సాక్షి, హైదరాబాద్ : కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరం నుంచి సిద్దిపేట వైపు ఉన్న శామీర్‌పేటకు వెళ్తే చాలు.. భూమికి పచ్చని రంగేసినట్టు కనిపించే గ్రీనరీ.. పెద్ద చెరువు అందాల సీనరీ.. రిసార్టుల్లో విడిది.. కట్టమైసమ్మ తల్లి సన్నిధి.. ఇలా ఎన్నెన్నో అందాలు కట్టిపడేస్తాయి.. పల్లె ముచ్చట్లు ఆలోచనల్లో ముంచెత్తుతాయి.. రుచులు ఆహా అనిపిస్తాయి.. స్టార్ రిసార్టులు పట్నం వాసులను రారమ్మంటున్నాయి.
శామీర్‌పేట్: శామీర్‌పేట పెద్దచెరువును పాలకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను కేటాయించగా పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరానికి అతిచేరువలో ఉన్న శామీర్‌పేట పర్యాటక ప్రాంతంగా మారనుంది. అంతేగాక చెరువు సమీపంలో పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో శని, ఆది వారాల్లో కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు పట్టణ ప్రజలు.
ప్రత్యేక ఆకర్షణగా..
► శామీర్‌పేట పెద్దచెరువులో ’బంగారు తెలంగాణ’ అని తెలుగు అక్షరాలతో ఏర్పాటు చేసిన లోగో అందరినీ ఆకర్షిస్తోంది. అంతేగాకుండా పెద్దచెరువు పరిసరాల్లో పర్యాటకులు ► కూర్చొనేందుకు వివిధ పండ్ల ఆకారాల్లో కుర్చీలు, గజబోసులు
► పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. వీటిని రంగులతో సుందరంగా
► తీర్చిదిద్దుతున్నారు. చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన గజబోసులపై
► రకారకాల బొమ్మలతో సుందరంగా అలంకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment