ఫొటోలో కనిపిస్తున్నది స్కాట్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఒక చిన్నదీవి. దీని పేరు ప్లాడా ఐలాండ్. లండన్‌కు ఉత్తరాన దాదాపు 750 కిలోమీటర్ల దూరంలో ఉందిది. దీని విస్తీర్ణం 28 ఎకరాలు. ప్రస్తుతం ఇది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఒక ఐదు పడకగదుల ఇల్లు, ఒక కాటేజీ, రెండు రిసెప్షన్ ఏరియాలు తదితర సౌకర్యాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, ఈ దీవిలో అద్భుతమైన లైట్‌హౌస్ కూడా ఉంది.
ఈ కట్టడాలే కాకుండా, దాదాపు వంద జాతులకు చెందిన పక్షులు, రకరకాల జాతులకు చెందిన వృక్షసంపద ఈ దీవికి అదనపు ఆకర్షణ. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ దీనిని అమ్మకానికి పెట్టింది. దీని ధర 3.50 లక్షల పౌండ్లు (సుమారు రూ.3.50 కోట్లు). లండన్‌లోని ఇళ్లతో పోల్చుకుంటే, దీని ధర కారుచౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment