స్కూబా డైవింగ్ భలే ఇష్టం | Shriya talks to City plus about Scuba diving | Sakshi
Sakshi News home page

స్కూబా డైవింగ్ భలే ఇష్టం

Published Fri, Jul 18 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

స్కూబా డైవింగ్ భలే ఇష్టం

స్కూబా డైవింగ్ భలే ఇష్టం

చిట్‌చాట్: ‘మలేషియా ప్రకృతి, పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ కోసం చాలా సార్లు మలేషియా వెళ్లా. అక్కడి ఐలాండ్స్ కనువిందు చేస్తాయి. దీవుల్లో స్కూబా డైవింగ్ మరపురాని అనుభూతి..’  అంటున్నారు నటి శ్రీయ. ‘మనం’ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించిన శ్రీయ గురువారం సైమా అవార్డుల అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో మెరిసారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో మాట్లాడుతూ ‘ కెరీర్ ప్రారంభంలో రెండేళ్లు తెలుగు ప్రేక్షకులు నన్ను భరించారు. తమిళ, మళయాల, కన్నడ పరిశ్రమల్లో నటించినా టాలీవుడ్ అంటే నాకు ప్రత్యేకాభిమానం.
 
 రజనీకాంత్‌తో ‘శివాజీ’ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఫీలయ్యా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అందరూ నాకు ఎంతో సహకారం అందించారు’ అని గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ. ‘విదేశాల్లో దక్షిణాది సినిమాలు పాపులరయ్యాయి. షూటింగ్‌లు, ఇతర పనులపై విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి క్యాబ్ డ్రైవర్లు కూడా మన సినిమాల గురించి మాట్లాడుకోవడం విన్నా. సైమా అవార్డులు మలేషియాలో నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతి కచ్చితంగా పెరుగుతుంది. సెప్టెంబర్ 11న నా బర్త్‌డే. మరుసటిరోజే సైమా అవార్డ్స్. ఈసారి నా పుట్టినరోజును మలేషియాలో జరుపుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement