బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు | Security cameras reveal slick military tactics of armed gang in dramatic bank raid robbery in Sardinia | Sakshi
Sakshi News home page

బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు

Published Tue, Mar 22 2016 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు

బ్యాంకులో కవాతు చేసి సైనికుల స్టైల్లో దోచారు

సార్డినియా: ఇప్పటి వరకు చాలా దొంగతనాల గురించి విన్నాం. ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. సాధరణంగా దొంగతనాలకు వచ్చే వారంతా లోపలికి రాగానే కత్తులుకటార్లు చూపించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. తిరగబడితే హంతకులుగా మారుతారు. అడ్డగోలుగా దొంగతనం చేయడంలో నైపుణ్యం చూపిస్తారే తప్ప క్రమశిక్షణ మాత్రం ఉండదు.

అయితే, సర్దినియా దొంగలు మాత్రం క్రమశిక్షణగల సైనికులుగా వ్యవహరించారు. ఓ బ్యాంకును దోచుకునేందుకు వచ్చినవారంతా సైనికుల్లాగా మారిపోయి సైనికుల్లాగా టెక్నిక్స్ ఉపయోగించారు. సార్డినియాలోని ఓ బ్యాంకులోకి చొరబడినవారు వెంటనే బ్యాంకులో వాళ్లందరినీ కదిలితే కాల్చిపారేస్తామని, అంతా నేలపై కదలకుండా పడుకోవాలని ఆదేశించారు. ఆయుధాలతో నింపిన వాహనాన్ని ఏకంగా బ్యాంకు లోపలికి తీసుకొచ్చారు.

ఆ వెంటనే అందులో నుంచి కుప్పలుగా సాయుధులు దిగి బ్యాంకులో సైనికుల్లాగా మార్చ్ నిర్వహించారు. ఉగ్రవాదులను తుదముట్టించే సైనికుల శైలిలో ముందుకు కదులుతూ బ్యాంకులో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులంతా లొంగిపోయిన ఉగ్రవాదుల మాదిరిగా నేలపై కిక్కురుమనకుండా పడుకున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. ఆ దొంగలను పట్టుకునేందుకు తాజాగా పోలీసు అధికారులు ఈ వీడియోను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement