![Airbnb inks pact with tourism ministry to promote heritage stays, cultural tourism - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/20/AIRBNB.gif.webp?itok=rkjGCqUV)
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది.
టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్‌స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment