tourism places
-
భావితరాల కోసం..
ఒకప్పుడు ప్రజలంతా చేదుడుబావి, మెట్ల బావుల నీటిని తాగేవారు. కాలక్రమంలో వాటిని పక్కన పెట్టి చెరువులు, వాగులు, బోర్లు, కులాయిల నీటిని తాగుతున్నారు. ఓ దేవాలయం ఉందంటే దానికి చుట్టుపక్కల ఓ బావిని తవ్వి కోనేరుగా వాడే వారు. కాల క్రమంలో వాటి నిర్వహణ భారం కావడం, ఆ నీటిని వాడకపోవడంతో అవన్నీ పూడుకుపోయాయి. అలాంటి మెట్ల బావుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటంతో పాటు వాటిని ఎన్నో జీవరాశులకు కేంద్రంగా మార్చేందుకు సాహే అనే ఎన్జీఓ సంస్థ కృషి చేస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో బన్సీలాల్‌పేట మెట్ల బావిని పునరుద్ధరించి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రారంభించిన విషయం తెలిసిందే. – మణికొండబన్సీలాల్పేట మెట్ల బావి తరహాలోనే రాష్ట్రంలోని గచ్చిబౌలి, బైబిల్‌హౌస్, కోకాపేట, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మంచిరేవుల లాంటి 25 చోట్ల బావులను పునరుద్ధరించారు. పనికిరాని వాటిగా మరుగున పడిన వాటికి జీవం పోసి తిరిగి ఉపయోగంలోకి తేవటం, ఏకంగా వాటిని పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం అందరినీ ఆకర్షిస్తున్నాయి. జీవరాశులకు ఉపయుక్తంగా.. వందల సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగపడిన బావులను పునరుద్ధరిస్తే మరో వంద సంవత్సరాల పాటు ప్రజలకు జీవరాశులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేపడుతున్న పనులు మన్ననలు పొందుతున్నాయి. బావులను పునురుద్ధరించడంతో పాటు వాటి చుట్టూరా లైటింగ్, పార్కులు ఏర్పాటు చేస్తుండటంతో వాటి వద్ద గడిపేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, చెరువులు, కాలువలు, నదులను పునరుద్ధరించి, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సాహే సంస్థ 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అదే క్రమంలో ఇలాంటి మూతబడిన బావులను పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని పలువురు సలహా ఇవ్వడంతో వాటి పునరుద్ధరణ పనులను గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్నారు. అందులో భాగంగా 25వ బావిగా మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న బావిని పునరుద్ధరించారు. దేవాలయానికి ఆగ్నేయంలో వాస్తుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో దాన్ని గతంలో పూర్తిగా పూడ్చివేశారు. సాహే ప్రతినిధులు అలాంటి బావుల విశిష్టతను తెలపడంతో తిరిగి తెరిచేందుకు ఆలయ పూజారులు అంగీకరించటంతో నెల రోజులుగా శ్రమించి పునరుద్ధరించారు. దానిని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు చుట్టూరా గోడకట్టడం, లైటింగ్, పార్కు ఏర్పాటు పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులన్నింటికీ రూ.38 లక్షలను వెచి్చస్తున్నారు. కామారెడ్డిలోనూ మరో బావిని, చందానగర్‌లోని భక్షికుంట బావిని పునరుద్ధరించే పనులను చేపడుతున్నారు.జల భాండాగారాలుగా.. పురాతన బావులను పునరుద్ధరిస్తే దాని కేంద్రంగా అనేక జీవరాశులు జీవనం ఏర్పాటు చేసుకుంటాయి. వాటిని కాస్త తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడతాయి. వాటిల్లో చెత్తా చెదారం వేసి మూసివేసి నిరుపయోగంగా మార్చారు. ఒక్క బావి ఉంటే దాని చుట్టుపక్కల భూగర్భ జలం పెరుగుతుంది. దీంతో ప్రజలు నీటి బాదల నుంచి కొంతైనా ఉపశమనం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బావులు ఎక్కడ ఉన్నా వాటిని పునరుద్ధరిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి సీఎస్ఆర్గా తీసుకుంటున్నాం. – కల్పన రమేష్ సాహే సంస్థ నిర్వాహకురాలు -
పర్యాటక శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ ఎంవోయూ
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్‌ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది. టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్‌స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్‌లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్‌లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
Independence Day 2021: ఇండిపెండెన్స్ టూర్.. ఎందరో మహానుభావులు
ఒక అల్లూరి... ఒక ఆజాద్. ఓ మహాత్ముడు... ఓ ఉక్కు మనిషి. అందరిదీ ఒకటే నినాదం... జైహింద్. మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ... లక్ష్మీబాయి ఎత్తిన కత్తి... భగత్‌సింగ్ ముద్దాడిన ఉరితాడు... అందరిదీ ఒకటే సమరశంఖం. అదే... భారతదేశ విముక్తపోరాటం. డయ్యర్ దురాగతానికి సాక్షి జలియన్ వాలాబాగ్. దేశభక్తిని ఆపలేని ఇనుపఊచల అండమాన్ జైలు.సంకల్ప శుద్ధితో బిగించిన ఉప్పు పిడికిలి దండు. వీటన్నింటినీ ప్రకాశవంతం చేసిన దేవరంపాడు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా... దేశమాతకు సెల్యూట్ చేస్తూ చూడాల్సిన కొన్ని ప్రదేశాలు. దేవరంపాడు: ప్రకాశ వీచిక ఆ రోజు 1928, అక్టోబరు నెల. స్వాతంత్య్ర సమరయోధులు మద్రాసు (చెన్నై) పారిస్ కార్నర్లో గుమిగూడారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ అంటూ ఏకకంఠంతో నినదించారు. బ్రిటిష్ అధికారుల ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపారు. పార్థసారథి అనే దేశభక్తుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. ఆ క్షణంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆవేశంగా ముందుకు వచ్చి ‘కాల్చండిరా కాల్చండి’ అంటూ శాలువా తీసి ఛాతీ విరుచుకుని ముందుకొచ్చారు. ఆ గొంతులో పలికిన తీక్షణతకు పోలీసులు చేష్టలుడిగిపోయారు. ఆ చోటులోనే ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. చెన్నై వెళ్లిన ప్రతి తెలుగు వారూ తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రకాశం పంతులు చివరిక్షణాల్లో జీవించిన దేవరంపాడు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. దేవరంపాడు గ్రామం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి స్థానిక రాజకుటుంబీకులు విరాళంగా ఇచ్చిన పన్నెండు ఎకరాల మామిడితోట ప్రస్తుతం జాతీయ స్మారక చిహ్నాల సుమహారం. ఇందులో వందేమాతర విజయధ్వజం, గాంధీ– ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా త్రివర్ణ స్థూపం ఉన్నాయి. ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఇక్కడే జీవించారు. ఏటా ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, మంత్రులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు ఒంగోలులో బస చేసి దేవరంపాడుకి వెళ్లి రావచ్చు. హుస్సేనీవాలా: విప్లవ జ్ఞాపకం పంజాబ్ రాష్ట్రం, ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఉంది హుస్సేనీవాలా గ్రామం. ఇది అమర వీరుల స్మారక చిహ్నాల నేల. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల గౌరవార్థం రోజూ సాయంత్రం జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని భారత్– పాకిస్థాన్ సైనికులు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఈ అమరవీరుల జ్ఞాపకార్థం వీరు ముగ్గురూ ప్రాణాలు వదిలిన రోజును గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 23వ తేదీన ప్రభుత్వం షాహీద్ మేళా నిర్వహిస్తారు. అహ్మదాబాద్: ఐక్యత వేదిక అహ్మదాబాద్ వెళ్లగానే మొదట సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ మహాత్ముని ఆశ్రమం వైపు అడుగులు పడతాయి. మన జాతీయోద్యమంలో అనేక ముఖ్యమైన ఉద్యమాలకు ఇక్కడే నిర్ణయం జరిగింది. అందుకే దీనిని సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో అణువణువూ గాంధీజీ నిరాడంబరమైన జీవితాన్ని, జాతీయోద్యమం పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో చూసి తీరాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవనం. అహ్మదాబాద్ నగరం షాహీబాగ్‌లో ఉన్న మోతీ షాహీ మహల్‌ను పటేల్ మెమోరియల్‌గా మార్చారు. సర్దార్ పటేల్ నేషనల్ మెమోరియల్‌లో పటేల్ జీవితంతోపాటు జాతీయోద్యమం మొత్తం కళ్లకు కడుతుంది. ఒక్కో గది ఒక్కో రకమైన విశేషాలమయం. పటేల్ జీవితంలో జైలు ఘట్టాలతోపాటు, బాల్యం, స్వాతంత్య్ర పోరాటం, జాతీయనాయకులతో చర్చల చిత్రాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు కూడా ఉంటాయి. కృష్ణదేవి పేట: అల్లూరికి వందనం తెలుగు జాతి గర్వపడే వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు... అల్లూరి సీతారామ రాజు సమాధి విశాఖపట్నం జిల్లా, గోలుగొండ మండలం, కృష్ణదేవి పేట (కె.డి. పేట)లో ఉంది. ప్రభుత్వం దీనిని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తోంది. ఇక్కడి ప్రజలు కూడా అల్లూరి సమాధి అని మన మాట పూర్తయ్యేలోపు ఎలా వెళ్లాలో దారి చూపిస్తారు. ఈ ప్రదేశంలో సీతారామరాజు పేరుతో పార్కును అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు సమాధికి సమీపంలోనే సీతారామరాజు అనుచరులు మల్లుదొర, ఘంటం దొర సమాధులు కూడా ఉన్నాయి. ఒక భవనంలోని ఫొటో గ్యాలరీలో సీతారామరాజు జీవిత విశేషాలను, బ్రిటిష్ వారి మీద పోరాడిన ఘట్టాలను చూడవచ్చు. కృష్ణదేవి పేట గ్రామం విశాఖపట్నానికి పశ్చిమంగా నూటపది కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రయాగ్‌రాజ్: ఆజాద్ ఆఖరి ఊపిరి అలహాబాద్ నగరంలో 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఆజాద్ స్మారకం. చంద్రశేఖర్ ఆజాద్ తుది శ్వాస వదిలిన చోట ఆయన స్మారక విగ్రహాన్ని స్థాపించారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నగరంలో ఉంది. జాతీయోద్యమంలో భాగంగా ఆజాద్ 1931 ఫిబ్రవరి 27వ తేదీన పోలీసు అధికారుల మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను పట్టుబడుతున్న క్షణంలో ఆజాద్ తన తుపాకీలోని చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు ఆల్ఫ్రెడ్ పార్కుగా ఉన్న పేరును ఆజాద్ పార్కుగా మార్పు చేశారు. దండి: ఉవ్వెత్తిన ఉప్పు దండు గుజరాత్ రాష్ట్రం, దండి తీరాన గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలియని భారతీయులు ఉండరు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఎనభై మంది సత్యాగ్రహులు 1930, మార్చి నెలలో దండి గ్రామం వరకు 241 కి.మీల దూరం ఈ మార్చ్ నిర్వహించారు. అహింసాయుతంగా శాసనోల్లంఘనం చేసిన ఉద్యమంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉద్యమం ఇది. ఇక్కడ ఉన్న ‘నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్’ను ప్రతి భారతీయుడు ఒక్కసారైనా సందర్శించి తీరాలి. పోర్టు బ్లెయిర్: బిగించిన ఉక్కు పిడికిలి భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను తలుచుకుంటాం. వారితోపాటు లక్షలాది మంది సామాన్యులు కనీస గుర్తింపుకు కూడా నోచుకోకుండా జీవితకాలం పాటు జైల్లో మగ్గి దేశం కోసం ప్రాణాలు వదిలారు. వారికి నివాళి అర్పించాలంటే అండమాన్ దీవుల రాజధాని నగరం పోర్టు బ్లెయిర్‌లోని సెల్యూలార్ జైలును సందర్శించాలి. ఇది నేషనల్ మెమోరియల్ మాన్యుమెంట్. వీర సావర్కర్ వంటి ఎందరో త్యాగధనులు జైల్లో ఎంతటి దుర్భరమైన జీవితాన్ని గడిపారో కళ్ల ముందు మెదిలి గుండె బరువెక్కుతుంది. వాళ్లు ధరించిన గోనె సంచుల దుస్తులు, ఇనుస సంకెళ్లు, నూనె తీసిన గానుగలు వారిలోని జాతీయత భావానికి, కఠోరదీక్షకు నిదర్శనలు. జలియన్ వాలాబాగ్: డయ్యర్ మిగిల్చిన చేదు జ్ఞాపకం బ్రిటిష్ పాలకుల చట్టాలను వ్యతిరేకిస్తూ సమావేశమైన ప్రజల మీద జనరల్ డయ్యర్ ముందస్తు ప్రకటన లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ప్రదేశం పేరు జలియన్ వాలాబాగ్. ఇది పంజాబ్, అమృత్‌సర్‌లో ఉంది. వేలాది మంది ప్రాణాలను హరించిన దుర్ఘటన 1919, ఏప్రిల్ 13వ తేదీన జరిగింది. దేశం కోసం నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వారి జ్ఞాపకార్థం స్మారకం, అమరజ్యోతి, ప్రతీకాత్మక శిల్పాలు ఉన్నాయి. మౌనంగా నివాళులు అర్పించే లోపే మనోఫలకం మీద ఆనాటి బాధాకరమైన దృశ్యం కళ్ల ముందు నిలిచి, హృదయం ద్రవించిపోతుంది. మనదేశ చరిత్రలో అత్యంత కిరాతకుడిగా ముద్ర వేసుకున్న జనరల్ డయ్యర్ మీద బ్రిటిష్ ప్రభుత్వం... జలియన్ వాలా బాగ్ సంఘటన ఆధారంగా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. ఝాన్సీ: వీర తిలకం మనకు ఝాన్సీ పేరుతోపాటు రాణి లక్ష్మీబాయ్ పేరు పలకనిదే సంపూర్ణంగా అనిపించదు. బ్రిటిష్ పాలకుల మీద తొలినాళ్లలో కత్తి ఎత్తిన వీరనారి లక్ష్మీబాయ్. తొలి స్వాతంత్య్ర సమరంలో లక్ష్మీబాయ్ బ్రిటిష్ సేనలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించింది. ఆమె స్మారకాలు మూడు చోట్ల ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ కోట, నాటి ఝాన్సీ రాజ్యంలోని (మధ్యప్రదేశ్) పూల్‌బాగ్‌లో ఆమె సమాధి, స్మారక చిహ్నాలున్నాయి. వారణాసిలో ఆమె పుట్టిన చోట కొత్తగా మరో స్మారకనిర్మాణం జరిగింది. ఇందులో మణికర్ణిక పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాణిగా బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఘట్టాలన్నీ కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్యటించి తీరాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. బారక్‌పోర్: మంగళ్‌పాండే పేల్చిన తుపాకీ కోల్‌కతాలోని బారక్‌పోర్ కంటోన్మెంట్ ఏరియాలో మంగళ్‌పాండే జ్ఞాపకార్థం ‘షాహీద్ మంగళ్ పాండే మహా ఉద్యాన్’ పేరుతో విశాలమైన పార్కును నిర్మించారు. మంగళ్‌పాండే బ్రిటిష్ అధికారుల మీద దాడి చేసిన తర్వాత అతడిని ఉరితీసిన ప్రదేశం ఇది. ఈస్టిండియా కంపెనీలో సిపాయిగా చేరిన పాండే సిపాయిల తిరుగుబాటులో కీలకపాత్ర వహించాడు. పాండేని బ్రిటిష్ పాలకులు 1857, ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఉరితీశారు. ఆ ప్రదేశంలో ఆయన స్మారక చిహ్నం ఉంది. -
మేఘాలలో తేలిపొమ్మని!
‘దేఖో అప్నా దేశ్’. ఐఆర్సీటీసీ సరికొత్త నినాదం ఇది. కోవిడ్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో కొత్త సంవత్పరం వచ్చిందంటే చాలు నగరవాసులు ‘చలో టూర్’ అంటూ రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బ్యాంకాక్, దుబాయ్, శ్రీలంక వంటి విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ‘మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిద్దాం’ అనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ ప్యాకేజీలను సిద్ధంచేసింది. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం, పిల్లల ఆన్లైన్ చదువులు వంటి వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ ప్యాకేజీలు సరికొత్త ఉత్సాహాన్నివ్వనున్నాయి. మధ్యప్రదేశ్, అండమాన్, మేఘాలయ, హంపీ తదితర ప్రాంతాల కోసం ఐఆర్సీటీసీ తాజాగా డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. – సాక్షి, సిటీబ్యూరో చలో హంపీ.. హంపీ– బాదామి– ఐహోల్– పట్టడక్కల్ ప్రాంతాల పర్యటన జనవరి (2021) 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. ఈ పర్యటనలో మొదటి రోజు (29) ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోస్పేట్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు. అనెగుండి, పంపానది, తుంగభద్ర డ్యామ్ తదితర ప్రాంతాల పర్యటన అనంతరం హోస్పేట్ చేరుకుంటారు. రెండోరోజు హోస్పేట్ నుంచి హంపీ వెళ్తారు. విఠల, విరూపాక్ష ఆలయాలు, క్వీన్స్బెత్, లోటస్ మహల్ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. మూడోరోజు బాదామి గుహలను సందర్శిస్తారు. అనంతరం ఐహోల్, పట్టడక్కల్ చారిత్రక కట్టడాల సందర్శన అనంతరం నాలుగోరోజు హోస్పేట్ మీదుగా తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని వసతులతో కలిపి ఒక్కొక్కరికి రూ.15,750 చొప్పున చార్జీ ఉంటుంది. 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.12,750 చొప్పున ఉంటుంది. చదవండి: మంచు ముసుగులో అరకు అందాలు అందాలలో అహో మహోదయం .. – అసోం, మేఘాలయలోని అందమైన ప్రదేశాలను వీక్షించేందుకు మరో ప్యాకేజీ. ఇది మార్చి (2021) 12 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 12న ఉదయం5.20 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8 గంటలకు గౌహతి చేరుకుంటారు. 17న ఉదయం 8.40 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని సదుపాయాలతో పెద్దవాళ్లకు రూ.44,683, పిల్లలకు రూ.26,353 చొప్పున చార్జీలు ఉంటాయి. చదవండి: సిక్కోలు ‘నయాగరా’ అమేజింగ్ అండమాన్.. అండమాన్, నికోబార్ పర్యటన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఉంటుంది. ఈ టూర్లో సెల్యూలర్ జైల్, రాస్, హావ్లాక్ ఐలాండ్స్, అందమైన సాండీ బీచెస్, వివిధ రకాల జంతువులు, పక్షులతో కూడిన వైవిధ్య ప్రదేశాలను వీక్షించవచ్చు. పెద్దవాళ్లకు రూ.43,416, పిల్లలకు రూ.29,686 చొప్పున చార్జీ ఉంటుంది. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇండోర్, ఉజ్జయిని, మాండు తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు కొనసాగుతుంది. కాలభైరవ టెంపుల్, మంగళ్‌నాథ్ మందిర్, జంతర్‌మంతర్, తదితర ప్రాంతాలను పర్యటిస్తారు. పెద్దవాళ్లకు రూ.25,250, పిల్లలకు 17,100 చొప్పున చార్జీ ఉంటుంది. -
టూరిజం ఢమాల్
-
గ్రీనరీ.. సీనరీ.. చూసి రావాలి మరి!
సాక్షి, హైదరాబాద్ : కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరం నుంచి సిద్దిపేట వైపు ఉన్న శామీర్‌పేటకు వెళ్తే చాలు.. భూమికి పచ్చని రంగేసినట్టు కనిపించే గ్రీనరీ.. పెద్ద చెరువు అందాల సీనరీ.. రిసార్టుల్లో విడిది.. కట్టమైసమ్మ తల్లి సన్నిధి.. ఇలా ఎన్నెన్నో అందాలు కట్టిపడేస్తాయి.. పల్లె ముచ్చట్లు ఆలోచనల్లో ముంచెత్తుతాయి.. రుచులు ఆహా అనిపిస్తాయి.. స్టార్ రిసార్టులు పట్నం వాసులను రారమ్మంటున్నాయి. శామీర్‌పేట్: శామీర్‌పేట పెద్దచెరువును పాలకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను కేటాయించగా పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరానికి అతిచేరువలో ఉన్న శామీర్‌పేట పర్యాటక ప్రాంతంగా మారనుంది. అంతేగాక చెరువు సమీపంలో పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో శని, ఆది వారాల్లో కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు పట్టణ ప్రజలు. ప్రత్యేక ఆకర్షణగా.. ► శామీర్‌పేట పెద్దచెరువులో ’బంగారు తెలంగాణ’ అని తెలుగు అక్షరాలతో ఏర్పాటు చేసిన లోగో అందరినీ ఆకర్షిస్తోంది. అంతేగాకుండా పెద్దచెరువు పరిసరాల్లో పర్యాటకులు ► కూర్చొనేందుకు వివిధ పండ్ల ఆకారాల్లో కుర్చీలు, గజబోసులు ► పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. వీటిని రంగులతో సుందరంగా ► తీర్చిదిద్దుతున్నారు. చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన గజబోసులపై ► రకారకాల బొమ్మలతో సుందరంగా అలంకరిస్తున్నారు. -
మదిదోచే అందాల జలపాతాలు.. ఒక్కసారైనా..
కావేరి, కుమారధార, ఆర్కావతి ఇలా ఎన్నో నదులు ఆలంబనగా పుట్టిన జలపాతాల సోయగాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. జలధారలు కురిపిస్తూ శ్వేతవర్ణంలో పొంగిపొర్లే జలాల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఉరుకుల పరుగుల జీవితంలో నూతన ఆనందాన్ని అందుకోవడానికి జలపాతాల వీక్షణం ఉపకరిస్తుంది. సాక్షి, బెంగళూరు: రాచనగరి చుట్టుపక్కల ఉన్న జలపాతాలు పర్యాటక రంగానికి ఊపిరి పోస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం మధ్య సెలవురోజుల్లో జలపాతాలను వీక్షించడం మనసంతా కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇందుకోసమే బెంగళూరుతో సహా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. మైసూరు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ఐదు జలపాతాలు చెలవర, చుంచనకట్టె, మల్లాలి, శివసముద్ర, చుంచి వేసవి మినహా మిగతా కాలమంతా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంటాయి. చెలవర జలపాతం మైసూరు నుంచి 125 కిలోమీటర్లు, విరాజ్‌పేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చెయ్యందనే గ్రామానికి సమీపంలో ఉన్న చెలవర జలపాతం ఉంది. సుందర జలపాతాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. స్థానిక పర్యాటకులకు మాత్రమే ప్రాచుర్యం పొందింది. జలపాతం బేస్ వద్ద ఏర్పడిన చెరువు వర్షాకాలంలో అంచు వరకు నిండిపోతుంది. ఇందులో దిగడం ప్రమాదంతో కూడుకున్నది. దూరం నుంచి జలపాతాన్ని వీక్షించడం ఉత్తమం. కావేరి నదిపై చుంచనకట్టే మైసూరు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై చుంచనకట్టే జలపాతం ప్రసిద్ధి చెందింది. తప్పక చూడాల్సిన ప్రదేశం. సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రకాశం కారణంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. సమీపంలోనే కోదండ రామాలయం ఉంది. చుంచనకట్టే జలపాతం నీటిలోప్రశాంతంగా స్నానం చేసి రాముని ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శివన సముద్ర జలపాతం మైసూరు నుంచి 78 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై అందమైన శివనసముద్ర జలపాతం ఉంది. ఇది రెండు జలపాతాలుగా విడిపోతుంది. అవి పశ్చిమాన గగనాచుక్కి, తూర్పున భరచుక్కి జలపాతం. జలపాతంతో పాటు చూడదగ్గ ప్రకృతి దృశ్యాల వల్ల ఏడాది పొడవునా పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఆర్కావతి నదిపై చుంచి మైసూరు నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఆర్కావతి నదిపై ఉంది. రాముడు తన ప్రవాసంలో బస చేసిన మరో ప్రదేశంగా భావిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వారంతపు సెలవుల్లో విహరించేందుకు సరైన ప్రదేశం. దట్టమైన అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మళ్లళ్లి ఫాల్స్ మైసూరు నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మల్లాలి జలపాతం కుమారధార నదిలో కలిసిపోయి ఉంటుంది. రాతి భూ భాగాలు, పశ్చిమ కనుమల పచ్చని వృక్షాలు కలిసి మనోహరంగా దర్శనమిస్తాయి. యువత ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ఉంది. అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. చుంచి ఫాల్స్ చుంచన కట్టె ఫాల్స్ -
పర్యాటకంలో ‘పచ్చ’దొంగలు
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించి అనేక ఉత్సవాల్లో కోట్లు నిధులు దుర్వినియోగమయ్యాయి. అప్పట్లో గుంటూరు జిల్లా కలెక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక కాంట్రాక్టర్‌కు రూ.1.40 కోట్లు సొమ్ము చెల్లించిన కేసులో గుంటూరు జిల్లాలో పర్యాటక అధికారి హీరాపఠాన్ అరెస్టు అయిన విషయం విదితమే. వాస్తవంగా అప్పట్లో జరిగిన ఉత్సవాల వ్యయం పైనా సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్వహించిన ఉత్సవాలు ఇవే... విభజన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెడతానంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలివిడిగా పర్యాటక ఉత్సవాలు నిర్వహించారు. ఏపీటీఏను చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. ఇందులో పనిచేసే అధికారులంతా టీడీపీ సానుభూతిపరులే. కాంట్రాక్టు పద్ధతిలో కీలకపదవుల్ని అదిష్టించి నిధులు పర్యాటకాభివృద్ధి పేరుతో తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు. గత ఐదేళ్లలో నావిషో, ఎయిర్‌షో, సంక్రాంతి సంబరాలు, ఇంటర్నేషనల్ మెగా ఫెస్టివల్, బుద్ద జయంతి, దీపావళి ఉత్సవాలు, నాగాయలంక బీచ్ ఫెస్టివల్, సోషల్‌మీడియా సమిట్, అమరావతి ధియేటర్ పెస్టివల్, పెలికాన్ బర్ట్స్, గోబెల్శాంతి, మసూలబీచ్ పెస్టివల్, ఎఫ్1హెచ్2ఓ, కొండపల్లి ఉత్సవాలు, కొటప్పకొండ ఉత్సవాలు, కొండవీడు ఉత్సవాలు, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ తదితర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నీ 2017 తరువాతనే జరిగాయి. ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు ఒకొక్క ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలన్నీ అధికారుల జేబు సంస్థలే. ఏలూరులోని ఒక సంస్థ ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఈ సంస్థ ఏపీటీఏలోని ఆర్డీ అండ్ ఈడీలోని కీలక అధికారికి చెందినదిగా ఆ సంస్థలోనే సిబ్బందే చెబుతున్నారు. కనీసం వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వకుండానే ఈ సంస్థలు ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీకు చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, స్పీకర్లకు ఈ సంస్థ ప్రతినిధులకు సన్నిహిత సంబధాలు ఉండటం వల్ల వర్క్ ఆర్డర్ లేకపోయినా ఉత్సవాలు నిర్వహించారని ఏపీటీఏలో చర్చ జరుగుతోంది. రికవరీ చేస్తారా? గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకపోయినా ఉత్సవాలు నిర్వహించేశారు. ఇప్పుడు ఆయా బిల్లులను ఏపీటీఏ అధికారులు అప్లోడ్ చేసి సొమ్ము చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగానే 2019 మార్చిలో నిర్వహించిన కొండవీటి ఉత్సవాల బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఉత్సవాల్లోనూ ఏలూరుకు చెందిన సంస్థ కొంత పనిచేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అడ్డగోలుగా చెల్లించిన రూ.1.40 కోట్లు ఏవిధంగా కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ కాంట్రాక్టర్‌కు టీడీపీ నేతల పెద్దల ఆశీస్సులు ఉండటం గమనార్హం. పర్యాటకాభివృద్ధి తక్కువే... సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య తక్కువే. ఉత్సవాల్లో ఎక్కువగా అధికారులు, ఈ జిల్లా ప్రాంత వారే కనపడేవారు. వాస్తవంగా అప్పట్లో జరిగిన పర్యాటక ఉత్సవాలను ప్రజలు కూడా మరిచిపోయారు. ఇదే సొమ్ముతో భవానీద్వీపం లేదా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి ఉంటే స్థానిక ప్రజలకు ఉపయుక్తంగా వుండేది. -
ఈ మంచు ప్రాంతాలను చుట్టేసి రండి
భారత్‌లో ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మంచు ప్రదేశాలు ప్రత్యేకమైనవి. మంచు ప్రదేశాలను ఇష్టపడని వారు ఉండరు. నూతన సంవత్సర వేడుకలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్నిఇస్తాయి. జనవరిలో మంచు అధికంగా ఉండటంతో చలికాలంలో పర్యాటానికి మంచు ప్రదేశాలు చక్కని ఆప్షన్. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశాలు భూలోక స్వర్గంలా కనిపిస్తాయి. మరి అలాంటి మంచు ప్రదేశాలు భారత్‌లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా.. ఇండియాలో ది బెస్ట్ మంచు ప్రదేశాలేంటో ఓసారి తెలుసుకుందాం.. 1.గుల్మార్గ్(జమ్మూ-కశ్మీర్) కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదొకటి. గుల్మార్గ్ అంటే మంచు పూలదారి అని అర్థం. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రాంతమంతా శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. గుల్మార్గ్ ప్రాంతం అందం వర్ణించలేనిది. ఇక్కడి స్ట్రాబెర్రీ లోయలు, బయో స్పియర్ రిజర్వులు, గోల్ఫ్ కోర్స్, మహారాణి టెంపుల్ తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. జనవరిలో ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చూడటానికి క్యూ కడతారు. వింటర్ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్కేటింగ్, స్కీయింగ్ కూడా చేయవచ్చు. 2. ఔలి( ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లో ఉన్న ఔలి ప్రాంతం గర్వాలీ రీజియన్. రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఔలి అంటే పచ్చిక బయలు అని అని అర్థం. అంటే మంచు కొండల్లో ఉన్న పచ్చిక నేల అని. శీతాకాలంలో ఈ పచ్చదనాన్ని మంచు కప్పేస్తుంది. స్నో ఫాల్ చూడాలనుకునే వారికి ఇది చక్కని గమ్యస్థానం. స్కీ యింగ్ వంటి ఆటలు కూడా ఆడవచ్చు. ఔలి ప్రాంతానికి వెళ్తుంటే దారి వెంబడి ప్రవహించే నదులు కనిపిస్తాయి. ఈ నీరంతా మంచు కరిగిన నీరే. ఈ నదులు ఔలికి చేరుకునే పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 3.సోనా మార్గ్(జమ్మూ-కశ్మీర్) సోనా మార్గ్ అంటే బంగారు మైదానం అని అర్థం. సోనా మార్గ్ పట్టణం అంతా మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ పూసే బంగారు వర్ణపు పువ్వుల వల్ల ఈ ప్రాంతానికి సోనామార్గ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకుల ఆసక్తిని పెంచుతాయి. జనవరి మొదటి 15 రోజులు ఇక్కడ మంచు కురుస్తుంది. ముఖ్యంగా అన్ని ట్రెక్కింగ్ మార్గాలు సోనామార్గ్ నుంచే మొదలవుతాయి. చుట్టు ఉన్న కొలనులు, పర్వతాలు, సహజ ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శీతాకాలంలో ఈ ప్రాంతపు ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా నమోదవ్వడం వల్ల వాతావరణమంతా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 4. మనాలి( హిమచల్ ప్రదేశ్) మనాలి ప్రాంతం రాజధాని షిమ్లా నుంచి 260 కి. మీ దూరంలో ఉంది. అందమైన మనాలి ప్రాంతం మంచు యొక్క స్వర్గధామం. ఇది హనీమూన్ స్పాట్ కూడా. ఇక్కడ స్కీయింగ్, స్కేట్ బోర్డింగ్, స్లోప్ స్లెడ్జింగ్ వంటి మంచు క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మనాలిలో రోహతాంగ్ పాస్, చంద్రఖని పాస్, సోలాంగ్ లోయ, సుల్తాన్పుర ప్యాలెస్ వంటి ప్రదేశాలు చుట్టేయవచ్చు. 5. యామ్ తాంగ్ ( సిక్కిం) సిక్కిం పర్యాటక ప్రదేశాలలో యామ్తాంగ్ అందమైన పర్వత లోయ ప్రముఖంగా నిలుస్తుంది. దీనిని పువ్వుల లోయ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో ఈ వ్యాలీ ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే చైనా, టిబెట్ సరిహద్దులు ఉంటాయి. దేశంలోని ఈశాన్య వైపున ఉన్న ఈ అందమైన ప్రదేశంలో జనవరిలో మంచు కురుస్తుంది. ఇక్కడికి దగ్గర్లోనే జీరో పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి అవసరం. న్యూ ఇయర్‌కు మంచు పర్వతాలను చుట్టేసి రావడానికి జనవరి సరైన సమయం. ఇక ఆలస్యం ఎందుకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓ రౌండ్ వేయండి. -
అక్కడ చూడదగిన ప్రదేశాలెన్నో...
ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం ముథోల్ మండలం బాసరలో నెలవైంది. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకారపూజలు జరిపించాకే బడుల్లోకి పంపుతారు. పర్వదినాల్లో ఇక్కడ భక్తులు లక్షల్లో తరలివస్తారు. గోదావరి నది ఒడ్డున సూర్యేశ్వరస్వామి ఆలయం ఉంది. సరస్వతీ అమ్మవారి ఆలయం పక్కనే కాళికమాత, దత్తాత్రేయ, వ్యాసమహర్షి ఆలయాలు నెలకొన్నాయి. బాసర పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇక్కడికి వచ్చే వారు చుట్టుప్రక్కల ఆలయాలను దర్శించుకోవచ్చు. బాసరకు చేరుకునేందుకు రైలు మార్గం కూడా ఉంది. బాసర స్టేషన్‌దాటితే మహారాష్ట్రలోని ధర్మాబాద్ స్టేషన్ వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం, సికింద్రాబాద్, హైదరాబాద్ డిపోల నుంచి బాసరకు బస్సులు వస్తుంటాయి. – భైంసా(ముథోల్) భైంసా మండలంలో... భైంసా నుంచి నాందేడ్ వెళ్లే మార్గంలో 61వ జాతీయ రహదారిపై బోంద్రట్ ఎక్స్‌రోడ్డు వద్ద నుంచి సిరాల వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో సిరాల గ్రామం కనిపిస్తుంది. భైంసా – బాసర మార్గంలోనూ ఇలేగాం గ్రామం మీదుగా ఆరు కిలో మీటర్ల దూరంలోని సిరాల గ్రామం చేరుకోవచ్చు. గుట్ట చుట్టూ ఉన్న ఇనుపరాళ్లపై గతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. అగ్గి పెట్టె లేని రోజుల్లో దూది సహాయంతో ఈ బండల మధ్యన కొట్టి మంటను చేసే వారని పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు. గుట్టచుట్టూ గృహాలే... ఇనుపరాళ్ల గుట్టపై చుట్టూ గృహాలున్నాయి. ఈ సొరంగ మార్గాలు రాజుల కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతారు. సిరాల గుట్టపై ఆలయం పక్కనే ఉన్న గృహాల్లో అప్పట్లో పుట్టెడు మేకలు వదిలితే బాసర గోదావరి సమీపంలోని గృహాల్లో కనిపించాయని ఇప్పటికీ చెబుతారు. రానురాను వీటిపై ఆశ్రద్ధ చేయడంతో ప్రస్తుతం గృహాల్లో పిచ్చిమొక్కలు మొలకెత్తాయి. విష సర్పాలు తిరుగుతున్నాయి. ఏళ్లనాటి మర్రి చెట్టు ఎడ్లబండ్లపై, ద్విచక్రవాహనాలపై ఇక్కడికి చేరుకున్న వారు గుట్ట ఎక్కే ప్రాంతంలో ఉన్న మర్రి చెట్టు నీడలో సేదతీరుతారు. టెంట్ అవసరం లేకుండా 600 మంది ఒకే సారి సేదతీరేలా నీడను ఇచ్చే మర్రి చెట్టు వద్ద ఆగుతారు. ఏళ్లనాటి మర్రి చెట్టు ఊడలు సైతం భూమిలో చొచ్చుకుపోయాయి. ఎటు చూసినా మర్రి చెట్టు ఊడలే కనిపిస్తాయి. భైంసా మండలం సిరాలగుట్టపై ఉన్న మర్రిచెట్టు, సిరాలలో ఇనుపరాళ్ల గుట్ట గుట్టపై హరిహారాలయం సిరాల ఇనుపరాళ్ల గుట్టపై ప్రసిద్ధి చెందిన హరిహారాలయం కనిపిస్తుంది. ఎక్కడ లేని విధంగా ఆలయంలో రెండు శివలింగాలు కనిపిస్తాయి. హరిహారాదులే ద్విలింగాలుగా వెలిశారని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తారు. శ్రావణ మాసంతోపాటు ఇతర పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఇనుపరాళ్ల గుట్టను, గృహాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. గుట్ట పక్కనే నైజాం కాలంలో నిర్మించిన చెరువును చూసేందుకు ఆసక్తి చూపుతారు. లోకేశ్వరం మండలంలో లోకేశ్వరం మండలంలో గోదావరి నది ఒడ్డున ప్రముఖ శివాలయం ఉంది. బ్రహ్మేశ్వరఆలయంగ పిలువబడే ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆలయం వద్ద గోదావరి నదిలో స్నానాలు చేసి పూజలు చేస్తుంటారు. కాకతీయులకాలంలో నిర్మించిన పురాతన ఆలయం ఇది. ఇక్కడ కాకతీయులు రాసిన శిలాశాసనాలు బండరాళ్లపై ఇప్పటికీ ఉన్నాయి. ముథోల్ మండలంలో ముథోల్ మండలంలో స్వయంబుగా వెలిసిన పశుపతినాథ్ ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తుంది. ప్రతి సోమవారం ఇక్కడ భక్తులు కిక్కిరిసికనిపిస్తారు. ముక్తేశ్వర ఆలయం, శివాలయం, రామ మందిరంలోనూ పూజలు జరుగుతాయి. ఎడ్బిడ్ గ్రామంలోని మల్లన్నస్వామి ఆలయం, కారేగాంలోని ఎల్లమ్మ ఆలయాల్లో ప్రతి ఆదివారం పూజలు చేస్తారు. తానూరు మండలంలోని విఠలేశ్వర ఆలయం, బోసి గ్రామంలోని కాశీవిశ్వేశ్వర ఆలయం, బెల్‌తరోడలోని దత్తాత్రేయ ఆలయాల్లోనూ ప్రతినిత్యం పూజలు జరుగుతాయి. కుంటాల మండలంలో కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో నిర్మించిన సాయిబాబా ఆలయానికి ప్రతి రోజు లక్షల సంఖ్యల్లోనే భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం అభినవ షిర్డీగా పేరు పొందింది. భైంసా – నిర్మల్ వెళ్లే 61వ జాతీయ రహదారిపై కల్లూరు గ్రామ చేరువలోనే గుట్టపై సాయిబాబా ఆలయం కనిపిస్తుంది. ప్రతి గురువారం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. షిర్డీ తరహాలోనే కల్లూరు ఆలయంలోనూ ప్రతి నిత్యం పూజలు చేస్తుంటారు. కుంటాలలో శ్రీకృష్ణ మందిరం ఉంది. ఇక్కడే గజ్జలమ్మ ఈ ప్రాంతవాసుల ఇలవెల్పుగా పూజలు అందుకుంటుంది. ప్రతి ఆదివారం కేశఖండనాలు, నామకరణాలు జరుపుతూ పక్క రాష్ట్రం నుంచి భక్తులు వస్తారు. సరిహద్దు ప్రాంతంలో కుభీర్ మండలం సిర్పెల్లిదాటగానే సరిహద్దు మహారాష్ట్ర గ్రామమైన పాలజ్ గ్రామం కూడా ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ కోరికలు తీర్చే కర్రగణేషుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజు భక్తులు వస్తుంటారు. గణేషున్ని మొక్కుకున్నవారు ముడుపులు కట్టి వెళ్తారు. మొక్కులు తీరగానే మళ్లీ వచ్చి ముడుపులను విప్పుతారు. ప్రతి వినాయక చవితికి ఇక్కడ జనం కిక్కిరిసి ఉంటారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో దీక్షలు తీసుకుంటారు. కుభీర్ మండలంలో విఠలేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ మండలంలోని పార్డి(బి)లో రాజరాజేశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రతి సోమవారం కనిపిస్తుంటారు. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో స్వామిపేరే ఎవరో ఒకరికి పెట్టుకోవడం గమనార్హం. -
కరీంనగర్‌కు మణిహారం
కరీంనగర్: కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో జిల్లా అత్యద్భుతమైన టూరిజం స్పాట్‌గా ఎదుగుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరశివారులో నిర్మితమవుతున్న వంతెన ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఇప్పటికే డిజైనింగ్ పూర్తయిందని, మరో ఏడాదిలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వివరాలను సంబంధిత కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగరానికి తలమానికంగా కేబుల్‌బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిలుస్తాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు. నగరశివారులోని బైపాస్‌రోడ్డు సమీపంలో ఈ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. వరంగల్ నుంచి కరీంనగర్ రహదారిలో సదాశివపల్లి నుంచి మానేరు మీదుగా కమాన్‌చౌరస్తా వరకు ఈ రోడ్డు నిర్మాణం కానుందని అన్నారు. ఆరులేన్ల రహదారి తోపాటు కేబుల్ బ్రిడ్జి సహితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి డిజైనింగ్ పూర్తయిన నేపథ్యంలో బ్రిడ్జి టవర్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జి డిజైన్‌ను టర్కీ కంపెనీ ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో రూపొందించారని తెలిపారు. రూ.185 కోట్ల ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే మొదటిదని అన్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే కరీంనగర్ పర్యాటకంగా నంబర్‌వన్ పోజిషన్లో ఉంటుందన్నారు. వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చేవారికి ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గతంలో కంటే కొద్దిగా డిజైనింగ్ మార్చామని, సదాశివపల్లి వద్ద బ్రిడ్జిపైకి ఎక్కేవారు నేరుగా హౌసింగ్ బోర్డు వద్దనే రోడ్డు దిగేలా అండర్‌పాస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు ప్రధాన ఫిల్లర్ల మధ్య 650 ఫీట్ల దూరం ఉంటుందని, మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్, పూసాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
టూరుగల్లు
జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే శిల్పకళా సంపద.. పచ్చని అటవీ ప్రాంతం.. ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు.. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలు ఉమ్మడి ఓరుగల్లు సొంతం. చారిత్రక, వారసత్వ నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతంగా శోభిల్లుతోంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు దేశీయులనే కాదు.. విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరారుతున్నాయి. ఆహ్లాదాన్ని, అనందాన్ని పంచుతున్న సుందరమైన దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో వేయిస్తంభాల దేవా యలం, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, వనవిజ్ఞా న్, కాజీపేట దర్గా, ఫాతిమా, మడికొండలోని మెట్టుగుట్ట, ఐనవోలు మల్లన్న దేవాలయం పర్యాటకులు ఆకట్టుకుంటున్నాయి. వేయిస్తంభాల దేవాలయం శిల్పకళా తోరణాలు అత్యద్భుతం. వరంగల్ కోటలోని తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో పాకాల సరస్సు ప్రకృతి రమణీయతను పంచుతోంది. అన్నారం షరీఫ్ దర్గాను కుల మతాలకు అతీతంగా దర్శిస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యాటక ప్రాంతంగా అలారారుతోంది. గణపురం కోటగుళ్లు, కాకతీయుల కాలంలో చక్కని కళా సంపదతో నిర్మించిన రామప్ప దేవాల యం, పాండవుల గుట్టలు, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలు, తాడ్వాయి, ఏటూరునాగారం, మహాదేవ్‌పూర్ అటవీ అందాలు, దామెరవాయి ఆది మానవుల గుహలు, బొగత జలపాతం, మల్లూరు దేవా లయం, మైలారం గుహలు పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాండవుల గుట్టల్లో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. లక్నవరంలోని వేలాడే వంతెన ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లాలో కురవి, అనంతారంలోని దేవాలయాలు, మాటేడు ఆలయాలు, భీమునిపాదం వద్ద జలపాతం, బయ్యారం చెరువు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జనగామ జిల్లాలో ఖిలాషాపురంలోని సర్వాయి పాపన్న కోట, జఫర్‌గఢ్ కోట, పాలకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పర్యాటకులను ఆకరిస్తున్నాయి. కోటి మొక్కులు... మేడారం జాతర పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్క మేడారం జాతర కారణంగానే పర్యాటక రంగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్‌ను మించిపోతోంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సగటున ప్రతి జాతరకూ కోటి మంది వస్తున్నారు. ఇలా వచ్చి పోయే భక్తులు మార్గమధ్యలో లక్నవరం, రామప్ప, ఖిలావరంగల్ వంటి చారిత్రక ప్రాంతాలను పర్యటిస్తున్నారు. జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య రెండు కోట్లకు చేరుతోంది. జాతర లేని ఏడాదిలో ఈ సంఖ్య పదిహేను లక్షల దగ్గర ఉంటోంది. దీంతో పాటు కాళేశ్వరం జయశంకర్ జిల్లాలో కలవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు పెరిగారు. అంకెల్లో... ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని పర్యాటకులను అకర్షిస్తోంది. వరంగల్ ఫోర్ట్, వేయిస్తంభాలు, భద్రకాళి ఆలయాలు, రామప్ప, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, పాం డవులగుట్ట, కోటగుళ్లు, మేడారం సమ్మక్క–సారలమ్మ వన దేవతలను సందర్శించేందుకు దేశ, విదేశీయులు భారీ సంఖ్యలో వస్తున్నారు. మేడారం జాతర జరిగే ఏడాది పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2015లో దేశీయ పర్యాటకులు 98,09,162 మంది రాగా, విదేశీ పర్యాటకులు 1,794 మంది వచ్చారు. 2016లో 2,62,31,497 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,987 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఇందులో కోటి మంది వరకు మేడా రం జాతరకు వచ్చిన వారుంటారు. 2017 నవంబర్ మాసం వరకు 23,45,460 మంది దేశీయ పర్యాటకులు రాగా, 1,237 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. వంతెనలతో.. కాళేశ్వరం, ఏటూరునాగారం వద్ద గోదావరిపై కొత్తగా వంతెనలు నిర్మాణం జరగడంతో పర్యాటక రంగం పుంజుకుంది. వరంగల్, హైదరాబాద్ వాసులకు దగ్గరి దారి అందుబాటులోకి వచ్చినట్లయింది. ఫలితంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బొగత, లక్నవరం వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇటీవల మల్లూరుకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా వెంకటాపురం మండలంలో మరో జలపాతం, పాండవులగుట్ట రాక్ క్లైంబింగ్, తాడ్వాయి అడ్వెంచర్ టూర్, ఏకో టూరిజంను పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తోంది. -
పర్యాటక ప్రియులకు స్వర్గధామం
పెనుకొండ : విజయనగర రాజుల రెండవ రాజధాని పెనుకొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తోంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం. కొండ పై భాగంలో శత్రుదుర్బేధ్యమైన ‘ఖిల్లా’ నిర్మించారు. ఖిల్లాపై నుంచి శత్రువుల రాకను కిలోమీటర్ల దూరం నుంచే కనిపెట్టేవారు. నరసింహస్వామి దేవాలయం.. కొండపై బ్రహ్మతీర్థము (కొలను)కు దక్షిణంగా శ్రీవేట్రాయుడు అని పిలిచే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించారు. తను ఎంతగానో పూజించే నరసింహస్వామి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తెల్లవారుజామునే కృష్ణదేవరాయలు ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానమాచరించి తడి గుడ్డలతోనే మంటపాల కిందుగా వెళ్లి నరసింహస్వామిని పూజించేవాడని భక్తుల నమ్మకం. గగన్‌మహల్.. పెనుకొండ రాజరికపు చరిత్రలో విలువైన కట్టడాల్లో గగన్‌మహల్ ప్రధానమైనది. ఇక్కడ విజయనగర రాజులు పాలన సాగించినా వీరికి మునుపే ఈ కట్టడాన్ని నిర్మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణంలోని ఊరువాకిలి ఆంజనేయస్వామి దేవాలయం, పవిత్రబాబయ్య దర్గా, జైన మతాన్ని ప్రతిబింబించే జైన ఆలయాలు, శివాలయాలు, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా విశాలమైన బావులు, కోటగోడలు, 365 దేవాలయాలు ఇతర కట్టడాలు పెనుకొండ పుణ్య చరిత్రను తెలుపుతాయి. విజయనగర రాజుల పాలనకు పెనుకొండ కేంద్రబిందువు కావడంతో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహం సైతం ఏర్పాటు చేశారు. ఇలా చేరుకోవచ్చు.. జిల్లా కేంద్రం అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. బెంగళూరు, లేక హిందూపురం వెళ్ళే ఏ బస్సయినా ఇక్కడ నిలుపుతుంది. కాచిగూడ, ప్యాసింజర్, ప్రశాంతి తదితర రైళ్లలోనూ చేరుకోవచ్చు. -
‘పుర్రె’కో బుద్ధి!
చూస్తుంటే ఫ్రాన్స్ విచిత్రమైన వినోదాలకు నెలవులా ఉంది! అందుకే, ఈసారి ‘వర్ణం’లోని మూడు అంశాలూ అక్కడివే! చిత్రంలోని ఇద్దరమ్మాయిలు ఉల్లాసంగా ఫొటోలు తీసుకుంటున్నది ఒకప్పటి శవాల నేలమాళిగలో! 18వ శతాబ్దం చివర్లో పారిస్ నగరంలో శ్మశనాలు చాలకపోవడంతో ఇక్కడ పూడ్చేవారు. సుమారు 60 లక్షల మందిని ఇక్కడ ఖననం చేసినట్టుగా చెబుతారు. ఆ సంఖ్యను నిర్ధారించేది పేర్చిపెట్టిన పుర్రెలూ, ఎముకలూ! ఈజిప్ట్, ఇటలీలాంటి ఇంకా ఎన్నో దేశాల్లోనూ ఇలాంటి నేలమాళిగలు ఉన్నప్పటికీ చాలావరకు అవి మతంతో ముడిపడిన క్రతువులు నిర్వహించడానికి ఉద్దేశించినవి. ‘క్యాటకాంబ్స్ ఆఫ్ పారిస్’ మాత్రం కేవలం ‘మృతుల రద్దీ’ని తట్టుకోవడానికి తవ్వింది! చిత్రంగా, ఇప్పుడది పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక సమయం తర్వాత మరణం కూడా తీపిగుర్తేనన్నమాట! -
స్కూబా డైవింగ్ భలే ఇష్టం
చిట్‌చాట్: ‘మలేషియా ప్రకృతి, పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ కోసం చాలా సార్లు మలేషియా వెళ్లా. అక్కడి ఐలాండ్స్ కనువిందు చేస్తాయి. దీవుల్లో స్కూబా డైవింగ్ మరపురాని అనుభూతి..’ అంటున్నారు నటి శ్రీయ. ‘మనం’ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించిన శ్రీయ గురువారం సైమా అవార్డుల అనౌన్స్మెంట్ కార్యక్రమంలో మెరిసారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో మాట్లాడుతూ ‘ కెరీర్ ప్రారంభంలో రెండేళ్లు తెలుగు ప్రేక్షకులు నన్ను భరించారు. తమిళ, మళయాల, కన్నడ పరిశ్రమల్లో నటించినా టాలీవుడ్ అంటే నాకు ప్రత్యేకాభిమానం. రజనీకాంత్‌తో ‘శివాజీ’ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఫీలయ్యా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అందరూ నాకు ఎంతో సహకారం అందించారు’ అని గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ. ‘విదేశాల్లో దక్షిణాది సినిమాలు పాపులరయ్యాయి. షూటింగ్‌లు, ఇతర పనులపై విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి క్యాబ్ డ్రైవర్లు కూడా మన సినిమాల గురించి మాట్లాడుకోవడం విన్నా. సైమా అవార్డులు మలేషియాలో నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతి కచ్చితంగా పెరుగుతుంది. సెప్టెంబర్ 11న నా బర్త్‌డే. మరుసటిరోజే సైమా అవార్డ్స్. ఈసారి నా పుట్టినరోజును మలేషియాలో జరుపుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.