామిక్ దేశమైన బ్రూనైతో కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది. ► తమ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. పశి్చమ నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణలకు పాల్పడింది. ► దాదాపు 290 మైళ్లకుపైగా సరిహద్దు ఉన్న భూటాన్‌తో అనేక చోట్ల హద్దుల విషయంలో చైనా వివాదాలు సృష్టించింది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ► లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది. ► సరిహద్దు వివాదం కారణంగా తమ దేశంలోని ఓ చెక్‌పాయింట్‌పై దాడి జరిగిందని చైనా చెబుతోంది. ఈ ప్రాంతం విషయంలో మంగోలియాకు, చైనాలోని గాన్సు ప్రాంత ప్రజలకు మధ్య వివాదం ఉంది. -
Island: ప్రపంచంలోని టాప్ 10 దీవులు
-
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు
అండమాన్ నికోబార్ దీవులలోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహిత పేర్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పైగా జనవరి 23న పరాక్రమ దివాస్‌గా పాటించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమునాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. మోదీ 2018లో ఈ దీవులను సందర్శించి వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నేతాజీ స్మృతిని పురస్కరించుకుని అక్కడ ఉన్న రాస్ ఐలాండ్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. అలాగే నీల్ ఐస్లాండ్, హావ్లాక్ ఐస్లాండ్ వరుసగా నీల్ ద్వీప్, హావ్లాక్ ద్వీప్గా మారాయి. దేశంలో నిజ జీవితంలోని హిరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికే ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ స్ఫూర్తితోనే మందుకు వెళ్తూ.. ద్వీప సమూహంలోని 21 పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన దేశవీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది. (చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు) -
విజయవాడ భవానీ ఐలాండ్‌లో సంక్రాంతి సంబరాలు.. కళాకారుల సందడి
-
‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం!
మధ్యదరా సముద్రంలోని రెండో అతిపెద్ద దీవి సార్డినీయా. ఇది ఇటలీ అధీనంలో ఉంది. ఈ అందాల దీవిలో స్థిరపడటానికి ఎవరైనా వెళితే, అక్కడి ప్రభుత్వం 15 వేల యూరోలు (సుమారు రూ.12 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీవికి వెళ్లి స్థిరపడాలనుకునే వారికి డబ్బు పందేరం చేయడం కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఇటలీ ప్రభుత్వం 45 మిలియన్ యూరోలు (రూ.356 కోట్లు) కేటాయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద డబ్బు తీసుకున్నవారు సార్డినీయా దీవిలోని ఏదైనా పట్టణం లేదా గ్రామంలో ఇల్లు కొనుక్కోవడానికి, మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అద్భుతమైన వాతావరణం, చక్కని ప్రకృతి వనరులు ఉన్నా, ఆ దీవిలో తగినంత జనాభా లేకపోవ డంతో ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ( ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) -
‘మహా ప్రళయమే’ ముంచుకొస్తోందా? అనే స్థాయిలో ప్రచండ గాలులు
టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి. సూపర్ టైపూన్ హిన్నమ్నోర్గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2.5-minute rapid scan #Himawari8 Infrared images showing Super Typhoon #Hinnamnor as it reached Category 5 intensity while approaching the island of Minamidaitōjima, Japan (station identifier ROMD): https://t.co/oPnRJDgHbY pic.twitter.com/zIkcWGDrEG — UW-Madison CIMSS (@UWCIMSS) August 30, 2022 ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తున్నారు. BREAKING: TY #Hinnamnor is now a SUPER TYPHOON in PAGASA. This was based on their 4 PM Daily Weather Update. It will retain its "super typhoon" status as it enters PAR tomorrow, becoming the first storm to do so since #OdettePH (#Rai) in 2021, and the fourth overall since 2015. pic.twitter.com/2TCLDZRlKS — Matthew Cuyugan (@MatthewCuyugan) August 30, 2022 ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Super Typhoon #Hinnamnor has rapidly intensified in the Western Pacific Ocean with sustained winds of 150 mph and gusts up to 185 mph and could impact Miyakojima of the Miyako Islands of Okinawa. @JaneMinarWX with the latest. pic.twitter.com/V6Cp4UqDCS — FOX Weather (@foxweather) August 31, 2022 ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన చిన్న ద్వీపం -
అమ్మకానికి అందాల దీవి
ఫొటోలో కనిపిస్తున్నది స్కాట్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఒక చిన్నదీవి. దీని పేరు ప్లాడా ఐలాండ్. లండన్‌కు ఉత్తరాన దాదాపు 750 కిలోమీటర్ల దూరంలో ఉందిది. దీని విస్తీర్ణం 28 ఎకరాలు. ప్రస్తుతం ఇది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఒక ఐదు పడకగదుల ఇల్లు, ఒక కాటేజీ, రెండు రిసెప్షన్ ఏరియాలు తదితర సౌకర్యాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, ఈ దీవిలో అద్భుతమైన లైట్‌హౌస్ కూడా ఉంది. ఈ కట్టడాలే కాకుండా, దాదాపు వంద జాతులకు చెందిన పక్షులు, రకరకాల జాతులకు చెందిన వృక్షసంపద ఈ దీవికి అదనపు ఆకర్షణ. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ దీనిని అమ్మకానికి పెట్టింది. దీని ధర 3.50 లక్షల పౌండ్లు (సుమారు రూ.3.50 కోట్లు). లండన్‌లోని ఇళ్లతో పోల్చుకుంటే, దీని ధర కారుచౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి! -
గ్రీస్ ను కప్పేసిన మంచు దుప్పటి
-
వైరల్: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..
మనిషిని సంప్రదాయం పేరిట ఉండే మూఢ నమ్మకం పిచ్చివాడిని చేస్తుంది. మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల వేటాడుతుండేవారు. కొందరు తమ బలప్రదర్శన, ధైర్య సాహసాలు నిరూపించుకోవడం కోసం జంతువులను వేటాడి చంపేవారు. ఫారో ఐస్లాండ్స్(తోర్షావ్న్): ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను హతమార్చారు. దీంతో సముద్ర తీరం మొత్తం రక్త సిక్తమైంది. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను బలితీసుకున్నారు. ఇదో అనాగరికమైన చర్యగా సీ షెపర్డ్ పేర్కొంది. ఇలా వెలుగులోకి.. సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్‌ను పంపించారు. అది తిమింగలాలు ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ సంగతి బయట పడింది. అయితే ఆ సమయంలో ఓ ముష్కరుడు ఫోర్మ్యాన్ను వేటాడండి అంటూ.. డ్రోన్‌పై షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఇక దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి. కానీ చాలామంది వారి సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు. చదవండి: Covaxin: భారత్ బయోటెక్‌కు మరోసారి ఎదురుదెబ్బ జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష -
మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!
మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్ హాలీడే స్పాట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్ లవ్ కపుల్స్‌కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్ ట్రిప్ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్ అయ్యి వస్తారు. అయితే మాల్దీవ్స్ లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం 40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్బర్గ్ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిజీ కూడా ముప్పు అందమైన బీచ్‌లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది. ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్ -
7.7 తీవ్రతతో భారీ భూకంపం
-
కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం
హవానా: కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కానీ డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా దగ్గర సునామీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా 6.1 తీవత్రతో సంభవించిన భూకంపం నుంచి పెద్దగా సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది. గ్రాండ్ కేమన్లోని ఓగియర్లో నివసించే అలెక్ పుల్టర్ మాట్లాడుతూ ఇది తాను చూసిన మొట్టమొదటి భూకంపం కాదని, అయితే ఇది ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం అని తెలిపారు. -
వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు
ఆధునిక ప్రపంచం.. ఎటుచూసినా కాలుష్యం.. భయాందోళనకు గురిచేస్తున్న వాతావరణం.. ఇలాంటి పరిస్థితులకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. స్వచ్ఛతకు ప్రతిరూపమైన తడ మండలంలోని వేనాడు, ఇరకం దీవుల్లో ప్రతిదీ విలువైనదే. ఈ దీవులకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారనే భావన తప్ప నేటి కాలుష్య జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారన్న వీరి సంతృప్తిని చూసి ఎవరైనా అసూయ పడాల్సిందే. పర్యాటక కేంద్రంగా ఇరకం పులికాట్ సరస్సు నడుమ ప్రకృతి అందాలతో కాలుష్య కోరలకు దూరంగా ప్రశాంతంగా ఉండే దీవి గ్రామం ఇరకం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభించడం దీని ప్రత్యేకత. గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు వాటి పక్కన మొగలి పొదలు కనిపిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు విరివిగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. వేనాడులో ప్రకృతి కనువిందు రాకెట్ ప్రయోగ కేంద్రం షార్కు సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. గ్రామం కాలుష్యపు కోరలకు దూరంగా తెల్లటి ఇసుక దిబ్బలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు చాలానే ఉన్నాయి. వరి ప్రధాన పంట. తాగునీటికి సమస్య లేదు. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిమామిడి, పేము, వెదురు, తంగేడిపూలు, సీగిరేణి(అరిపాకు) ఆకు విరివిగా లభిస్తాయి. గతంలో ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేసేవారు. దీని వల్ల చుండ్రు, జుత్తురాలే సమస్యలు తగ్గడంతోపాటు చలవ చేసే గుణం కూడా ఉండేది. అనంతర కాలంలో షాంపులు రావడంతో ఈ ఆకును వాడే వారు కరువైపోయారు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు కూతవేటు దూరంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండగా మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ పులికాట్ సరస్సు ఉప్పు నీళ్లు ఉన్నా గ్రామాల్లో మాత్రం స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు ఉండడం వీరు అదృష్టంగా భావిస్తారు. ఈ నీటి ఆసరాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన పని లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణం కలిగినవిగా ఉంటాయి. వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ పెద్దగా కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఆ దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం వేనాడు, ఇరకం దీవులు అద్భుత గ్రామాలు. ఇక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందించడంతోపాటు ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తాం. ఇరకం దీవిలో పర్యాటక పెట్టుబడుల కోసం ఇప్పటికే చెన్నైలోని ‘వీజీపీ’ ప్రతినిధులతో చర్చలు జరిపాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వసతి, పులికాట్ ముఖద్వారాల పూడికతీత, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే గతంలో అరిపాకే అందరికీ మా చిన్నతనంలో అరిపాకుతోనే తల స్నానం చేసే వాళ్లం. దీని వల్ల జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఈ ఆకును పొడి కొట్టించడం, స్నానం చేసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ప్రజలు షాంపూల వైపు మళ్లారు. తిరిగి ప్రస్తుతం పాత అలవాట్లకు వస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడు ఈ ఆకు కోసం గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో పేము బాగా పెరుగుతుంది. ఇక్కడ పట్టా భూముల్లో సాగయ్యే పేముని వేలం పాట ద్వారా విక్రయిస్తాం. ఆకు నుంచి, కాడ వరకు ముళ్లతో ఉండే ఈ పేముని గిరిజనులు తప్ప ఇతరులు కొయ్యలేరు. ఈ రెండింటినీ బాగా సాగు చేసి వినియోగంలోకి తెస్తే కొందరికైనా ఉపాధి లభిస్తుంది. – కె.వాసుమొదలి, వేనాడు గ్రామం, తడ మండలం -
దీవులను చేరువ చేసిన భూకంపం!
వెల్లింగ్టన్: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపంతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉత్తర, దక్షిణ దీవుల మధ్య దూరం 35 సెంటీమీటర్లు తగ్గగా, దక్షిణ దీవికి పైభాగాన ఉన్న నెల్సన్ పట్టణం 20 మిల్లీ మీటర్లు కుంగిందని తెలిపారు. 2016 నవంబర్ 14వ తేదీన 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావానికి లోనై ఈ రెండు ప్రధాన దీవులు ఒకదానికొకటి చేరువగా వచ్చాయని, చీలికలు దక్షిణ దీవిని ఉత్తరం వైపునకు నెట్టివేశాయని వివరించారు. మరోవైపు, దక్షిణ దీవిలో ప్రధాన చీలిక సంభవించిన కేప్ క్యాంప్‌బెల్, ఉత్తర దీవికి దిగువన ఉన్న రాజధాని వెల్లింగ్టన్ మధ్య దూరం 50 కిలోమీటర్లకు పైగానే ఉందని వారు తెలిపారు. ఆనాటి భూకంపంలో సుమారు 25 చోట్ల చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. ప్రపంచంలో సంభవించిన అత్యంత సంక్లిష్టమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
డోక్లాంలోకి మళ్లీ చైనా
వాషింగ్టన్: డోక్లాం ప్రాంతంలోకి చైనా మరోసారి చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని ఇటు భారత్, భూటాన్ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై చైనా అక్రమంగా కృత్రిమ ద్వీపాలు నిర్మాణంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరిగిన సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అలైస్ వెల్స్ మాట్లాడారు. భారత్ సరిహద్దులో రోడ్ల నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసిందన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు అన్ వాగ్నర్ మాట్లాడుతూ ‘డోక్లాం వివాదం సద్దుమణిగిన తర్వాత చైనా నెమ్మదిగా డోక్లాంలో తన కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ విషయంపై భూటాన్, భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా చర్యలు.. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశ విధానాలను గుర్తుకుతెస్తున్నాయి. మన వైఫల్యాల వల్ల దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం మోహరించింది. ఇప్పుడు హిమాలయ సరిహద్దుల్లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీనికి అంతర్జాతీయ స్పందనేంటి? అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోంది’అని వాగ్నర్ పశ్నించారు. అది భారత్ సొంత విషయం ఈ చర్చ సందర్భంగా వెల్స్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘ఉత్తర సరిహద్దులను సంరక్షించుకునేందుకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా డోక్లాం వివాదం భారత్‌కు చెందిన విషయం’ అని అన్నారు. గతేడాది జరిగిన డోక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో చైనా రోడ్డు నిర్మాణాలను చేపట్టడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత దౌత్యపరమైన చర్చలతో వివాదం సద్దుమణిగింది. కొత్త నిర్మాణాల్లేవ్: భారత్ డోక్లాం ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలేవీ చోటుచేసుకోలేదని, అక్కడ యథాతథ స్థితి నెలకొని ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. డోక్లాం దక్షిణ ప్రాంతంలో చైనా కొత్తగా రోడ్ల నిర్మాణం చేపడుతోందా అని రాజ్యసభలో వేసిన లిఖిత పూర్వక ప్రశ్నకు సింగ్ ఈ మేరకు బదులిచ్చారు. కిందటేడాది ఆగస్టు 28న డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ దళాలు మోహరించినప్పటి నుంచీ ఎవరూ అక్కడ కొత్తగా ఏ నిర్మాణం చేపట్టలేదన్నారు. -
దీవుల అభివృద్ధిపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలోని 26 దీవుల సమగ్రాభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిని ప్రధాన మంత్రి మోదీ సమీక్షించారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దీవుల్లో చేపట్టిన కీలక మౌలిక ప్రాజెక్టులు, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, సముద్ర జలాలను మంచి నీరుగా మార్చే ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలు, మత్స్య పరిశ్రమ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో సమీకృత పర్యాటక–కేంద్రీకృత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దీవుల్లో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధంగా తయారుచేయాలన్నారు. -
స్కూబా డైవింగ్ భలే ఇష్టం
చిట్‌చాట్: ‘మలేషియా ప్రకృతి, పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ కోసం చాలా సార్లు మలేషియా వెళ్లా. అక్కడి ఐలాండ్స్ కనువిందు చేస్తాయి. దీవుల్లో స్కూబా డైవింగ్ మరపురాని అనుభూతి..’ అంటున్నారు నటి శ్రీయ. ‘మనం’ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించిన శ్రీయ గురువారం సైమా అవార్డుల అనౌన్స్మెంట్ కార్యక్రమంలో మెరిసారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో మాట్లాడుతూ ‘ కెరీర్ ప్రారంభంలో రెండేళ్లు తెలుగు ప్రేక్షకులు నన్ను భరించారు. తమిళ, మళయాల, కన్నడ పరిశ్రమల్లో నటించినా టాలీవుడ్ అంటే నాకు ప్రత్యేకాభిమానం. రజనీకాంత్‌తో ‘శివాజీ’ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఫీలయ్యా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అందరూ నాకు ఎంతో సహకారం అందించారు’ అని గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ. ‘విదేశాల్లో దక్షిణాది సినిమాలు పాపులరయ్యాయి. షూటింగ్‌లు, ఇతర పనులపై విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి క్యాబ్ డ్రైవర్లు కూడా మన సినిమాల గురించి మాట్లాడుకోవడం విన్నా. సైమా అవార్డులు మలేషియాలో నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతి కచ్చితంగా పెరుగుతుంది. సెప్టెంబర్ 11న నా బర్త్‌డే. మరుసటిరోజే సైమా అవార్డ్స్. ఈసారి నా పుట్టినరోజును మలేషియాలో జరుపుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. -
విహారం: థాయ్‌లాండ్ వెళితే ఫిఫిని మిస్ కాకండి!
థాయ్‌లాండ్... పర్యాటక స్వర్గాల్లో ఒకటైతే, ‘ఫి ఫి ఐలాండ్స్’ అందులో మరో అద్భుతం. ఈ పేరు ఎంత విచిత్రంగా ఉందో, ఆ ప్రదేశం అంత అద్భుతంగా ఉంటుంది. టూర్ వెళ్లేదే రిలాక్స్ కోసమే అయితే, ఇక్కడ ఆ పని తప్ప మీరేమీ చేయలేరు. మీ బాడీ ఆ ప్రాంతానికలా కనెక్ట్ అవుతుందంతే! ఫి ఫి ఐలాండ్స్... ఆరు ద్వీపాల కలయిక. వాటిల్లో ఇవి రెండూ పెద్దద్వీపాలు. మిగతా నాలుగు కేవలం బీచ్‌లకు ప్రత్యేకం. థాయ్‌లాండ్ దేశంలో దక్షిణం వైపు ఉంటాయి ఫిఫి దీవులు. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఈ దీవులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రిలాక్సేషన్‌కు పేరు గాంచిన ఈ దీవులు థాయ్లాండ్లోనే కాదు ప్రపంచంలోనే అందమైన దీవుల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందమైన బీచ్‌లు... బీచ్‌లో తిరుగాడే రంగురంగుల చేపలను చూస్తూ బీచ్ ఒడ్డున లాంజర్ చెక్క కుర్చీల్లో కూల్‌డ్రింక్ తాగుతూ అలా సేదదీరుతుంటే ఇలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్లు బతికున్నామా అన్న ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా బీచ్‌లు ఇష్టపడేవారికి ఇది ఒక గొప్ప అట్రాక్షన్. బీచ్‌లను స్వచ్ఛంగా ఉంచటం అంత ఈజీ కాదు. కానీ, ఇక్కడ అలాంటి అరుదైన అనుభూతి దక్కుతుంది. వాటిలో లోపల తిరుగాడే అనేక రకాల, రంగుల చేపలు కనువిందు చేస్తూ ఆ నీటిలోంచి పైకి కనిపిస్తుంటాయి. యాచ్ ట్రిప్... ఈ దీవుల్లో మరో మంచి అనుభూతి యాచ్ ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఓ రోజంతా ఆ ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇవి ఖరీదు కూడా కాదు. వీటిని కొన్ని కంపెనీలు, హోటళ్లు, స్థానికులు నడుపుతారు. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్లు ఎంచుకోవచ్చు. ఇక ఆ దీవుల గురించి తెలుసుకోవాలంటే అక్కడే దొరికే గైడ్లను కూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు. అక్కడకు వెళితే టాటూ ఒంటి మీద పడాల్సిందే ఫి ఫి ఐలాండ్స్ చాలా చిన్న ప్రాంతమే కానీ ఒక నగరానికి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. ఇక్కడ టూర్‌ను చాలా తక్కువ ఖర్చుతోనూ పూర్తి చేయొచ్చు. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టొచ్చు. ఇక్కడ టాటూ సంస్కృతి బాగా ఎక్కువ. ఏటీఎం సెంటర్లు కనిపించినంత ఎక్కువగా టాటూ సెంటర్లు కనిపిస్తాయి. మీకు ఏ టాటూ కావాలన్నా, ఏ పద్ధతిలో కావాలన్నా నిమిషాల్లో వేసి పంపించేస్తారు. ఒంటి మీద టాటూ పడితే మీరు ఫి ఫి పోయివచ్చినట్టన్నమాట. ప్రా నంగ్ టు ఫి ఫి క్రాబి టౌన్ పరిధిలోకి ఈ ద్వీపాలు వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో బీచ్ మనోహరంగా ఉంటుంది. కాస్త రద్దీగా ఉన్నా విశాలమైన బీచ్ కావడం వల్ల మీకు ఏ ఇబ్బందీ ఉండదు. జలకాలాడటం వచ్చి ఇసుకలో కాసేపు సేదదీరడం మళ్లీ జలకాలాటకు పోవడం. ఇక్కడ అదే పని. మీ ఓపిక, మీ టైం. క్రాబి టౌన్లో సుమారు పది బీచ్‌లు ఉంటే అన్నీ నిమిషాల ప్రయాణం దూరంలోనే ఉంటాయి. కాబట్టి మీరు అన్ని తీరాలనూ కవర్ చేసి ఆనందించొచ్చు. రెండే కాలాలు.. లోకానికి మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబరు వరకు వానాకాలం. వాన పడనపుడు వెళ్తేనే మంచిది. ఉన్నది ఎక్కువగా బీచ్‌లే కాబట్టి పగలు సముద్రందగ్గర, రాత్రి హోటల్లో ఉండొచ్చు. ఇక్కడ ఎండాకాలం అంటే మహా వేడిగా ఏం ఉండదు. ఏకాలమైనా 22-32 డిగ్రీల మధ్య మాత్రమే ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ కాలం వెళ్లినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఈ వేడి మన భారతీయులకు అయితే సుపరిచితమే. ఇక్కడ థాయ్ భట్ కరెన్సీ. మనవి రెండు రూపాయిలు వాళ్ల ఒక థాయ్భట్తో సమానం. కాబట్టి ఇండియన్లకు థాయ్టూర్ అంత కాస్ట్లీ కాదు. థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. లక్కీ ఏంటంటే... ఫి ఫి ఐలాండ్స్ ఈ పుకెట్ నుంచి కేవలం యాభై కిలోమీటర్లే. పుకెట్ దర్శనం కూడా ఫి ఫి ఐలాండ్స్ సందర్శనంతో పాటే అయిపోతుంది. పుకెట్ కూడా పెద్ద పర్యాటక ప్రదేశమే. అక్కడ అనేక ప్రకృతి దృశ్యాలుంటాయి. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలుంటాయి. అందుబాటులోనే ఉంది ఫి ఫి ఐలాండ్స్ అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం. ఇక్కడకు చేరుకోవడం చాలా సులువు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు అయినా ఫ్లైట్‌లో వెళ్లొచ్చు. లేదా నేరుగా ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగొచ్చు. హైదరాబాదు నుంచి ఫుకెట్‌కు నేరుగా వెళ్లాలంటే రూ.14 వేల నుంచి ఫ్లైట్ టికెట్ మొదలవుతుంది. అక్కడి నుంచి బస్సు, కారు, బోటు ఇలా ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తక్కువ ఖర్చులో వెళ్లిరాగల విదేశీ టూర్ ఇది. రవాణా అవసరమే రాదు బహుశా మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా ఆటోలు, ట్యాక్సీలు అవసరం అవుతుంటాయి. కానీ ఇక్కడ వాటి అవసరమే రాదు. ఏ బీచ్ నుంచి ఏ బీచ్‌కు అయినా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. చిన్న దీవులు కనుక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు. ఎక్కడ చూసినా తోక పడవలే కనిపిస్తాయి. వీటిని అందరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా గంటల్లెక్కన, రోజు లెక్కన అద్దెకు కూడా తీసుకోవచ్చు. -
విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం
లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. గూగుల్ సెర్చ్ ఏరియల్ వ్యూలో చూస్తే లెక్కపెట్టలేనన్ని ద్వీపాలు కనిపిస్తాయి. కానీ అన్ని దీవులు ఉండే అవకాశం లేదు. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా. అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు. లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన జానపద సినిమాను తలపిస్తుంటే, సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్‌లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి. ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు. తమాషా ఏమిటంటే... ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో గెంతులేస్తుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్... ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు. సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి. అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం. ఎక్కడ ఉన్నాయి? కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి? ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? విమానంలో... లక్షద్వీప్‌కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉంటాయి.రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది. షిప్ ప్రయాణం... లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్‌కండిషన్ క్రూయిజ్‌లే. ఎక్కడ ఉండాలి? సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి. భోజనం ఎలా? ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఏమేమి చూడాలి? హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి. ఏయే సాహసాలు చేయవచ్చు? కామత్ ఐలాండ్‌లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.