Sardinia
-
‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం!
మధ్యదరా సముద్రంలోని రెండో అతిపెద్ద దీవి సార్డినీయా. ఇది ఇటలీ అధీనంలో ఉంది. ఈ అందాల దీవిలో స్థిరపడటానికి ఎవరైనా వెళితే, అక్కడి ప్రభుత్వం 15 వేల యూరోలు (సుమారు రూ.12 లక్షలు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ దీవికి వెళ్లి స్థిరపడాలనుకునే వారికి డబ్బు పందేరం చేయడం కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఇటలీ ప్రభుత్వం 45 మిలియన్ యూరోలు (రూ.356 కోట్లు) కేటాయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద డబ్బు తీసుకున్నవారు సార్డినీయా దీవిలోని ఏదైనా పట్టణం లేదా గ్రామంలో ఇల్లు కొనుక్కోవడానికి, మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అద్భుతమైన వాతావరణం, చక్కని ప్రకృతి వనరులు ఉన్నా, ఆ దీవిలో తగినంత జనాభా లేకపోవ డంతో ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ( ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) -
బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు
సార్డినియా: ఇప్పటి వరకు చాలా దొంగతనాల గురించి విన్నాం. ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. సాధరణంగా దొంగతనాలకు వచ్చే వారంతా లోపలికి రాగానే కత్తులుకటార్లు చూపించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. తిరగబడితే హంతకులుగా మారుతారు. అడ్డగోలుగా దొంగతనం చేయడంలో నైపుణ్యం చూపిస్తారే తప్ప క్రమశిక్షణ మాత్రం ఉండదు. అయితే, సర్దినియా దొంగలు మాత్రం క్రమశిక్షణగల సైనికులుగా వ్యవహరించారు. ఓ బ్యాంకును దోచుకునేందుకు వచ్చినవారంతా సైనికుల్లాగా మారిపోయి సైనికుల్లాగా టెక్నిక్స్ ఉపయోగించారు. సార్డినియాలోని ఓ బ్యాంకులోకి చొరబడినవారు వెంటనే బ్యాంకులో వాళ్లందరినీ కదిలితే కాల్చిపారేస్తామని, అంతా నేలపై కదలకుండా పడుకోవాలని ఆదేశించారు. ఆయుధాలతో నింపిన వాహనాన్ని ఏకంగా బ్యాంకు లోపలికి తీసుకొచ్చారు. ఆ వెంటనే అందులో నుంచి కుప్పలుగా సాయుధులు దిగి బ్యాంకులో సైనికుల్లాగా మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదులను తుదముట్టించే సైనికుల శైలిలో ముందుకు కదులుతూ బ్యాంకులో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులంతా లొంగిపోయిన ఉగ్రవాదుల మాదిరిగా నేలపై కిక్కురుమనకుండా పడుకున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. ఆ దొంగలను పట్టుకునేందుకు తాజాగా పోలీసు అధికారులు ఈ వీడియోను విడుదల చేశారు.