‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్‌ ఇచ్చిన ప్రభుత్వం! | Italy is offering to pay people 12 lakhs to move to the island of Sardinia | Sakshi
Sakshi News home page

‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్‌ ఇచ్చిన ప్రభుత్వం!

Published Sun, Sep 4 2022 2:04 PM | Last Updated on Mon, Sep 5 2022 12:34 PM

Italy is offering to pay people 12 lakhs to move to the island of Sardinia - Sakshi

మధ్యదరా సముద్రంలోని రెండో అతిపెద్ద దీవి సార్డినీయా. ఇది ఇటలీ అధీనంలో ఉంది. ఈ అందాల దీవిలో స్థిరపడటానికి ఎవరైనా వెళితే, అక్కడి ప్రభుత్వం 15 వేల యూరోలు (సుమారు రూ.12 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీవికి వెళ్లి స్థిరపడాలనుకునే వారికి డబ్బు పందేరం చేయడం కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఇటలీ ప్రభుత్వం 45 మిలియన్‌ యూరోలు (రూ.356 కోట్లు) కేటాయించింది. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద డబ్బు తీసుకున్నవారు సార్డినీయా దీవిలోని ఏదైనా పట్టణం లేదా గ్రామంలో ఇల్లు కొనుక్కోవడానికి, మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అద్భుతమైన వాతావరణం, చక్కని ప్రకృతి వనరులు ఉన్నా, ఆ దీవిలో తగినంత జనాభా లేకపోవ డంతో ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ( ఇంటి పంట: రూఫ్‌టాప్‌ పొలం.. 5.7 ఎకరాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement